• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • HOW TO TRANSFER PF FROM OLD COMPANY TO NEW COMPANY HERE IS THE FULL DETAILS VB

PF Clients Alert: మీరు ఉద్యోగం మారారా.. అయితే పాత పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ ఖాతాకు ఇలా మార్చండి..

ప్రతీకాత్మక చిత్రం

PF Clients Alert: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ ఖాతాలు రెండు ఉంటాయి. కానీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN) అనేది ఒక్కటే ఉంటుంది. అయితే పాత పీఎఫ్ ఖాతను కొత్త పీఎఫ్ ఖతాలోకి ఎలా మార్చాలో చాలామందికి తెలియదు. దాని గురించి ఇక్కడ తెలుసుకోండి..

  • Share this:
    ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు ఒకే దగ్గర పనిచేస్తారన్న నమ్మకం చాలా తక్కువ. అయితే ఇలా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగ మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఒక ప్రదేశంలో పనిచేసేటప్పుడు జీతం నుంచి కట్ అయిన పిఎఫ్ మొత్తం ఈపీఎఫ్ఓ ఖాతాకు జమ అవుతుంది. అయితే మరో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా పీఎఫ్ కటింగ్ అనేది ఉంటుంది. కొత్త కొపెనీలో కొత్త పీఎఫ్ అకౌంట్ అనేది కేటాయిస్తారు. పాత పీఎఫ్ లో ఉన్న డబ్బులు కొత్త పీఎఫ్ లోకి ఎలా బదిలీ చేయాలో తెలియదు. ఆన్‌లైన్‌లో బదిలీ చేయడానికి మీరు UAN యాక్టివ్, PF ఖాతాకు లింక్ కలిగి ఉండాలి. UAN నంబర్ ద్వారా EPFO ​​పోర్టల్‌కు లాగిన్ అవ్వడం ద్వారా మీరు పాత కంపెనీలో జమ చేసిన మొత్తాన్ని చూడవచ్చు. దాని కోసం ఇలా చేయండి.. మొదట EPFO ​యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ కు వెళ్లాలి. అందులో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్), పాస్‌వర్డ్‌తో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

    లాగిన్ అయిన తరువాత ఆన్‌లైన్ సేవలకు వెళ్లి, One Member - One EPF Account (Transfer Request) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీరు వ్యక్తిగత సమాచారం, పీఎఫ్ ఖాతాను ధృవీకరించాలి. తర్వాత Get Details ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆన్ లైన్ మీరు దరఖాస్తు చేస్తున్న ఈ వివరాలను ఎవరు ఆమోదించాలనే ఆప్షన్ ఉంటుంది. అంటే అంతక ముందు మీరు వదిలి వచ్చిన కంపెనీ, ఇప్పడు మీరు పని చేస్తున్న కంపెనీ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఎవరు మీ దరఖాస్తును ఆమోదిస్తారో వారిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Get OTP ఎంపికపై క్లిక్ చేయండి. OTP మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది. అప్పుడు OTP ని సమర్పించండి. OTP ధృవీకరించబడిన తర్వాత సంస్థ ఆన్‌లైన్ డబ్బు బదిలీ ప్రక్రియ అభ్యర్థన కోసం వెళ్తుంది. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తవుతుంది. సంస్థ మొదట దానిని బదిలీ చేస్తుంది. ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్ ఆఫీసర్లు దీనిని ధృవీకరిస్తారు.

    చివరకు బదిలీ అభ్యర్థన పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరు ట్రాక్ క్లెయిమ్ స్థితిలో మీ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఆఫ్‌లైన్ బదిలీ కోసం మీరు ఫారం 13 ని పూరించాలి. దీనిని మీ పాత లేదా కొత్త కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి EPFO ​ఖాతా UAN ఆక్టివ్ గా లేకపోయినా, రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ నమోదు చేయబడకపోతే లేదా ఆధార్ కార్డులో నమోదు చేయబడిన మొబైల్ EPFO​​లో లేకపోయినా.. బ్యాంక్ ఖాతా వివరాలు ఇంకా నమోదు చేయకపోయినా పాత పీఎఫ్ నుంచి EPFO ​​మొత్తాన్ని జమ చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ఖాతాకు ఉద్యోగి బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు అన్నీ UAN ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. లేదంటే నగదు బదిలీ అవ్వడం కష్టం.
    Published by:Veera Babu
    First published: