హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

How to Log Out Gmail From Other Devices: ఎక్కడైనా జీమెయిల్ లాగిన్ చేసి మర్చిపోయారా? ఇలా లాగౌట్ చేయండి

How to Log Out Gmail From Other Devices: ఎక్కడైనా జీమెయిల్ లాగిన్ చేసి మర్చిపోయారా? ఇలా లాగౌట్ చేయండి

How to Log Out Gmail From Other Devices: ఎక్కడైనా జీమెయిల్ లాగిన్ చేసి మర్చిపోయారా? ఇలా లాగౌట్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

How to Log Out Gmail From Other Devices: ఎక్కడైనా జీమెయిల్ లాగిన్ చేసి మర్చిపోయారా? ఇలా లాగౌట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

How to Log Out Gmail From Other Devices | ఎక్కడైనా జీమెయిల్ లాగిన్ చేసి మర్చిపోవడం యూజర్లకు అలవాటే. ఎలా లాగౌట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. యూజర్లు సింపుల్‌గా గూగుల్ అకౌంట్‌లో (Google Account) లాగిన్ అయి ఇతర డివైజ్‌లో జీమెయిల్ లాగౌంట్ చేయొచ్చు.

ఇంకా చదవండి ...

మీరు ఎక్కడైనా జీమెయిల్ లాగిన్ చేసి మర్చిపోయారా? మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల స్మార్ట్‌ఫోన్‌లో జీమెయిల్ లాగిన్ చేశారా? అసలు జీమెయిల్ ఎక్కడ లాగిన్ చేశారో గుర్తులేదా? ఎలా లాగౌట్ చేయాలో అర్థం కావట్లేదా? చాలా సింపుల్. మీరు ఏ డివైజ్‌లో జీమెయిల్ లాగిన్ (Gmail Login) అయినా మీ డివైజ్ నుంచి లాగౌట్ చేయొచ్చు. ఈ విషయం తెలిసినవారు తక్కువే. ఇతర డివైజ్‌లల్లో జీమెయిల్ ఎలా లాగౌట్ చేయాలి? (How to Log Out Gmail From Other Devices) అని గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. గూగుల్ ప్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఇతర డివైజ్‌లల్లో లాగిన్ చేసిన జీమెయిల్ లాగౌట్ చేసే అవకాశం కల్పిస్తోంది.

జీమెయిల్ అకౌంట్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర ఇంపార్టెంట్ ఇమెయిల్స్ లాంటివి సేవ్ చేసుకోవడం యూజర్లకు అలవాటే. జీమెయిల్ అకౌంట్ వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్తే చిక్కులు తప్పవు. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా జీమెయిల్‌లో లాగిన్ చేస్తే లాగౌట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే ఎలా లాగౌట్ చేయాలో తెలుసుకోండి.

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... 90Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ

ఇతర డివైజ్‌లల్లో జీమెయిల్ లాగౌట్ చేయండి ఇలా


Step 1- ముందుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.

Step 2- గూగుల్ అకౌంట్ సెర్చ్ చేయండి.

Step 3- https://www.google.com/account/about/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 4- Go to Google Account పైన క్లిక్ చేయండి.

Step 5- మీ జీమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 6- ఆ తర్వాత చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో సెక్యూరిటీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 7- స్క్రోల్ డౌన్ చేసి చివరి వరకు వెళ్లాలి.

Step 8- Your Devices సెక్షన్‌లో Manage All Devices పైన క్లిక్ చేయాలి.

Step 9- అక్కడ మీరు జీమెయిల్ ఏఏ డివైజ్‌లల్లో లాగిన్ చేశారో వివరాలు ఉంటాయి.

Step 10- మీరు లాగౌట్ చేయాలనుకున్న డివైజ్ సెలెక్ట్ చేసి చేయాలి.

Step 11- ఆ తర్వాత Sign out ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Exchange Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ

ఇలా మీరు ఇతర డివైజ్‌ల నుంచి జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్ లాగిన్ చేయొచ్చు. మీ గూగుల్ అకౌంట్‌ను సేఫ్‌గా మార్చుకోవడానికి 2 స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం మంచిది. దీని వల్ల మీరు జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్‌లో లాగిన్ కావాలంటే పాస్‌వర్డ్‌తో పాటు మరో వెరిఫికేషన్ కూడా అవసరం. ఈ సెట్టింగ్స్ కూడా గూగుల్ అకౌంట్‌లో సెక్యూరిటీ సెక్షన్‌లో ఉంటాయి. సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

Step 1- గూగుల్ అకౌంట్‌లో లాగిన్ చేసిన తర్వాత సెక్యూరిటీ సెక్షన్‌లోకి వెళ్లాలి.

Step 2- ఆ తర్వాత 2-step verification ఆన్ చేయాలి.

Step 3- మళ్లీ మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి 2-step verification పూర్తి చేయాలి.

Step 4- మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి

Step 5- Send పైన క్లిక్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.

Step 6- మీ ఫోన్‌కు వచ్చిన 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

Step 7- ఆ తర్వాత Next పైన క్లిక్ చేస్తే 2 స్టెప్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.

First published:

Tags: GMAIL, Google

ఉత్తమ కథలు