ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp)ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, ప్రియమైన వారితో చాట్ చేయడానికి, కమ్యూనికేట్(Communicate) కావడానికి యూజ్ చేస్తున్నారు. అయితే యూజర్లు తమ చాట్స్(Chats) ఒక్కోసారి దాచిపెట్టాలని అనుకుంటారు. కానీ వాట్సాప్ లో చాట్ హైడ్ (Chat Hide) చేసే ఆప్షన్ ప్రత్యేకంగా అందుబాటులో లేదు. అలాగని ఉంచుకోలేని కొన్ని చాట్‌లను డిలీట్ చేయడానికి కూడా ఇష్టపడరు. అయితే వాట్సాప్ లోని ఒక ఫీచర్ సాయంతో మీకు కావాల్సిన చాట్స్‌ను చాట్ లిస్ట్ పేజీలో(List Page) కనిపించకుండా చేయవచ్చు. వాట్సాప్ చాట్‌ను హైడ్ లేదా ఆర్కైవ్ చేయడానికి ఆర్కైవ్ (Archive) చాట్ ఫీచర్‌ను యూజ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌తో మీ ఇండివిడ్యువల్(Individual) లేదా గ్రూప్ చాట్స్‌ను చాలా ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చాట్‌ను ఆర్కైవ్ చేయడం వల్ల చాట్ మొత్తం డిలీట్ అవ్వదు. అలాగే మీ ఎస్‌డీ కార్డ్ లేదా ఐక్లౌడ్ కి బ్యాకప్ అవ్వదు. ఈ చాట్ మెసేజెస్ మొత్తం మీ వాట్సాప్ లోనే స్టోర్ అయి ఉంటాయి. ఆర్కైవ్‌డ్ (Archived) చాట్స్ నుంచి కొత్త మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్ నోటిఫికేషన్ రాదు. కొత్తగా ఎన్ని మెసేజ్‌లు వచ్చినా ఆర్కైవ్‌డ్ (Archived) ఇండివిడ్యువల్ లేదా ఆర్కైవ్‌డ్ గ్రూప్ చాట్‌లు ఆర్కైవ్డ్ లిస్టులోనే ఉంటాయి. మెయిన్ చాట్ లిస్ట్ పేజీలో కూడా ఇవి కనిపించవు. ఆర్కైవ్డ్ గ్రూప్ చాట్‌లో మిమ్మల్ని మెన్షన్ చేసినా లేదా మీ మెసేజ్‌కి రిప్లై ఇచ్చినా నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగతా ఈ సందర్భంలోనూ నోటిఫికేషన్లు రావు. ఐఫోన్, ఆండ్రాయిడ్ వెర్షన్లలో చాట్‌లను దాచడానికి ఫాలో కావాల్సింది స్టెప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Business Idea: ఈ బిజినెస్ కు సర్కార్ సాయం.. లక్షల కొద్దీ ఆదాయం.. తెలుసుకోండి
ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ చాట్స్‌ను దాచండిలా
1. చాట్స్ ట్యాబ్‌లో ఒక ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌ను ఆర్కైవ్ చేయడానికి, మీరు దాచాలనుకుంటున్న చాట్‌పై నొక్కి పట్టుకోండి. ఆపై స్క్రీన్ పైన ఉన్న డౌన్ యారో గుర్తుపై నొక్కండి.
2. అన్ని చాట్‌లను ఆర్కైవ్ చేయడానికి- చాట్స్ ట్యాబ్‌లో, మోర్ ఆప్షన్స్ > సెట్టింగ్స్ నొక్కండి. ఆపై చాట్స్ > చాట్ హిస్టరీ > ఆర్కైవ్ ఆల్ చాట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. ఆర్కైవ్డ్ ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌ను వీక్షించడానికి చాట్స్ స్క్రీన్ లో టాప్ ఎండ్ కి స్క్రోల్ చేయండి. ఆపై ఆర్కైవ్‌ని నొక్కండి. ఇప్పుడు ఆర్కైవ్‌డ్ చాట్స్ మీకు కనిపిస్తాయి. అక్కడ కొత్తగా వచ్చిన మెసేజెస్ చెక్ చేసుకోవచ్చు.
ఐఫోన్‌లో వాట్సాప్ చాట్‌లను హైడ్ చేయండిలా
1. ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌ను ఆర్కైవ్ చేయడానికి చాట్స్ ట్యాబ్‌లో మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న చాట్ లేదా గ్రూప్‌పై ఎడమవైపుకు స్వైప్ చేయండి. ఆపై ఆర్కైవ్ నొక్కండి. మీరు వాట్సాప్ సెట్టింగ్స్> చాట్స్> ఆర్కైవ్ ఆల్ చాట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అన్ని చాట్‌లను ఒకేసారి ఆర్కైవ్ చేయవచ్చు.
2. ఆర్కైవ్డ్ చాట్స్ లేదా గ్రూప్స్ వీక్షించడానికి చాట్స్ ట్యాబ్ పైకి స్క్రోల్ చేయండి. ఆర్కైవ్డ్ పై నొక్కండి
ఆండ్రాయిడ్‌లో ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌ను అన్‌ఆర్కైవ్ (Unarchive) చేయండిలా
1. చాట్ లిస్ట్ స్క్రీన్ పైభాగానికి స్క్రోల్ చేయండి.
2. ఆర్కైవ్డ్ ఆప్షన్‌పై నొక్కండి.
3. మీరు అన్‌ఆర్కైవ్ చేయాలనుకుంటున్న ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌ని నొక్కి పట్టుకోండి.
4. స్క్రీన్ పైన అన్‌ఆర్కైవ్‌పై క్లిక్ చేయండి.
ఐఫోన్‌లో ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను అన్‌ఆర్కైవ్ చేయండిలా
1. ఆర్కైవ్డ్ చాట్‌ల స్క్రీన్‌లో ఒక ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ చాట్‌పై ఎడమవైపుకు స్వైప్ చేయండి. ఆపై అన్‌ఆర్కైవ్‌ని నొక్కండి.
2. మీరు చాట్‌ను మాన్యువల్‌గా అన్‌ఆర్కైవ్ చేయవచ్చు.
3. చాట్స్ ట్యాబ్‌లో సెర్చ్ బార్‌ను ట్యాప్ చేయండి.
4. చాట్ పేరును టైప్ చేసి ఓకే నొక్కండి. మీకు కావలసిన చాట్‌పై ఎడమవైపుకు స్వైప్ చేయండి. ఆపై అన్‌ఆర్కైవ్‌పై నొక్కండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, New features, Technology, Whatsapp