Home /News /technology /

HOW TO TRANSLATE TELEGRAM MESSAGES IN YOUR LANGUAGE GH VB

Telegram: టెలిగ్రామ్​లో కొత్త ఫీచర్​.. మెసేజ్​లను లోకల్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్​లేట్​ చేసుకునే అవకాశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెలిగ్రామ్​ ఈ నెల ప్రారంభంలో ట్రాన్స్​లేషన్​ ఫీచర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్​లో ఇప్పుడు ఓ కొత్త అప్‌డేట్‌ను జోడించింది. ఈ కొత్త అప్​డేట్​ ప్రకారం, యూజర్లు తమకు వచ్చిన మెసేజ్​లను వారి స్థానిక భాషలోకి ట్రాన్స్​లేట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
స్వదేశీ ఇన్​స్టంట్​ మెసేజింగ్(Messaging) యాప్​ టెలిగ్రామ్(Telegram)​ రోజుకో కొత్త ఫీచర్​ను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అనేక ఫీచర్లను పరిచయం చేసి యూజర్​ బేస్​ పెంచుకున్న టెలిగ్రామ్​ ఈ నెల ప్రారంభంలో ట్రాన్స్​లేషన్​ ఫీచర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్​లో ఇప్పుడు ఓ కొత్త అప్‌డేట్‌ను జోడించింది. ఈ కొత్త అప్​డేట్​ ప్రకారం, యూజర్లు తమకు వచ్చిన మెసేజ్​లను వారి స్థానిక భాషలోకి ట్రాన్స్​లేట్(Translate) చేసుకోవచ్చు. అంతేకాదు, మీకు నచ్చిన భాషను డిఫాల్ట్​గా సెట్​ చేసుకోవచ్చు. తద్వారా మీకు వచ్చే ప్రతి మెసేజ్​ డిఫాల్ట్​గా మీ స్థానిక భాషలోకి అనువాదం అవుతుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ రెండింటిలోనూ అందుబాటులో వచ్చింది.

అయితే, ప్రస్తుతం టెలిగ్రామ్​కు గట్టి పోటీనిస్తోన్న పాపులర్​ ఇన్​స్టంట్​ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​లో మాత్రం ట్రాన్స్​లేషన్​ ఫీచర్​ అందుబాటులో లేదు. దీంతో, వాట్సాప్​ యూజర్లను తన వైపు తిప్పుకునేలా ఈ సరికొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. మీరు టెలిగ్రామ్‌లో ఏదైనా మెసేజ్‌ను ట్రాన్స్​లేట్​ చేయాలనుకుంటే ఇలా చేయండి.

Economic Survey: పార్లమెంట్​ ముందుకు ఆర్థిక సర్వే.. జీడీపీ వృద్ధి ఎంతంటే..?


టెలిగ్రామ్ సందేశాలను ఎలా ట్రాన్స్​లేట్​ చేయాలి?

స్టెప్​ 1: ఈ ఫీచర్​ను ఉపయోగించడం చాలా సులభం. అయితే, ఈ ఫీచర్ సెల్ఫ్​ యాక్టివేషన్​ కాదు. కాబట్టి, ముందుగా మీ టెలిగ్రామ్​ యాప్​లో ఫీచర్​ను ఎనేబుల్​ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 2: దీని కోసం టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి, హాంబర్గర్ ఐకాన్​పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3: సెట్టింగ్‌లోకి వెళ్లి లాంగ్వేజ్ ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 4: లాంగ్వేజ్​ మెనూ ఎగువ కుడి మూలలో కనిపించే ‘షో ట్రాన్స్​లేట్ బటన్‌’పై క్లిక్​ చేయండి.

Union Budget: ఈ బడ్జెట్​లో వర్క్​ ఫ్రం హోం చేసేవారికి గుడ్​న్యూస్? పన్ను మినహాయింపులు ఉండే ఛాన్స్?


స్టెప్ 5: షో ట్రాన్స్​లేట్​ బటన్‌కు కుడి దిగువన ఉన్న 'డు నాట్​ ట్రాన్స్​లేట్​’ అని మరో ఆప్షన్​ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అవసరం లేని భాషలను డిలీట్​ చేసుకోవచ్చు. అయితే, మీరు టెలిగ్రామ్‌ని ఉపయోగిస్తున్న భాషలో ట్రాన్స్​లేషన్​ ఆప్షన్​ను పొందలేరు. ఉదాహరణకు, మీరు టెలిగ్రామ్‌ని ఇంగ్లిష్​లో ఉపయోగిస్తే, ఇంగ్లీష్​ భాష నుంచి ఇతర భాషలకు డిఫాల్ట్‌గా ట్రాన్స్​లేట్​ చేసుకోలేరు.

స్టెప్​ 6: ట్రాన్స్​లేషన్​ ఫీచర్​​ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే అనేక పాపులర్​ లాంగ్వేజ్​లలోకి మెసేజ్​లను ట్రాన్స్​లేట్​ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్​ హిందీ భాషకు మద్దతు ఇవ్వదు.

స్టెప్​ 7: ఫీచర్​ను యాక్టివేట్​ చేసుకునేందుకు ఏదైనా చాట్ లేదా గ్రూప్‌కి వెళ్లి మీరు ట్రాన్స్​లేట్​ చేయాలనుకునే మెసేజ్​పై నొక్కండి. వెంటనే మీకు ‘ట్రాన్స్​లేషన్​’ పాప్ అప్ మెనూ ఓపెన్​ అవుతుంది.

స్టెప్​ 8: అక్కడ ట్రాన్స్​లేషన్​పై క్లిక్ చేయండి. దీంతో, మీ మెసేజ్​లు టెలిగ్రామ్ డిఫాల్ట్ భాషలోకి ట్రాన్స్​లేట్ అవుతాయి.
Published by:Veera Babu
First published:

Tags: Technology, Telegram

తదుపరి వార్తలు