Deleted Photos: గూగుల్​ డ్రైవ్​​ నుంచి డిలీట్​ చేసిన ఫైల్స్​ను తిరిగి ఎలా పొందాలి?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

మీరు మీ గూగుల్ డ్రైవ్(Google Drive)​ లేదా గూగుల్​ ఫోటోస్​ యాప్​లలో డిలీట్​ చేసిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందాలనుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్​న్యూస్​.

  • Share this:
మీరు మీ గూగుల్ డ్రైవ్(Google Drive)​ లేదా గూగుల్​ ఫోటోస్​ యాప్​లలో డిలీట్​ చేసిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందాలనుకుంటున్నారా?.. అయితే మీకో గుడ్​న్యూస్​. డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్​ను తిరిగి పొందేందుకు సెర్చింజన్​ దిగ్గజం గూగుల్​ తాజాగా అనుమతిచ్చింది. ఇప్పుడు గూగుల్​ యూజర్లు డ్రైవ్ స్పెషలిస్ట్‌ ద్వారా ఏదైనా ఫైల్‌ను తిరిగి పొందేందుకు వీలు కల్పించింది. అయితే ఈ అవకాశం కేవలం 30 లేదా 60 రోజుల్లోపు డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు డిలీట్​ చేసిన ఫోటోలను ఎలా పొందాలో చూద్దాం.

* గూగుల్​ డ్రైవ్​ నుంచి డిలీట్​ చేసిన ఫోటోలను ఎలా పొందాలి?
మీ స్మార్ట్​ఫోన్​లో గూగుల్ డ్రైవ్ యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత 'ట్రాష్' ఫోల్డర్‌కు(Trash folder) వెళ్లండి. ‘ట్రాష్’ ఫోల్డర్‌లో మీరు ఇటీవల డిలీట్ చేసిన అన్ని ఫైల్స్ కనిపిస్తాయి. వాటిని రీస్టోర్​ చేసేందుకు, ఫైల్‌పై రైట్​ క్లిక్ చేయండి. దాని తర్వాత మెనూపై రీస్టోర్​, డిలీట్​ అనే రెండు ఆప్షన్లు పాప్​అప్​ అవుతాయి. వాటిలో రీస్టోర్ ఆప్షన్​ను ఎంచుకోండి. తద్వారా మీరు గతంలో డిలీట్​ చేసిన ఫైల్‌ తిరిగి రీస్టోర్​ అవుతుంది.

Aviva Saral Pension Plan: పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ అందించే పథకం.. అందుబాటులోకి వచ్చిన అవైవా సరల్ పెన్షన్ ప్లాన్

గూగుల్ డ్రైవ్ యూజర్లు తాము గతంలో డిలీట్​ చేసిన ఏదైనా ఫైల్‌ను తిరిగి పొందలేకపోతే డ్రైవ్ స్పెషలిస్ట్‌ని సంప్రదించవచ్చు. అంతేకాదు, గూగుల్(Google)​ కంపెనీకి కాల్ లేదా చాట్​ మీ సమస్య చెప్పవచ్చు. వారి సూచనలతో మీ ఫైల్స్​ను తిరిగి పొందవచ్చు. అయితే, 30 రోజుల్లోపు డిలీట్​ చేసిన ఫైల్స్​ను మాత్రమే రీస్టోర్​ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల, 30 రోజులు దాటితే మీరు వాటిని తిరిగి పొందలేరని గమనించండి.

* గూగుల్​ ఫోటోస్​ నుంచి డిలీట్​ చేసిన ఫోటోలను ఎలా పొందాలి?
-మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ఫోటోస్ యాప్​ను(Google Photos App) ఓపెన్ చేయండి.

-తర్వాత స్క్రీన్ మధ్యలో ఉన్న లైబ్రరీ ట్యాబ్​పై క్లిక్ చేయండి.

-అక్కడ మీకు ట్రాష్ ఫోల్డర్ కనిపిస్తుంది. మీరు డిలీట్​ చేసిన అన్ని ఫోటోలను అక్కడ చూసుకోవచ్చు.

వాటిలో మీరు తిరిగి పొందాలనుకున్న ఫోటోలు, వీడియోలను ఎంచుకొని రీస్టోర్ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. వెంటనే మీ ఫోటోలు మీ స్మార్ట్​ఫోన్​లోకి డౌన్​లోడ్​ అవుతాయి. ఒకవేళ మీరు డిలీట్​ చేసిన ఫోటో ట్రాష్​లో కనిపించకపోతే ఆ ఫోటోను డిలీట్​ చేసి 60 రోజులకు పైనే అయ్యిందని అర్ధం చేసుకోవాలి.
Published by:Sumanth Kanukula
First published: