HOW TO KNOW ALL ABOUT YOUR ANDROID DEVICES HARDWARE AND SOFTWARE GH VB
DevCheck: మీ ఆండ్రాయిడ్ డివైజ్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ వివరాలు తెలుసుకోవాలా..? ఈ యాప్‌తో చెక్ చేయండిలా..
ప్రతీకాత్మక చిత్రం
DevCheck: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినప్పుడు, దానిలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే వెల్కమ్ బాక్స్ లోపలి డాక్యుమెంట్లలో ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను పొందుపరుస్తారు. కానీ ఇందులో పేర్కొన్న వాటి కంటే చాలా ఎక్కువ ఫీచర్లు అంతర్లీనంగా ఉంటాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్(New Smartphone) కొనుగోలు చేసినప్పుడు, దానిలోని ఫీచర్లు(Features), స్పెసిఫికేషన్ల (Specifications) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే వెల్కమ్ బాక్స్(Wellcome Box) లోపలి డాక్యుమెంట్లలో ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లను పొందుపరుస్తారు. కానీ ఇందులో పేర్కొన్న వాటి కంటే చాలా ఎక్కువ ఫీచర్లు(Features) అంతర్లీనంగా ఉంటాయి. సీపీయూ(CPU), జీపీయూ, బ్యాటరీ వంటి హార్డ్‌వేర్‌లకు(Hardware) సంబంధించిన సమాచారం దానిలో ఉండదు. దీనికోసమే ఓ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది ఎక్స్‌డీఏ డెవలపర్. మీరు మీ ఆండ్రాయిడ్ డివైజ్‌కు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ‘డెవ్చెక్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. డెవ్ చెక్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
స్టెప్1: మీ ఆండ్రాయిడ్ పరికరంలో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ‘DevCheck’ యాప్‌ను సెర్చ్ చేయండి.
స్టెప్ 3: డెవ్ చెక్ యాప్ లోగోలో 'i' గ్రీన్ సింబల్ ఉంటే దాన్ని ఒరిజినల్ యాప్‌గా గుర్తించండి. యాప్‌లో ‘DevCheck హార్డ్‌వేర్, సిస్టమ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
స్టెప్ 4: డెవ్ చెక్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి, దాన్ని ఓపెన్ చేయండి.
స్టెప్ 5: యాప్‌ను ఓపెన్ అయిన వెంటనే డ్యాష్‌బోర్డ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వివరాలు కనిపిస్తాయి. దీనిలో రియల్ టైమ్ అప్డేట్ చేసే ప్రాసెసర్ ఫ్రీక్వెన్సీలతో సీపీయూ స్టేటస్, సీపీయూ, ఎస్ఓసీ టెంపరేచర్, జీపీయూ ఫ్రీక్వెన్సీ, బ్యాటరీ పర్సంటేజ్, టెంపరేచర్, నెట్వర్క్ స్పీడ్, రామ్, స్టోరేజ్ వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఆండ్రాయిడ్ మోడల్, ఆండ్రాయిడ్ వెర్షన్, అప్‌టైమ్ వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
స్టెప్ 6: మీరు కుడివైపుకి స్క్రోల్ చేస్తే హార్డ్‌వేర్, సిస్టమ్, బ్యాటరీ, నెట్వర్క్, యాప్‌లు, కెమెరా, సెన్సార్ పేర్లతో మరో ఏడు ట్యాబ్‌లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక, మీ వైఫై సిగ్నల్ స్ట్రెంగ్త్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. కెమెరాతో పాటు మీ ఫోన్లోని స్టెప్ డిటెక్టర్ ద్వారా ఎంత కరెంట్ డ్రా అవుతుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మీరు మల్టిపుల్ ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లైతే.. వాటిని పక్కపక్కనే సరిపోల్చవచ్చు. అంతేకాదు, డెవ్చెక్ యాప్ ద్వారానే మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర యాప్‌లను కంట్రోల్ చేయవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.