హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter Video Download: ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను ఎలా సేవ్ చేయాలి.. తెలుసుకోండి..

Twitter Video Download: ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను ఎలా సేవ్ చేయాలి.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ట్విట్ట‌ర్‌లో ప్రపంచ నలుమూలల నుంచి వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో నచ్చిన వీడియోలను తమ ఫోన్ లోకల్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ వీడియో డౌన్‌లోడ్ ఫీచర్‌ను ట్విట్టర్ అందించడం లేదు. అయినప్పటికీ ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోనైనా నెటిజన్లు వీడియోలు(Videos), ఫొటోలతో మంచి వినోదాన్ని పంచుతుంటారు. ప్రతిరోజు ఈ ప్లాట్‌ఫామ్‌లు అబ్బురపరిచే వీడియోలతో నిండిపోతాయి. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో ప్రపంచ నలుమూలల నుంచి వీడియోలు అప్‌లోడ్(Upload) అవుతుంటాయి. వీటిలో నచ్చిన వీడియోలను తమ ఫోన్ లోకల్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ వీడియో డౌన్‌లోడ్ ఫీచర్‌ను ట్విట్టర్ అందించడం లేదు. అయినప్పటికీ ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కూడా ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

Realme: దసరా బొనాంజా.. రియల్ మీ నుంచి మరికొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్.. అవి ఏంటంటే..


ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలు ఇలా డౌన్‌లోడ్ చేయండి

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియో (Download Twitter Video)’ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయండి. తరువాత ఇన్‌స్టాల్ చేయండి. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ ట్వీట్ నుంచి వీడియో లేదా గిఫ్ (gif) ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్వీట్‌ లింక్ కాపీ చేయండి. ట్వీట్ లింక్ కాపీ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ట్విట్టర్ యాప్ లేదా వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్తే సరిపోతుంది.

మీకు కావాల్సిన వీడియో ట్వీట్ కింద షేర్ బటన్ పై నొక్కండి. తరువాత "కాపీ లింక్ టు ట్వీట్(Copy link to Tweet)" లేదా "షేర్ ట్వీట్‌ వయా (Share Tweet Via)" పై క్లిక్ చేయండి.

మీరు లింక్‌ను కాపీ చేసినట్లయితే.. ట్విట్టర్ యాప్ ను క్లోజ్ చేసి.. 'డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియో' యాప్ ఓపెన్ చేయండి. లింక్‌ను మీ స్క్రీన్ పై భాగంలో కనిపిస్తున్న టెక్స్ట్ ఏరియాలో పేస్ట్ చేయండి. ఆపై డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ట్వీట్ లింక్‌ను కాపీ చేయకుండా 'షేర్ ట్వీట్‌ వయా' ఆప్షన్ పై క్లిక్ చేస్తే... ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియో'ని సెలక్ట్ చేసుకోండి. అప్పుడు ఈ ట్వీట్ లింక్‌ నుంచి 'డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియో' యాప్ మీకు కావాల్సిన వీడియోను డౌన్‌లోడ్ చేస్తుంది. ఈ వీడియో చూసేందుకు అప్లికేషన్ ఓపెన్ చేసి వీడియో లిస్టులోకి వెళ్ళాలి. ఆ వీడియోని వేరే అప్లికేషన్ కు ఫార్వర్డ్ చేయొచ్చు లేదా మీ గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజీలో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు.

New Smart Phone: ఇండియాలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..


ఐఫోన్‌లో ట్విట్టర్ వీడియోలు ఇలా డౌన్‌లోడ్ చేయండి

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియో డౌన్‌లోడ్ చేయడం చాలా సులభం. కానీ ఐఫోన్, ఐపాడ్ లలో డౌన్‌లోడ్ చేయాలంటే కాస్త కష్టం, సమయంతో కూడుకున్న పని. ఐఫోన్‌లో మొదట మీరు Readle(రీడిల్) డెవలప్ చేసిన డాక్యుమెంట్స్ (Documents) లేదా మై మీడియా(My Media) యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఈ క్రింది చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో ట్వీట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్వీట్ కింద షేర్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ లింక్ పై నొక్కండి. ట్వీట్ లింక్ కాపీ అయిన తర్వాత మై మీడియా లేదా రీడిల్ యాప్ లాంచ్ చేయండి. అప్పుడు మీకు 'బ్రౌజర్' ఐకాన్ కుడివైపు కింది భాగంలో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే యాప్ లోనే ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది.

ఆ బ్రౌజర్ లో www.twittervideodownloader.com అనే ఒక యూఆర్ఎల్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మీకు ఒక వెబ్‌సైట్‌ కనిపిస్తుంది. ఆ వెబ్‌సైట్‌లో మీరు కాపీ చేసిన ట్వీట్ లింక్ పేస్ట్ చేసి డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు వెబ్‌సైట్‌ లోడు అయ్యి చాలా డౌన్‌లోడ్ లింక్స్ చూపిస్తుంది. అవన్నీ మీ వీడియోకి సంబంధించిన వివిధ రకాల క్వాలిటీలు అని గమనించాలి. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేయొచ్చు. తర్వాత మీ వీడియో ఫైల్ కి టైటిల్ కూడా ఇవ్వొచ్చు. కింద కనిపిస్తున్న మెనులో మీడియా ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ పేజీలో మీరు మీ సేవ్ చేసిన వీడియోను చూడొచ్చు. మీ వీడియో ఫైల్ పై నొక్కండి. ఇప్పుడు ఒక కొత్త మెను కనిపిస్తుంది. మీ ఐఓఎస్ ఫోన్ లో మీ ట్విట్టర్ వీడియోని సేవ్ చేయడానికి "సేవ్ టు కెమెరా" ఆప్షన్ పై క్లిక్ చేయండి. అంతే, ట్విట్టర్ వీడియో మీ ఫోన్ లో స్టోర్ అయిపోతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Technology, Twitter

ఉత్తమ కథలు