Home /News /technology /

HOW YOU CAN TRANSLATE MESSAGES ON TELEGRAM FULL DETAILS HERE GH VB

Telegram: టెలిగ్రామ్ నుంచి కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్​, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులోకి.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్వదేశీ ఇన్​స్టంట్​ మెసేజింగ్ యాప్​ టెలిగ్రామ్ రోజుకో కొత్త ఫీచర్​ను పరిచయం చేస్తూ వాట్సాప్​కు గట్టి పోటీనిస్తోంది. యూజర్​ బేస్​ పెంచుకోవడంపై దృష్టి పెట్టిన టెలిగ్రామ్​ వాట్సాప్​లో సైతం లేని ఫీచర్లను తీసుకొస్తుంది.

స్వదేశీ ఇన్​స్టంట్​ మెసేజింగ్ యాప్​ టెలిగ్రామ్(Telegram) రోజుకో కొత్త ఫీచర్​ను(New Feature) పరిచయం చేస్తూ వాట్సాప్​కు(Whatsapp) గట్టి పోటీనిస్తోంది. యూజర్​ బేస్​(User Base) పెంచుకోవడంపై దృష్టి పెట్టిన టెలిగ్రామ్​ వాట్సాప్​లో సైతం లేని ఫీచర్లను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ట్రాన్స్​లేషన్(Translation)​ అనే ఫీచర్​ను పరిచయం చేసింది. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు తమకు నచ్చిన భాషలోకి మెసేజ్‌లను ట్రాన్స్​లేట్(Translate) చేసుకోవచ్చు. అంతేకాదు, దీనికి సంబంధించిన యూజర్​ ఇంటర్​ఫేజ్​ను సైతం టెలిగ్రామ్​(Telegram) మెరుగుపర్చింది. కాగా, ఈ నెల ప్రారంభంలోనే ట్రాన్స్​లేషన్​ ఫీచర్​ను తీసుకొచ్చింది టెలిగ్రామ్​. ఈ కొత్త ఫీచర్​ను​ ఆండ్రాయిడ్(Android)​, ఐఓఎస్(IOS)​ రెండింటిలోనూ అందుబాటులోకి తెచ్చింది.

ప్రస్తుతం టెలిగ్రామ్​కు గట్టి పోటీనిస్తోన్న పాపులర్​ ఇన్​స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మాత్రం ట్రాన్స్​లేషన్​ ఫీచర్ ఇప్పటికీ అందుబాటులో లేదు. అందుకే, వాట్సాప్​ యూజర్లను తన వైపుకు తిప్పుకునేలా ఈ ఫీచర్​ను పరిచయం చేసింది. మీరు టెలిగ్రామ్​లో ఏదైనా మెసేజ్​ను ట్రాన్స్​లేట్​ చేయాలనుకుంటే ఇలా చేయండి.

Budget 2022 - E passport: అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్ పోర్ట్ విధానం.. నిర్మలా సీతారామన్

టెలిగ్రామ్​ మెసేజ్‌లను ఎలా ట్రాన్స్​లేట్​ చేయాలి?
టెలిగ్రామ్ యాప్​ను ఓపెన్​ చేసి 'హాంబర్గర్' ఐకాన్​పై క్లిక్​ చేయండి. ‘సెట్టింగ్స్’ ఆప్షన్​లోకి వెళ్తే లాంగ్వేజ్​ మెనూ కనిపిస్తుంది. ఇప్పుడు లాంగ్వేజ్​ మెనూ ఎగువ మూలలో కనిపించే ‘షో ట్రాన్స్​లేషన్​ బటన్​’పై క్లిక్​ చేయండి. ఇక్కడ టెలిగ్రామ్ అందించే భాషల జాబితా కనిపిస్తుంది. స్క్రీన్ పైభాగంలో ‘డూ ట్రాన్స్​లేట్​ బటన్​’పై క్లిక్​ చేయండి. ఆ తర్వాత మీరు ట్రాన్స్​లేట్​ చేయదల్చుకున్న లోకల్​ లాంగ్వేజ్​ను ఎంచుకోండి. మీ లోకల్​ లాంగ్వేజ్​ యాక్టివేట్ అయిన తర్వాత, ట్రాన్స్​లేట్​ చేయాలనుకున్న మెసేజ్‌పై నొక్కండి. వెంటనే పాప్-అప్ విండో ఓపెన్​ అవుతుంది. మీరు ఎంచుకున్న లాంగ్వేజ్​లో మెసేజ్‌లు ట్రాన్స్​లేట్​ అవుతాయి. ఆ కంటెంట్​ను పాప్​ అప్​ విండోలో చూసుకోవచ్చు.

Jio, Airtel, Vi అందించే ఈ డేటా బూస్టర్ ప్లాన్ల గురించి మీకు తెలుసా..? కేవలం రూ. 15 నుంచే..

కాగా, జనవరి 2న టెలిగ్రామ్ సరికొత్త ట్రాన్స్​లేషన్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, యాప్​లో కొత్త అప్‌డేట్​ను సైతం చేర్చింది. దీనికి అదనంగా క్యూఆర్​ కోడ్‌లు, సందేశాలకు రియాక్షన్స్​ వంటివి కూడా చేర్చింది. సందేశంలో కొంత భాగాన్ని దాచడానికి అనుమతించే హైడ్​, స్పాయిలర్ టెక్స్ట్‌లు ఫీచర్​ను కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం, ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ వినియోగదారులందరికీ అందుబాటులో ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: New feature, Telegram, Whatsapp

తదుపరి వార్తలు