హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagramలో వానిష్ మోడ్ ఆన్, ఆఫ్ చేయడం ఎలా?

Instagramలో వానిష్ మోడ్ ఆన్, ఆఫ్ చేయడం ఎలా?

భవనం కట్టాలంటే పునాది అవసరం. అలాగే ఇన్ స్టా గ్రామ్‌కి కూడా వర్తిస్తుంది. ఇన్ స్టా గ్రామ్‌లో డబ్బు సంపాదించాలంటే ముందు దాని మీద మీర కొంత సమయం కేటాయించాలి. దాన్ని దీర్ఘకాలంలో ఆదాయం వచ్చే వనరుగా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

భవనం కట్టాలంటే పునాది అవసరం. అలాగే ఇన్ స్టా గ్రామ్‌కి కూడా వర్తిస్తుంది. ఇన్ స్టా గ్రామ్‌లో డబ్బు సంపాదించాలంటే ముందు దాని మీద మీర కొంత సమయం కేటాయించాలి. దాన్ని దీర్ఘకాలంలో ఆదాయం వచ్చే వనరుగా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

Instagram Vanish Mode: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా గ్రాం తమ లక్షలాది మంది యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో వానిష్ మోడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

  ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా గ్రాం తమ లక్షలాది మంది యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో వానిష్ మోడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ వానిష్ మోడ్‌ ఆన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరితో అయినా చాట్ చేసిన తర్వాత వారు ఆ మెసేజ్ చూసి బయటకు వచ్చిన వెంటనే ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా అదృశ్యం అయిపోతుంది. వానిష్ మోడ్ గురించి మరింతగా తెలుసుకోండి. దాన్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి. ఈ పని చేయడానికి ముందు మీరు లేటెస్ట్ అప్ డేటెడ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

  ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

  Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

  TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు

  Instagramలో వానిష్ మోడ్‌ ఎలా ఆన్ చేసుకోవాలి?

  1. మొదట మీ మొబైల్‌లో ఇన్ స్టా గ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి.

  2. టాప్‌లో కుడివైపు 'direct or messenger' ఐకాన్ మీద ట్యాప్ చేయండి.

  3. వానిష్ మోడ్‌ను ఎనేబుల్ చేయడానికి ఏదైనా చాట్ విండోను ఓపెన్ చేయండి.

  4. స్క్రీన్ మీద కింద నుంచి పైకి స్వైప్ చేయండి. అప్పుడు వానిష్ మోడ్ యాక్టివేట్ అవుతుంది.

  5. వానిష్ మోడ్ యాక్టివేట్ అయిన తర్వాత అప్పటి వరకు రీడ్ అయిన మెసేజ్‌లు అన్నీ డిలీట్ అయిపోతాయి.

  Instagramలో వానిష్ మోడ్‌ ఎలా ఆఫ్ చేసుకోవాలి?

  వానిష్ మోడ్ డిసేబుల్ చేసుకోవాలంటే మళ్లీ అప్లికేషన్‌లో చాట్ విండో ఓపెన్ చేయండి.

  చాట్ విండో పైన కుడివైపు ‘turn off vanish mode' ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వానిష్ మోడ్ ఆఫ్ అవుతుంది.

  ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

  Hacking Apps: ఈ యాప్స్ వాడితే మీ డేటా గోవిందా అంటున్న నిపుణులు

  విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

  అక్టోబర్‌లో కొత్త ఫీచర్ తెచ్చిన ఇన్ స్టా గ్రామ్

  ఈ ఏడాది అక్టోబర్‌లో ఇన్ స్టా గ్రామ్ కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన ఈ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం, యాప్‌లోని లైవ్‌స్ట్రీమింగ్ కాల వ్యవధిని నాలుగు గంటల వరకు పొడిగించింది. గతంలో లైవ్‌స్ట్రీమ్‌ డ్యూరేషన్ 60 నిమిషాలుగా ఉండేది. ఈ సదుపాయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది. యోగా టీచర్లు, మ్యుజీషియన్లు, కళాకారులు, కుక్‌లు వంటి వారికి ఈ సదుపాయం ఉపయోగపడనుందని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. ప్రతీ గంటకు వారి లైవ్ స్ట్రీమ్ కు అంతరాయం కలగకుండా, ప్రేక్షకులతో ఎక్కువ సేపు సెషన్లు నిర్వహించుకోవడానికి ఇప్పుడు వీలు ఉంటుంది. గతంలో ఐపీ, పాలసీ ఉల్లంఘనలకు పాల్పడని కంటెంట్ క్రియేటర్లకు, యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Instagram, Social Media

  ఉత్తమ కథలు