హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Cyber Attacks: స్మార్ట్‌ఫోన్లపై పెరుగుతున్న సైబర్ అటాక్స్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్ అంటున్న నిపుణులు..

Smartphone Cyber Attacks: స్మార్ట్‌ఫోన్లపై పెరుగుతున్న సైబర్ అటాక్స్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్ అంటున్న నిపుణులు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. కొద్దిపాటి అజాగ్రత్త మిమ్మల్ని సైబర్ దాడుల్లో బాధితులను చేసే ప్రమాదం ఉంది. సైబర్ అటాక్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నాపెద్దా భేదం లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లను (Smartphones) ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేసి యూజర్ల పర్సనల్ డేటాతో పాటు బ్యాంక్ ఖాతాలలోని డబ్బును దొంగిలిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగిన ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య కూడా బాగా పెరిగింది. కేటుగాళ్లు లింక్ లేదా యాప్ ద్వారా ఐఫోన్ (iPhone) లేదా ఆండ్రాయిడ్ (Android) యూజర్ల ఫోన్‌లోకి మాల్వేర్ ప్రవేశపెట్టి వారిని మోసం చేస్తున్నారు. వీరు లింక్ ద్వారా ఈ వైరస్‌లను పంపి ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని వీక్ టెక్నికల్ ఏరియాలను లక్ష్యంగా చేసుకుంటారు. అలా డేటా దొంగలించడం, బ్యాంక్ డీటెయిల్స్ సేకరించి మనీ కొట్టేయడం లేదా నెట్‌వర్క్ కరప్షన్ చేస్తారు. మరి ఇలాంటి సైబర్ అటాక్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

సాధారణంగా యూజర్లు తమ అవసరాల కోసం రకరకాల యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే వీటిలో కొన్ని యాప్స్ యూజర్ల డేటాను పరిమితులు మించి యాక్సెస్ చేస్తాయి లేదా డేటాను సేకరిస్తాయి. ఈ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్ల డేటా యాక్సెస్ చేయడం సులువవుతుంది. ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్‌లలో రోగ్ యాప్‌లు, వైరస్ సోకిన ఫైల్ అటాచ్‌మెంట్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా సైబర్ అటాక్స్ జరుగుతాయి. కాబట్టి ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. కొద్దిపాటి అజాగ్రత్త మిమ్మల్ని సైబర్ దాడుల్లో బాధితులను చేసే ప్రమాదం ఉంది.

Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

వైరస్ నుంచి మీ ఫోన్‌ను ఎలా రక్షించుకోవాలి?

వైరస్‌లు, ఇతర సెక్యూరిటీ రిస్క్స్ నుంచి మీ మొబైల్‌ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. అలానే టెక్ నిపుణుల ప్రకారం, మీరు ఫోన్ వాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

* గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ వంటి అఫీసియల్ యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. అలాగే, డౌన్‌లోడ్ చేసుకునే ముందుగా యాప్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈ అఫీసియల్ యాప్ స్టోర్‌లలో కూడా మాల్వేర్ ఉన్న కొన్ని యాప్‌లు ఉంటాయి. అందుకే డౌన్‌లోడ్ చేసే ముందు వాటి పనితీరు, హిస్టరీ గురించి కాస్త సెర్చ్ చేయడం మంచిది.

* మీ ఫోన్‌లో సడన్‌గా వచ్చే పాప్-అప్‌లు లేదా లింక్‌లను క్లిక్ చేయవద్దు. అజ్ఞాత వ్యక్తులు పంపే మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ఈ-మెయిల్‌ల్లోని లింక్స్ క్లిక్ చేయవద్దు.

* ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు యాప్ పర్మిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. యాప్ దేనిని యాక్సెస్ చేయాలనే విషయంపై మీకు ఒక అవగాహన ఉంటుంది. అయితే అది మీ అవగాహన ప్రకారం కాకుండా ఇతర ఫైల్స్ కు యాక్సెస్ అడిగితే దాన్ని ఇన్‌స్టాల్ చేయకుండా డిలీట్ చేయడమే మంచిది.

* మీ ఫోన్‌ను జైల్‌బ్రేకింగ్ లేదా మాడిఫై చేయకపోవడమే మంచిది. లేదంటే అటాకర్లు మీ ఫోన్‌ను ఈజీగా టార్గెట్ చేస్తారు.

* "ఆప్టిమైజింగ్", "క్లీనింగ్" వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోకండి. స్పీడ్ క్లీన్, సూపర్ క్లీన్, రాకెట్ క్లీనర్ వంటి యాప్‌లు వైరస్‌లు కలిగి ఉంటాయని, వీటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. ఫిబ్రవరి 2020లో, అనేక హానికరమైన ఆండ్రాయిడ్ యాప్‌ల్లో "క్లీనర్స్", "ఆప్టిమైజర్స్" వలె మారువేషంలో కనిపించాయి. అందుకే ఒకవేళ మీరు ఇప్పటికేవీటిని డౌన్‌లోడ్ చేసుకున్నా వెంటనే డిలీట్ చేసుకోండి.

IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

* మీ ఫోన్‌లో అనుమానాస్పద యాక్టివిటీ ఏదైనా జరుగుతుందో లేదో తరచూ చెక్ చేసుకోండి.

* మీ డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి. అలాగే ఆ డేటాను సేఫ్టీ డ్రైవ్స్ లో స్టోర్ చేసుకోండి. ఫోన్ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి. ఇందులో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయి. ఇవి మీ ఫోన్ భద్రతను మరింత మెరుగుపరుస్తాయి.

First published:

Tags: 5g smart phone, Cyber Attack, Smartphones

ఉత్తమ కథలు