HOW TO TRANSFER YOUR WHATSAPP CHAT HISTORY FROM ANDROID TO IPHONE UMG GH
WhatsApp: ఐఫోన్ కొత్త యూజర్స్‌కి గుడ్ న్యూస్.. వాట్సాప్ డేటా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ కోసం
ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ డేటా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి
ఐఫోన్ (iPhone)కి మారాలనుకుంటున్న ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు వాట్సాప్ (WhatsApp) గుడ్ న్యూస్ చెప్పింది. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ (Android to iPhone)కు వాట్సాప్ డేటాను సులభంగా ట్రాన్స్ఫర్ (Transfer) చేసుకునేందుకు ఈ మెసేజింగ్ యాప్ వీలు కల్పించింది.
ఐఫోన్ (iPhone)కి మారాలనుకుంటున్న ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు వాట్సాప్ (WhatsApp) గుడ్ న్యూస్ చెప్పింది. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ (Android to iPhone)కు వాట్సాప్ డేటాను సులభంగా ట్రాన్స్ఫర్ (Transfer) చేసుకునేందుకు ఈ మెసేజింగ్ యాప్ వీలు కల్పించింది. తాజాగా వాట్సాప్, యాపిల్ సంస్థలు ఆండ్రాయిడ్‌లోని మెసేజింగ్ యాప్ నుంచి ఐఓఎస్‌కి డేటా ట్రాన్స్‌ఫర్‌కు సపోర్టు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను అందిస్తూనే ఐఫోన్-టు-ఆండ్రాయిడ్‌తో పాటు ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య చాట్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌ల వంటి డేటాను ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీని వాట్సాప్‌కు జోడిస్తున్నామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ డేటాను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రాన్స్ఫర్ చేయాలంటే ముందుగా మీ వద్ద ఇంకా సెటప్ చేయని కొత్త ఐఫోన్ (iPhone) తప్పనిసరిగా ఉండాలి. పాత ఐఫోన్ ఉన్నా సరే మీరు దానిని ఫ్యాక్టరీ రీసెట్ (Factory Reset) చేసి ఈజీగా ఆండ్రాయిడ్ నుంచి వాట్సాప్ డేటాను బదిలీ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ విషయానికి వస్తే అది ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఓఎస్ వెర్షన్‌పై పని చేస్తుండాలి. అలానే మీ ఐఫోన్లో ఐఓఎస్ 15.5 కూడా అవసరం.
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే నుంచి మూవ్ టు ఐఓఎస్ (Move to iOS) యాప్‌ని డౌన్లోడ్ చేయాలి.
2. మూవ్ టు ఐఓఎస్ (Move to iOS) యాప్‌లో ఎంటర్ సింగిల్ యూజ్ కోడ్ (Enter Single Use Code) స్క్రీన్ కనిపించేంత వరకు అన్ని ఇన్స్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి.
3. మూవ్ టు ఐఓఎస్ యాప్‌లో ఎంటర్ సింగిల్ యూజ్ కోడ్ కనిపించిన తర్వాత మీ కొత్త లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేసిన ఐఫోన్ సెటప్ ప్రక్రియను స్టార్ట్ చేయాలి.
4. అప్పుడు మీకు మీ ఐఫోన్ స్క్రీన్‌లో యాప్స్ & డేటా సెటప్ పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలో మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ (Move data from Android) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5. "ఎంటర్ దిస్ వన్ టైమ్ కోడ్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ డివైజ్" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ కోడ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లోని ఎంటర్ సింగిల్ యూజ్ కోడ్ వద్ద ఎంటర్ చేయాలి.
6. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఆ కోడ్‌ని ఎంటర్ చేశాక "కంటిన్యూ" పై నొక్కాలి.
7. ఇప్పుడు మీకు "డేటా ట్రాన్స్ఫర్" అని స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో మెసేజెస్, కాంటాక్ట్స్, క్యాలెండర్ వంటి వాటితో పాటు వాట్సాప్ అని కనిపిస్తుంది. ఆపై వాట్సాప్ (WhatsApp)పై క్లిక్ చేసి స్టార్ట్/కంటిన్యూ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
8. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ ట్రాన్స్ఫర్ డేటాను ప్రిపేర్ చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ తర్వాతి ఇన్స్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఐఫోన్‌కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి.
9. అనంతరం ఐఫోన్ సెటప్ పూర్తిచేసి వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్‌ను ఏ నంబర్‌తో యూజ్ చేస్తున్నారో అదే నంబర్‌తో ఐఫోన్‌లోని వాట్సాప్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. తర్వాత మూవ్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ కనిపించగానే ఓకే నొక్కాలి.
ఈ స్టెప్స్ ఫాలో అయ్యాక, మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని వాట్సాప్ చాట్ హిస్టరీ మీ కొత్త ఐఫోన్లో కనిపిస్తుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.