మీ ఆధార్ కార్డ్ వివరాల్ని ఎవరెవరికి ఇచ్చారు? తెలుసుకోవాలంటే ఇలా చెయ్యండి

Aadhaar Card Trick : ఈ రోజుల్లో ప్రతీ దానికీ ఆధార్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. అవసరం లేని చోట ఆ వివరాల్ని డిలీట్ చేయించడం మేలు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 5, 2019, 9:01 AM IST
మీ ఆధార్ కార్డ్ వివరాల్ని ఎవరెవరికి ఇచ్చారు? తెలుసుకోవాలంటే ఇలా చెయ్యండి
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: March 5, 2019, 9:01 AM IST
ఆధార్ కార్డ్ వచ్చాక... చాలా అవసరాల కోసం మనం దాన్ని వాడుతున్నాం. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా మన ఆధార్ కార్డ్ వివరాలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఏదైనా అవసరానికి మనం ఆధార్ వివరాలు ఇచ్చేసిన తర్వాత ఏ సుప్రీంకోర్టో... ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన పని లేదని చెబుతోంది. అప్పుడు మనం ఇచ్చిన వివరాల్ని డిలీట్ చేశారో లేదో మనకు తెలీదు. సపోజ్ టెలికం కంపెనీలు సిమ్ కార్డ్ ఇవ్వడానికి ఇదివరకు ఆధార్ కార్డు నెంబర్ తీసుకునేవి. సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత తీసుకోవడం మానేశాయి. ఐతే... అప్పటికే తీసుకున్నవారి ఆధార్ వివరాల్ని తొలగించాల్సిన బాధ్యత టెలికం కంపెనీలపై ఉంది. మరి వాళ్లు డేటా తొలగించారో లేదో తెలియాలంటే ఎలా అన్నది ఓ సమస్య. ఇలా ఎంత మంది మన డేటాను తొలగించకుండా ఉంచారో తెలుసుకుంటే, వెంటనే తొలగించమని అడగడానికి వీలవుతుంది. ఇందుకోసం ఆధార్‌ను నిర్వహిస్తున్న https://uidai.gov.in వెబ్‌సైట్‌లో ఓ ఆప్షన్ ఉంది. మీ ఆధార్‌ను మీరు ఎక్కడెక్కడ ఉపయోగించారో, ఎవరెవరికి ఆధార్ నంబర్ ఇచ్చారో హిస్టరీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇలా చెయ్యండి.

* ఈ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజీలోకి వెళ్లండి. https://resident.uidai.gov.in/notification-aadhaar

* మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చెయ్యండి. రెండో బాక్సులో పక్కనున్న నంబర్ కోడ్‌ను ఎంటర్ చెయ్యండి.

* జనరేట్ OTPపై క్లిక్ చెయ్యండి.* మీ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దాన్ని వెబ్‌సైట్‌లో OTP అన్న చోట ఎంటర్ చెయ్యండి.

aadhar card, aadhar card download, aadhaar card, aadhar, how to download aadhar card, aadhar card kaise download kare, aadhar card update, download aadhar card, aadhar card address change, how to download aadhar card online, how to download aadhar card in mobile, aadhar card kaise nikale, aadhar card kaise check kare, adhar card kaise nikale, aadhar card correction online, adhar card, new aadhar card, ఆధార్ కార్డు, ఆధార్ నంబర్, ఆధార్ కార్డ్ వివరాలు, ఆధార్ కార్డు చోరీ, ఆధార్ కార్డు రహస్యాలు, ఆధార్ నంబర్ ఎంత, ఆధార్ లో పేరు మార్పు, ఆధార్ కార్డు ఎలా, ఆధార్ కావాలంటే, ఆధార్ డిలీట్, ఆధార్ సీక్రెట్స్, ఆధార్ సస్పెన్స్
ప్రతీకాత్మక చిత్రం

* ఇప్పుడు మీరు Authentication Type దగ్గర ALl ఆప్షన్ ఉంచండి.
Loading...
* Select Date range దగ్గర ఎప్పటి నుంచీ ఎప్పటివరకూ రేంజ్ చూపించాలో డేట్స్ ఇవ్వండి.
* Number of Records దగ్గర 50 ఇవ్వండి.
* ఇప్పుడు సబ్‌మిట్ పై క్లిక్ చెయ్యండి.
* ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్‌ను ఎవరెవరికి ఇచ్చిందీ వివరాలు వస్తాయి. వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.

aadhar card, aadhar card download, aadhaar card, aadhar, how to download aadhar card, aadhar card kaise download kare, aadhar card update, download aadhar card, aadhar card address change, how to download aadhar card online, how to download aadhar card in mobile, aadhar card kaise nikale, aadhar card kaise check kare, adhar card kaise nikale, aadhar card correction online, adhar card, new aadhar card, ఆధార్ కార్డు, ఆధార్ నంబర్, ఆధార్ కార్డ్ వివరాలు, ఆధార్ కార్డు చోరీ, ఆధార్ కార్డు రహస్యాలు, ఆధార్ నంబర్ ఎంత, ఆధార్ లో పేరు మార్పు, ఆధార్ కార్డు ఎలా, ఆధార్ కావాలంటే, ఆధార్ డిలీట్, ఆధార్ సీక్రెట్స్, ఆధార్ సస్పెన్స్
ప్రతీకాత్మక చిత్రం

ఆనక అవసరం లేని దగ్గర నుంచీ ఆధార్ కార్డ్ వివరాల్ని డిలీట్ చేయించవచ్చు. అలాగే ఎవరికైనా ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటే వెంటనే ఇచ్చేయవచ్చు.

ఇవి కూడా చదవండి :

ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్

యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి
First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...