హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Junio Money App: మీ పిల్లలు విపరీతంగా ఖర్చు చేస్తున్నారా..అయితే ఇలా ట్రాక్​ చేయండి..

Junio Money App: మీ పిల్లలు విపరీతంగా ఖర్చు చేస్తున్నారా..అయితే ఇలా ట్రాక్​ చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఢిల్లీకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ ప్రత్యేక యాప్​ను రూపొందించింది. జూనియో మనీ యాప్​ పేరుతో సరికొత్త పాకెట్ మనీ యాప్‌ను విడుదల చేసింది. అయితే, ఈ యాప్​ ప్రత్యేకతలేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని ఎలా ఉపయోగించాలి? వంటి, కీలక విషయాలను తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టమనేది నిపుణుల మాట. ఇది అక్షరాలా నిజం ఎందుకంటే, కొంత మంది లక్షలు సంపాదిస్తున్నా లేనిపోని దుబారా ఖర్చులు పెడుతూ తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. మరికొంత మంది తమకు ఉన్నదాంట్లో సరిపెట్టుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఈ ఇద్దరికీ మధ్య ఏకైక తేడా మనీ మేనేజ్​మెంట్​ మాత్రమే. అందువల్ల, ఈ మనీ మేనేజ్​మెంట్​ను చిన్న తనంలోనే పిల్లలకు అలవాటు చేయాలంటున్నారు ఆర్థిక నిపుణులు. దీని కోసం పిల్లల ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్​ చేయాలంటున్నారు. అయితే, బిజీ షెడ్యూల్​ వల్ల చాలా మంది తల్లిదండ్రులకు ఇది సాధ్యపడకపోవచ్చు. అటువంటి వారి కోసమే ఢిల్లీకి చెందిన ఫిన్‌టెక్ సంస్థ ప్రత్యేక యాప్​ను రూపొందించింది. జూనియో మనీ యాప్​ పేరుతో సరికొత్త పాకెట్ మనీ యాప్‌ను విడుదల చేసింది. అయితే, ఈ యాప్​ ప్రత్యేకతలేంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని ఎలా ఉపయోగించాలి? వంటి, కీలక విషయాలను తెలుసుకుందాం.

పిల్లల ఖర్చులను ట్రాక్ చేయవచ్చు..

చిన్న వయస్సులోనే పిల్లలకు డబ్బు విలువ తెలియజేయడం, వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పించడమే జూనియో యాప్​ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. ఈ యాప్​ను ముఖ్యంగా 10 నుంచి 16 సంవత్సరాల మధ్య గల పిల్లలను లక్ష్యంగా చేసుకొని రూపొందించారు. కాగా, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అడగ్గానే డబ్బు ఇచ్చేసారు. ఆ తర్వాత వారు ఆ డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా ట్రాక్ చేయరు. అలాంటి వారు జూనియో యాప్​ ద్వారా తమ పిల్లల ప్రతి ఖర్చును సులభంగా ట్రాక్​ చేయవచ్చు. ఈ కార్డును స్వైప్ చేసి, మీ పిల్లవాడు చేసిన ప్రతి కొనుగోలుకు సంబంధించిన అలర్ట్​ను మీరు పొందవచ్చు.

యాప్​ ఎలా పనిచేస్తుంది?

తల్లిదండ్రులు తమ పిల్లల ఖర్చులను సులభంగా ట్రాక్​ చేసేందుకు, ముందుగా జూనియో యాప్​ను డౌన్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత సంబంధిత వివరాలు నమోదు చేయాలి. అప్పుడు మీకు ఒక ఫిజికల్​ కార్డు పంపించబడుతుంది. ఈ కార్డును ఆర్‌బిఎల్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ సహకారంతో రూపొందించారు. ఇకపై మీ పిల్లవాడికి నేరుగా డబ్బు ఇవ్వకుండా ఈ కార్డులో ఆ డబ్బును జమచేయండి. దీనితో కస్టమర్లు నెలకు గరిష్టంగా రూ .10,000 వరకు దీనిలో లోడ్ చేయవచ్చు. KYC పూర్తి చేసిన కస్టమర్లు నెలకు రూ .1 లక్ష వరకు బదిలీ చేయవచ్చు. కాగా, ఈ ఆలోచనపై జూనియో సహ వ్యవస్థాపకుడు అంకిత్ గెరా మాట్లాడుతూ ‘‘పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించేందుకు, తల్లిదండ్రులు తమ పిల్లల ఖర్చులను నియంత్రించేందుకు మా యాప్​ ఉపయోగపడుతుంది.

దీని కోసం మీరు RBL బ్యాంకు ఖాతా ఖాతా కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా భీమ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ఉపయోగించి ఏదైనా ఖాతా నుండి సులభంగా ఈ కార్డులోకి నగదు బదిలీ చేయవచ్చు. అయితే, నెలవారీ రుసుము కింద మీరు కేవలం రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, ఈ యాప్​ ఆండ్రాయిడ్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వారు Google ప్లే స్టోర్‌లో నుండి దీన్ని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఆపిల్ iOS యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.” అని అన్నారు.విత్​డ్రా లిమిట్​ను సెట్​ చేసుకోవచ్చు...

ఈ కార్డు ఉపయోగించి మీ పిల్లవాడు ఎటిఎమ్ నుండి నగదు విత్​డ్రా చేస్తే మీకు వెంటనే అలర్ట్​ వస్తుంది. తద్వారా మీ పిల్లవాడు ఎంత ఖర్చు చేస్తున్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాక, మీరు విత్​డ్రా లిమిట్​ను కూడా సెట్​ చేయవచ్చు. తద్వారా, మీ పిల్లలను అనవసర ఖర్చుల నుండి దూరంగా ఉంచవచ్చు. ఫలితంగా వారు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఈ యాప్ దోహదం చేస్తుంది." అని గెట్టింగ్ యు రిచ్ వ్యవస్థాపకుడు, CEO రోహిత్ షా చెప్పారు.

First published:

Tags: Money, Personal Finance

ఉత్తమ కథలు