హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి

మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

How To Port : ఆన్‌లైన్‌లో నంబర్ పోర్టబులిటీ చెయ్యడానికి చాలా ఆప్షన్లున్నాయి. ప్రక్రియ పూర్తవగానే మీ అడ్రెస్‌కి గంటలోపే కొత్త నెట్‌వర్క్‌కి సంబంధించిన సిమ్ వచ్చేస్తుంది.

  మొబైల్ నంబర్ పోర్టబులిటీ సదుపాయం వచ్చాక... అదే నంబర్ వాడుతూ సర్వీస్ అందించే నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మార్చుకునే వీలు కలుగుతోంది. తాజాగా ఈ ప్రక్రియ మరింత తేలిక అయ్యింది. ఇలా చేసేముందు మీకు కొన్ని విషయాలు తెలిసివుండాలి. ఈ పోర్టబులిటీ అనేది సేమ్ టెలికం సర్కిల్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏ ఏరియాలో నెట్‌వర్క్ వాడుతున్నారో, అదే ఏరియాలోని మరో నెట్‌వర్క్‌కి మాత్రమే మీరు మారగలరు. ఇలా జరగాలంటే మీరు ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కి గత 90 రోజులుగా కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి. పోర్టబులిటీ జరిగేటప్పుడు ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌కి మీరు ఏవైనా బిల్లులు పెండింగ్ ఉంచితే వాటిని క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది. క్లియర్ చేశాకే పోర్టబులిటీ ప్రక్రియ చేపట్టాలి.


  పోర్టబులిటీ ఎలా చెయ్యాలంటే : ఆన్‌లైన్‌లో నంబర్ పోర్టబులిటీ చెయ్యడానికి చాలా ఆప్షన్లున్నాయి. వాటిలో ఒకటి 10digi.com. ఇందులో పోర్టబులిటీ చేసుకుంటే అది పూర్తవగానే మీ అడ్రెస్‌కి గంటలోపే కొత్త నెట్‌వర్క్‌కి సంబంధించిన సిమ్ వచ్చేస్తుంది. సిమ్ నంబర్ మాత్రం పాతదే ఉంటుంది.


  రెండో మార్గం : ఇలా చెయ్యండి.

  * ఏ నెట్‌వర్క్‌లోకి మారాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. అందుకోసం ఏ నెట్‌వర్క్‌లు ఏయే ప్లాన్స్, ఆఫర్లు కల్పిస్తున్నాయో తెలుసుకోండి.

  Aircel.com,

  Airtel.in,

  BSNL.co.in,

  Ideacellular.com,

  Tatadocomo.com,

  Vodafone.in


  * ఏ నెట్‌వర్క్‌కి మారాలనుకుంటున్నారో వాళ్లకు కాల్ చెయ్యండి. వాళ్లు UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్) జనరేట్ చేసుకోమని చెబుతారు.


  * ఆ తర్వాత ఆ నెట్‌వర్క్‌కి సంబంధించిన సిబ్బంది ఒకరు మీ ఇంటికే వస్తారు. పేపర్ వర్క్, సంతకాల ప్రక్రియ పూర్తిచేస్తారు. ఒకవేళ వాళ్లు వచ్చే అవకాశం లేకపోతే, మీరే దగ్గర్లోని ఆ సంస్థ షోరూం లేదా ఏదైనా మొబైల్ షాపుకి వెళ్లాల్సి ఉంటుంది. కంపెనీ సిబ్బంది అక్కడకు వచ్చి పని పూర్తి చేస్తారు.


  * యూపీసీ కోసం మీరు ఓ మెసేజ్ పంపాలి. PORT<Space>Mobile Number వేసి 1900 కి SMS పంపాలి.


  * మీరు ఓ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఓ ఐడీ ప్రూప్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఐడీ ప్రూఫ్‌గా ఆధార్, ఓటర్ ఐడీ, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటివి ఇవ్వొచ్చు. అలాగే అడ్రెస్ ప్రూఫ్ కోసం మీరు మీ రెంట్ అగ్రిమెంట్ జిరాక్స్ కాపీ లేదా ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు జిరాక్స్ కాపీ ఇవ్వొచ్చు. ఇవేవీ లేకపోతే మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వొచ్చు. మీరు పోస్ట్ పెయిడ్ కస్టమర్ అయితే, మీ చివరి నెల (గత నెల) బిల్లు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది.


  * పత్రాలన్నీ సమర్పించాక, వెంటనే మీకు కొత్త సిమ్ కార్డ్ ఇస్తారు. పోర్టబులిటీ జరిపినందుకు రూ.20 తీసుకునే అవకాశాలున్నాయి. కొత్త సర్వీస్ గనక మీకు నచ్చకపోతే, 24 గంటల్లో కొత్త సర్వీస్‌ను రద్దు చేసుకోవచ్చు.


  * మీకు వెంటనే కొత్త సిమ్ వచ్చినప్పటికీ... పోర్టబులిటీ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తవడానికి ఓ వారం పడుతుంది. అది పూర్తవగానే ఆ విషయాన్ని SMS రూపంలో మీకు తెలియజేస్తారు.


  * కొత్త నెట్‌వర్క్ ప్రారంభం అయ్యేవరకూ మీరు పాత సిమ్‌ని వాడుకోవచ్చు. అది పనిచెయ్యడం మానేసిన రోజు నుంచీ కొత్త సిమ్ పనిచెయ్యడం ప్రారంభిస్తుంది. పాత సిమ్ ఆగిపోయాక, కొత్త సిమ్ ప్రారంభమవ్వడానికి మధ్యలో రెండు గంటలు మాత్రం సర్వీసులు నిలిచిపోతాయి. ఆ తర్వాత నుంచీ ఏ సమస్యలూ ఉండవు. పాత నెంబర్‌తో కొత్త నెట్‌వర్క్ సర్వీసులూ, ఆఫర్లూ, టారిఫ్‌లూ పొందొచ్చు.


   

  ఇవి కూడా చదవండి :


  మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


  వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?


  ట్రూకాలర్ నుంచీ మన నంబర్ తీసేయడం ఎలా? సింపుల్ ట్రిక్... ఫాలో అవ్వండి మరి


  ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలా? మీ కోసమే ఈ వెబ్‌సైట్లు... ట్రై చెయ్యండి మరి

  First published:

  Tags: Information Technology, Mobile App, Mobiles, Technology

  ఉత్తమ కథలు