Home /News /technology /

HOW TO SEARCH GOOGLE FOR IMAGES USING REVERSE SEARCH MK GH

Google images: గూగుల్‌లో మీకు కావాల్సిన ఇమేజ్​ దొరకడం లేదా?.. అయితే, ఇలా ట్రై చేసి చూడండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతీది ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్​లో సెర్చ్​ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చు. ?

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోప్రతీది ఆన్‌లైన్‌లో దొరుకుతోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్​లో సెర్చ్​ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చు.అయితే, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో చాలా మంది తమకు కావాల్సిన ఇమేజెస్ దొరకడం లేదని ఫీలవుతుంటారు. అటువంటి, వారి కోసం కొన్ని కొత్త పద్దతులను పరిచయం చేస్తోంది గూగుల్​. వీటిని ఫాలో అవ్వడం ద్వారాయూజర్లు తమకు కావాల్సిన ప్రతీ ఇమేజ్​ను హై క్వాలిటీలో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. గూగుల్‌ సెర్చ్‌లో ఇమేజ్ వచ్చాక దానిపై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీకు బోలెడన్ని ఇమేజెస్ కనబడుతాయి. అందులో మీకు కావాల్సిన ఇమేజ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ఇమేజెస్ దొరకనప్పుడు గూగుల్ అందించే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మీరు క్వాలిటీ ఇమేజెస్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. మీ డెస్క్ టాప్ లేదా ఫోన్ లేదా ఇతర ఏ డివైజెస్‌లోనైనా గూగుల్​ఇమేజ్ సులభంగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఇది చదవండి...G pay Fixed Deposits: ఇకపై గూగుల్ పే ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేసుకునే అవకాశం...

1.బ్రౌజర్‌లో https://images.google.com/ అని టైప్ చేయండి.

2.వెబ్ పేజ్‌లోని కెమెరా ఐకాన్‌కు ఎడమవైపునకు ఉన్న సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.

3.ఇప్పుడు మీరు మీకు కావాల్సిన ఇమేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి లేదా అప్‌లోడ్ యాన్ ఇమేజ్ ట్యాబ్ ద్వారా ఇమేజ్‌నుఅప్‌లోడ్ చేయండి. తద్వారా మీకు కావాల్సిన ఇమేజ్‌ను గూగుల్ సెర్చ్ చేసి పెడుతుంది.

4.ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లైతే మీరు సెర్చ్ చేయాలనుకున్న శాంపిల్ ఇమేజ్‌పై రైట్ క్లిక్ చేసి సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్​ను ఎంచుకోండి.మీకు కావాల్సిన ఇమేజ్ లభిస్తుంది.

5.మీ వద్ద ఉన్న ఇమేజ్‌ను గూగుల్ ఇమేజెస్ సైట్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా సిమిలార్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు.

ఇది చదవండి...Google Banned Words: గూగుల్‌లో పొరపాటున కూడా ఈ పదాలను వెతకొద్దు... సెర్చ్ చేస్తే జైలుకే..!

స్మార్ట్ ఫోన్‌లో సైతం రివర్స్ సెర్చ్ ద్వారా మీకు కావాల్సిన ఇమేజెస్‌ను ఇట్టే వెతుక్కోవచ్చు.. ఎలాగంటే..

1.రివర్స్ సెర్చ్ ద్వారా ఇమేజెస్ సెర్చ్ చేయాలనుకుంటే మీ ఫోన్‌లో గూగుల్ యాప్ ఖచ్చితంగా ఉండాలి.

2. సెర్చ్ బార్‌లో కెమెరా ఐకాన్‌పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయి పిక్చర్ తీసుకోవాలా? అని మిమ్మల్ని అడుగుతుంది.

3.కెమెరా నుంచి మీరు ఫొటో తీయొచ్చు లేదా మీ ఫోన్‌లోని ఇమేజ్‌ను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకుగాను మీరు ఆ విండో కింది భాగంలో ఎడమ వైపున ఉండేసెలక్ట్ యాన్ ఇమేజ్ అనే ఆప్షన్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి.

4.అంతే మీకుకావాల్సినఇమేజ్‌ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
Published by:Krishna Adithya
First published:

Tags: Google

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు