Gmail : మెయిల్ సర్వీస్ అంటే ప్రతి ఒక్కరికీ ముందు గుర్తొచ్చే పేరు జీమెయిల్(Gmail). స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక యూజర్లకు మెయిల్ తప్పనిసరి అవసరంగా మారింది. దీంతో ఈ గూగుల్ మెయిల్ సర్వీస్ పాపులారిటీ ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. అయితే చాలామంది యూజర్లు జీమెయిల్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసే, స్టోర్ చేసే డేటా సెక్యూరిటీపై పెద్దగా దృష్టి పెట్టరు. దీంతో సెన్సిటివ్ డేటా ఇతరుల చేతికి చేరితే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జీమెయిల్ డేటాకు అన్-ఆథరైజ్డ్ యాక్సెస్ లేకుండా ఒక ఫీచర్‌ను అందిస్తోంది గూగుల్. అదే జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్.
కాన్ఫిడెన్షియల్ మోడ్ అనేది, జీమెయిల్ యూజర్ల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను రక్షిస్తుంది. ఇతరులు మీ మెసేజ్‌లు, అటాచ్‌మెంట్లను ఫార్వర్డ్, కాపీ, ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేయకుండా కాపాడుతుంది. యూజర్లు మెసేజ్ ఎక్స్‌పైరేషన్ డేట్‌ను కూడా సెట్ చేయవచ్చు. ఏ సమయంలోనైనా మెసేజ్ యాక్సెస్‌ను ఉపసంహరించుకోవచ్చు. మెయిల్ ఓపెన్ చేయడానికి మెసేజ్ ద్వారా వెరిఫికేషన్ కోడ్ సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌లో మెయిల్స్ ఎలా పంపాలి?
కాన్ఫిడెన్షియల్ మోడ్‌లో ఇమెయిల్ పంపాలనుకునే యూజర్లు, కంప్యూటర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి, ‘కంపోజ్ ఇమెయిల్’పై క్లిక్ చేయాలి. ఈ విండో కింది భాగంలో కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్‌లో లాక్ ఐకాన్‌తో ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే.. టైమర్‌తో లాక్ చేసుకునే ఆప్షన్లు కనిపిస్తాయి.
ఇక్కడ మెసేజ్ ఎక్ప్‌పైర్ అయ్యే టైమ్, డేట్‌ను సెట్ చేసుకోవచ్చు. అలాగే SMS పాస్‌కోడ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. SMS పాస్‌కోడ్‌ను ఆన్ చేస్తే.. యూజర్లు టెక్స్ట్ మెసేజ్‌కు పాస్‌కోడ్ పొందుతారు. దీని సాయంతోనే మెయిల్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ‘No SMS passcode’ను సెలక్ట్ చేస్తే.. యూజర్లు నేరుగా మెయిల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ సాయంతో ఇతరులు మీ మెయిల్‌ను కాపీ, ఫార్వర్డ్, ప్రింట్, డౌన్‌లోడ్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయవచ్చు.
లోపాలు ఇవే..
అయితే ఇతరులు మీ మెసేజ్‌లు, అటాచ్‌మెంట్లు, ఫోటోలను స్క్రీన్‌షాట్ తీయకుండా కాన్ఫిడెన్షియల్ మోడ్ అడ్డుకోలేదు. డివైజ్‌లలో మాల్వేర్, ప్రమాదకరమైన థర్డ్ పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నా, కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను దాటుకొని మీ మెసేజ్‌లు, అటాచ్‌మెంట్స్, ఫోటోలను ఇతరులు కాపీ చేయగలరు లేదా డౌన్‌లోడ్ చేయగలరు.
Viral Video : హ్యాట్సాఫ్ : లక్ష సార్లు రామ్ అని రాసి రాముడు,సీత,లక్షణుడు,హనుమంతుడి చిత్రం
కాన్పిడెన్షియల్ ఇమెయిల్‌కు యాక్సెస్ ఎలా తీసివేయాలి..?
జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో, గడువు తేదీకి ముందు రిసీవర్ ఇమెయిల్‌ను చూడకుండా రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఇందుకు మీ కంప్యూటర్‌లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. సెండ్ లిస్ట్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో సెండ్ చేసిన మెయిల్ కనిపిస్తుంది. దీనికి కుడివైపున ‘Remove access’ను క్లిక్ చేస్తే, రిసీవర్‌కు మెయిల్ యక్సెస్ రిమూవ్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GMAIL