హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీటెడ్‌ కంటెంట్‌ని రీస్టోర్‌ చేయడం తెలుసా? ఈ సింపుల్‌ స్టెప్ప్‌ మీకోసమే..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీటెడ్‌ కంటెంట్‌ని రీస్టోర్‌ చేయడం తెలుసా? ఈ సింపుల్‌ స్టెప్ప్‌ మీకోసమే..

ఇన్‌స్ట్రాగ్రామ్‌

ఇన్‌స్ట్రాగ్రామ్‌

ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుంచి ఫోటో, వీడియో, రీల్‌ని డిలీట్‌ చేసి, తిరిగి పొందాలని అనుకున్నారా? డిలీట్‌ చేసిన వాటిని ఎలా పొందాలో తెలియదా?

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Instagram: మెటా ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్(Instagram) మోస్ట్‌ పాపులర్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ఫోటోలు, పోస్ట్‌లను షేర్‌ చేయడానికి, స్టోరీలను క్రియేట్‌ చేయడానికి, రీల్స్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుంచి ఫోటో, వీడియో, రీల్‌ని డిలీట్‌ చేసి, తిరిగి పొందాలని అనుకున్నారా? డిలీట్‌ చేసిన వాటిని ఎలా పొందాలో తెలియదా? వాస్తవానికి ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్‌ చేసిన ఫోటోలు, వీడియోలు, రీల్స్, స్టోరీస్‌ను రీస్టోర్‌ చేసుకునే సదుపాయం ఉంది. పొరపాటును డిలీట్‌ చేసిన వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది.

30 రోజుల వరకు అందుబాటులో డిలీటెడ్‌ డేటా

ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో డిలీట్‌ చేసిన కంటెంట్‌ అకౌంట్‌ నుంచి వెంటనే మాయమవుతుంది. కానీ ఆ కంటెంట్‌ రీసెంట్లీ డిలీటెడ్‌ ఫోల్డర్‌కు వెళ్తుంది. ఆ ఫోల్డర్‌లో డిలీట్‌ చేసిన డేటా 30 రోజుల వరకు స్టోర్‌ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా డేటా రిమూవ్‌ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌కు 24 గంటల సమయం ఉంటుంది. డిలీట్‌ చేసినవి స్టోరీస్‌ ఆర్కైవ్‌లో ఉంటాయి 30 రోజులలో ఆండ్రాయిడ్‌(Android), ఐఫోన్‌(iPhone) వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో రీసెంట్లీ డిలీటెడ్‌ ఫోల్డర్‌ నుంచి డేటాను రీస్టోర్‌ చేసుకోవచ్చు. అదే విధంగా డేటాను శాశ్వతంగా తొలగించవచ్చు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి మీడియాకు మాత్రమే పని చేస్తుందని గమనించాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను రీస్టోర్‌ చేయడం సాధ్యం కాదు.

Twitter: హ్యాకర్ల చేతిలో 400 మిలియన్ యూజర్ల ట్విట్టర్ డేటా?ప్రూఫ్‌గా సల్మాన్‌ ఖాన్‌, సుందర్‌ పిచాయ్‌ వివరాల వెల్లడి!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్‌ చేసిన కంటెంట్‌ను రీస్టోర్‌ ఎలా చేయాలి?

మొదట స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. ప్రొఫైల్‌కి వెళ్లడానికి దిగువ కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ఎగువ కుడివైపున మోర్‌ ఆప్షన్స్‌పై ట్యాప్‌ చేయాలి. తర్వాత యాక్టివిటీ కంట్రోల్స్‌పై ట్యాప్ చేసి, అనంతరం యువర్‌ యాక్టివిటీ(Your Activity) ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ఇక్కడ రీసెంట్లీ డిలీటెడ్‌ ఆప్షన్‌పై ప్రెస్ చేయాలి. యూజర్‌లకు ఇటీవల ఎలాంటి డేటా డిలీట్‌ చేయకపోయి ఉంటే ఆప్షన్స్‌ కనిపించవని గుర్తించుకోవాలి. అక్కడ కనిపించే ప్రొఫైల్ పోస్ట్‌లు, రీల్స్, వీడియోలు, స్టోరీస్‌లో రీస్టోర్‌ చేయాలని భావిస్తున్న దానిపై క్లిక్‌ చేయాలి. తర్వాత ఎగువ కుడివైపున మోర్‌ ఆప్షన్స్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం రిస్టోర్‌ టూ ప్రొఫైల్‌(Restore TO Profile) లేదా రీస్టోర్‌ టూ రీస్టోర్‌ కంటెంట్‌(Restore To Restore Content) ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం అకౌంట్‌లో రీస్టోర్‌ అయిన మీడియా కనిపిస్తుంది.

First published:

Tags: Instagram

ఉత్తమ కథలు