హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Maps: గూగుల్ మ్యాప్స్ లో.. ఫాస్ట్ నావిగేషన్ కోసం ఇలా చేయండి..

Google Maps: గూగుల్ మ్యాప్స్ లో.. ఫాస్ట్ నావిగేషన్ కోసం ఇలా చేయండి..

గూగుల్​ మ్యాప్స్​లో అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఉదాహరణకు, ఇంటి నుంచి ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే క్రమంలో మధ్యలో ఉన్న ట్రాఫిక్​, టైమ్​ ఎస్టిమేషన్​ కోసం ప్రతి రోజూ ఆఫీస్​, హోమ్​ అడ్రస్​ ఎంటర్​ చేస్తుంటారు.

ఇంకా చదవండి ...

  సెర్చ్​ ఇంజిన్(Search Engine)​ దిగ్గజం గూగుల్​కు (Google) చెందిన గూగుల్​ మ్యాప్స్ (Google Maps) గురించి తెలియని వారుండరు. ఏదైనా అడ్రస్(Address)​ కనుక్కునేందుకు వెంటనే గూగుల్​ మ్యాప్​ ఓపెన్​ చేస్తాం. దాని సహాయంతో కచ్చితమైన లొకేషన్​ను(Location) సులభంగా చేరుకుంటాం. అయితే గూగుల్​ మ్యాప్స్​లో(Google Maps) అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఉదాహరణకు, ఇంటి నుంచి ప్రతిరోజూ ఆఫీసుకు(Office) వెళ్లే క్రమంలో మధ్యలో ఉన్న ట్రాఫిక్​, టైమ్​ ఎస్టిమేషన్​ కోసం ప్రతి రోజూ ఆఫీస్​, హోమ్​ అడ్రస్​ ఎంటర్​ చేస్తుంటారు.

  Led Smart Phone: రూ. 6,299 కే ఎల్ఈడీ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో సేల్స్ ఎప్పటినుంచంటే..

  అయితే ప్రతి రోజూ ఇలా ఆఫీస్ అడ్రస్​, మీ ఇంటి అడ్రస్​ ఎంటర్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఒక్కసారి మీ ఇంటి అడ్రస్​, ఆఫీస్​ అడ్రస్​ను టైప్ చేసి అప్​డేట్​ చేసుకోవడం ద్వారా పెద్ద శ్రమ తగ్గుతుంది. దీని ద్వారా సులభంగా, చాలా వేగంగా లొకేషన్​ను నావిగేట్​ చేసుకోవచ్చు. దీని కోసం కొన్ని సింపుల్​ స్టెప్స్​ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం.

  అడ్రస్​ ఎలా సెట్​ చేసుకోవాలి?

  ముందుగా నావిగేషన్ కోసం ఉపయోగించే మీ ఆండ్రాయిడ్​ లేదా ఐఓఎస్ డివైజ్​లో గూగుల్ మ్యాప్స్​ యాప్‌ని ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.

  హోమ్​ స్క్రీన్​ దిగువన ఉన్న “సేవ్డ్​” ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

  "యువల్​ లిస్ట్​" సెక్షన్​ క్రిందికి స్క్రోల్ చేయండి. "లేబుల్" ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

  తదుపరి స్క్రీన్‌లో "హోమ్", "వర్క్" సెక్షన్లను కనుగొంటారు. ఇక్కడ మీ ఇంటి, ఆఫీస్​ అడ్రస్​ను ఎంటర్​ చేసుకోండి.

  “సెట్​ హోమ్​ అడ్రస్​” పై క్లిక్​ చేయండి. మీ లొకేషన్​ను ఆన్​ చేసి ప్రస్తుత ఉన్న స్థానాన్ని అప్​డేట్​ చేయండి.

  Samsung Galaxy Tab A8: శామ్​సంగ్​ నుంచి మరో బడ్జెట్​ ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..

  ఆఫీస్ అడ్రస్‌ సెట్ చేయడానికి, “సెట్​ వర్క్ అడ్రస్​” ఆప్షన్​పై క్లిక్​ చేయండి. మ్యాప్‌లో మీ ఆఫీస్​ అడ్రస్​ను సెర్చ్​ చేయండి. దాన్ని అప్​డేట్​ చేసుకోండి. మీరు ఇప్పటికే మీ మునుపటి వివరాలను నమోదు చేసి ఉంటే, అడ్రస్​ను అప్​డేట్​ చేసుకునేందుకు బ్లూ కలర్​ ప్రాంప్ట్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆఫీస్​, హోమ్​ అడ్రస్​ను అప్​డేట్​ చేసుకోండి. ఆ తర్వాత నావిగేషన్ స్క్రీన్‌పై, మీకు ఇష్టమైన రవాణా విధానాన్ని ఎంచుకుని మీ లొకేషన్​ను చేరుకోవచ్చు. దీని ద్వారా ప్రతి సారీ మీ హోమ్, ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు.

  First published:

  Tags: Google Maps, Latest Technology

  ఉత్తమ కథలు