Home /News /technology /

HOW TO TRANSFER WHATSAPP CHAT HISTORY TO I PHONE FROM AN ANDROID SMART PHONE FULL DETAILS HERE PRV GH

WhatsApp: సింపుల్ స్టెప్స్‌తో వాట్సాప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండిలా..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

టెక్ నిపుణుల ప్రకారం ఆండ్రాయిడ్ యూజర్లు తమ కొత్త ఐఫోన్‌కు సులభంగా వాట్సాప్ చాట్ హిస్టరీ (Chat History)ని షేర్ చేసుకోవచ్చు. ఇందుకు గూగుల్ జిమెయిల్ బెస్ట్ టూల్‌గా పనిచేస్తుంది. గూగుల్ జిమెయిల్‌ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్ హిస్టరీని ఈజీగా ఎలా షేర్​ చేయవచ్చు.

ఇంకా చదవండి ...
సాధారణంగా ప్రజలు తమ ఫోన్‌లను కొన్ని సంవత్సరాల తర్వాత మార్చేస్తుంటారు. నిజానికి ఫోన్‌లను మార్చినా అంతగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఓల్డ్ ఫోన్‌లోని డేటాను కొత్త ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం ఈజీగా సాధ్యమవుతుంది. అయితే వాట్సాప్ (WhatsApp) విషయానికొస్తే మాత్రం, డేటా ట్రాన్స్‌ఫర్ (Data Transfer) చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారినప్పుడు వాట్సాప్ చాట్‌ డేటా, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు ఇలా మీడియా కంటెంట్‌నంతా ఐఫోన్‌కు బదిలీ చేయాలంటే తలప్రాణం తోకకి వస్తుంది. ప్రస్తుతం, ఐఓఎస్ డివైజ్ యూజర్లకు మాత్రమే చాట్స్‌ను శాంసంగ్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు బదిలీ చేసుకోవడానికి వాట్సాప్ వీలుకల్పిస్తుంది. కానీ మిగతా యూజర్లకు మాత్రం డేటా ట్రాన్స్‌ఫర్ క్లిష్టంగా మారింది. అయితే టెక్ నిపుణుల ప్రకారం ఆండ్రాయిడ్ యూజర్లు తమ కొత్త ఐఫోన్‌కు సులభంగా వాట్సాప్ చాట్ హిస్టరీ (Chat History)ని షేర్ చేసుకోవచ్చు. ఇందుకు గూగుల్ జిమెయిల్ బెస్ట్ టూల్‌గా పనిచేస్తుంది. గూగుల్ జిమెయిల్‌ని యూజ్ చేసి ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్ హిస్టరీని ఈజీగా ఎలా షేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా?

- మొదటగా మీరు వాట్సాప్ చాట్స్‌ను బ్యాకప్ చేయాలి.
- అనంతరం వాట్సాప్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి
- 'చాట్' ఆప్షన్‌పై క్లిక్ చేసి తరువాత 'చాట్ హిస్టరీ' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- 'ఎక్స్‌పోర్ట్ చాట్ (Export Chat)’ ఆప్షన్ ఎంచుకుని, మీరు ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్న చాట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు చాట్‌ను విత్‌ఔట్ మీడియాతో ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఇన్‌క్లూడ్ మీడియాతో ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీడియా కంటెంట్ కూడా కావాలి అనుకుంటే మీరు ఇన్‌క్లూడ్ మీడియాపై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ ఓన్ ఈమెయిల్ అడ్రస్‌ను రిసిపీయంట్‌గా నమోదు చేసుకోవాలి.
- ఈ చాట్స్‌ను రిస్టోర్ (Restore) చేసుకోవడానికి మీ ఐఫోన్‌లోని లోకల్ స్టోరేజ్ లో ఈ-మెయిల్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. వాట్సాప్ వెరిఫికేషన్ పూర్తయ్యాక లోకల్ స్టోరేజ్ నుంచి ఈ చాట్‌ హిస్టరీని మీరు రిస్టోర్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్ హిస్టరీని ఐఫోన్ డివైజ్‌లకు ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఈ పద్ధతి మాత్రమే అధికారిక మార్గం. AnyTrans, PhoneTrans, MobileTrans, Dr.Fone, Syncios వంటి యాప్‌లు మీ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు బదిలీ చేయడంలో మీకు సహాయపడతాయి. అయితే, ఈ టూల్స్ కోసం కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలానే వాటిని పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాట్ చరిత్రను బదిలీ చేయడానికి యూఎస్‌బీ కేబుల్‌ని ఉపయోగించి మీ మొబైల్ పరికరాలకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.ఇది చాలా సమయం తో కూడుకున్న పని.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Technolgy, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు