హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube On Smart TV: ఫోన్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలో యూట్యూబ్ కనెక్ట్ చేసే అవకాశం.. స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి..

YouTube On Smart TV: ఫోన్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలో యూట్యూబ్ కనెక్ట్ చేసే అవకాశం.. స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాలక్షేపానికి కేరాఫ్​గా మారిపోయింది యూట్యూబ్. ఇంట్లో టీవీలున్నప్పటికీ పరిమిత ఛానెళ్లు మాత్రమే ఉండటంతో చాలామంది యూట్యూబ్​కే అతుక్కుపోయి గడుపుతున్నారు. మన చుట్టూ జరుగుతున్న ట్రెండింగ్​ ఫీడ్​తో పాటు.. ఎన్నో ఉపయోగకరమైన వీడియోలను అందిస్తుండటం వల్ల దీనికి ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు.

ఇంకా చదవండి ...

కాలక్షేపానికి కేరాఫ్​గా మారిపోయింది యూట్యూబ్(Youtube). ఇంట్లో టీవీలున్నప్పటికీ పరిమిత ఛానెళ్లు(Channels) మాత్రమే ఉండటంతో చాలామంది యూట్యూబ్​కే అతుక్కుపోయి గడుపుతున్నారు. మన చుట్టూ జరుగుతున్న ట్రెండింగ్​ ఫీడ్​తో పాటు.. ఎన్నో ఉపయోగకరమైన వీడియోలను అందిస్తుండటం వల్ల దీనికి ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్‌లు(Mobile Phones), ట్యాబ్​ల వంటి చిన్న స్క్రీన్లలో యూట్యూబ్​ని చూసేవారు టీవీ తెరపై YouTube వస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. అయితే మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే, పెద్ద డిస్‌ప్లేలో యాండ్రాయిడ్ అప్లికేషన్‌లకు అది యాక్సెస్ ఇస్తే.. ఇంకేముంది హాయిగా ఇంట్లోని భారీ సైజు టీవీపై 4కే రిజల్యూషన్ వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు.

ఇంతకముందు స్మార్ట్​టీవీలో యూట్యూబ్ ప్లే కావాలంటే గూగుల్(Google) సైన్ ఇన్ కావాల్సిందే. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ సులభతరం చేసింది యూట్యూబ్(YouTube on smart TV). ఇంతకుముందు వర్చువల్ కీబోర్డ్‌ను ఉపయోగించి టీవీలో పాస్‌వర్డ్‌ను మాన్యువల్‌గా నమోదు చేయాల్సి ఉండేది. అంతేగాక ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్‌లను ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాల్సి ఉండేది. ఈ కింది ప్రాసెస్​ను అనుసరించి మీ స్మార్ట్ టీవీలో YouTubeని సులువుగా ప్లే చేయండి..

WhatsApp: డెస్క్‌టాప్ వెర్షన్‌లో వాట్సాప్ లాగిన్ అవుతున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..


స్టెప్​ 1: - స్మార్ట్ టీవీలో YouTube అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. దానిని Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి.

స్టెప్​ 2: - ఇప్పుడు “సైన్ ఇన్ విత్ ఫోన్” ఆప్షన్​పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3: - స్మార్ట్‌ఫోన్‌లో YouTube యాప్‌ను తెరవమని స్మార్ట్ టీవీలో డిస్​ప్లే అవుతుంది.

స్టెప్​ 4: - ఫోన్​లో మీ అకౌంట్​తో లాగిన్ అయితే స్మార్ట్‌ఫోన్‌లో YouTube యాప్‌ని తెరిచిన అనంతం స్మార్ట్ టీవీ దానిని ఆటోమేటిక్​గా గుర్తిస్తుంది. ఇక టీవీలో YouTube చూడవచ్చు.

స్టెప్​ 5: - ఇక ఇప్పుడు మీ స్మార్ట్ టీవీలోని YouTube సెట్టింగ్‌లకు వెళ్లండి.

స్టెప్​ 6: - Link with TV code” ఆప్షన్​పై క్లిక్ చేయండి. టీవీ స్క్రీన్‌పై కనిపించే 12-అంకెల బ్లూ కలర్ కోడ్​ను కాపీ చేసుకోండి.

IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు

స్టెప్​ 7: - ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో YouTubeలోని సెట్టింగ్స్​ ఓపెన్ చేయండి.

స్టెప్​ 8: - “Watch on TV” ఆప్షన్​ను వెతికి దానిపై క్లిక్ చేయండి.

స్టెప్​ 9: - టీవీలో కనిపించిన కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ చేసి, “లింక్”పై క్లిక్ చేయండి.

స్టెప్​ 10: - ఇక ఇప్పుడు ఏదైనా YouTube వీడియోని నేరుగా మీ టీవీలో చూడవచ్చు.

First published:

Tags: Android TV, TV channels, Youtube

ఉత్తమ కథలు