Email ID Hide Trick: ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు జీమెయిల్(Gmail) వాడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈమెయిల్స్ పంపించడం అనేది చాలా మంది జీవితాల్లో అంతర్భాగమైంది. అయితే ఒక్కోసారి ఈమెయిల్ పంపించేటప్పుడు ఈమెయిల్ ఐడీ అడ్రస్ అవతలి వ్యక్తితో షేర్ చేయకూడదని యూజర్లు అనుకుంటారు. అయితే యాపిల్ ఐఫోన్ వాడేవారికి ఐడీ హైడ్ చేయడం కుదురుతుంది. ఇందుకు వారు హైడ్ మై ఈమెయిల్ (Hide My Email) ఫీచర్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌తో ఒరిజినల్ ఈమెయిల్ ఐడీ దాచేసి వేరే ఈమెయిల్ ఐడీ (Random Email ID) క్రియేట్ చేసి.. ఆ ఐడీతోనే మెయిల్ పంపించవచ్చు. దానివల్ల అవతలి వ్యక్తికి మీ ఒరిజినల్ ఈమెయిల్ ఐడీ ఏంటనేది తెలియదు. హైడ్ మై ఈమెయిల్ ఫీచర్‌తో క్రియేట్ అయ్యే ఈమెయిల్ అడ్రస్ యూజర్ల ఒరిజినల్ ఈమెయిల్ ఐడీ, పర్సనల్ డీటెయిల్స్ ఏమీ వెల్లడించదు. ఈ ఐడీతో యాప్‌లు, వెబ్సైట్లు, ఇతర వాటిని యాక్సెస్ చేయొచ్చు. మరి ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి? అనేది ఇప్పుడు చూద్దాం.
హైడ్ మై ఈమెయిల్ ఎలా ఉపయోగించాలి
హైడ్ మై ఈమెయిల్‌ను రెండు మార్గాల్లో ఉపయోగించవచ్చు. మొదటి మార్గం యాపిల్‌తో సైన్ ఇన్ చేయడం. సైన్-ఇన్ చేశాక రాండం (Random)గా క్రియేటయ్యే వేరే ఈమెయిల్‌ను ఉపయోగించి థర్డ్-పార్టీ యాప్ లేదా వెబ్సైట్లో అకౌంట్ సృష్టించవచ్చు. రెండో మార్గం ఏంటంటే.. iCloud+తో Safariలో లేదా iCloud.comలో కావలసినన్ని ఈ-మెయిల్ అడ్రస్‌లు క్రియేట్ చేసుకోవచ్చు.
హైడ్ మై ఈమెయిల్ ఎలా పని చేస్తుంది
యాపిల్‌తో సైన్ ఇన్ చేయడానికి సపోర్ట్ చేసే యాప్ లేదా వెబ్‌సైట్‌తో మీ ఒరిజినల్ ఈ-మెయిల్ ఐడీ షేర్ చేయకుండా దాచేయొచ్చు. అలానే iCloud+ సబ్‌స్క్రిప్షన్‌తో ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఐపాడ్ టచ్, iOS 15, iPadOS 15, సఫారీలోని ఏదైనా ఈమెయిల్ ఫీల్డ్‌లో ప్రత్యేకమైన, వేరే ఈమెయిల్‌ను క్రియేట్ చేయవచ్చు. అలాగే, ఫార్వార్డ్ చేసిన ఈ-మెయిల్ అడ్రస్‌ను మార్చవచ్చు. లేదా మీరు మెయిల్‌ను రిసీవ్ చేసుకోకుండా ఈమెయిల్ ఫార్వార్డింగ్‌ని ఆఫ్ చేయచ్చు.
హైడ్ మై ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి?
స్టెప్ 1: ఫోన్ సెట్టింగ్స్>[మీ పేరు]> iCloud> హైడ్ మై ఈమెయిల్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: తర్వాత 'హైడ్ మై ఈమెయిల్' ఆప్షన్లో 'క్రియేట్ న్యూ అడ్రస్'పై క్లిక్ చేసి కొత్త అడ్రస్ క్రియేట్ చేయొచ్చు.
స్టెప్ 3: ఇప్పటికే ఐడీలు క్రియేట్ చేసుకొని, వాటిలో ఒకటి డియాక్టివేట్ చేయాలనుకుంటే.. 'డియాక్టివేట్ ఏ హైడ్ మై ఈమెయిల్ అడ్రస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒక అడ్రస్‌పై క్లిక్ చేసి దానిని డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ ఐడీ మీకు ఈమెయిల్‌లను ఫార్వర్డ్ చేయదు.
స్టెప్ 4: ఏ వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్స్ ఫార్వార్డ్ కావాలో కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందుకు 'ఫార్వర్డ్ టు'పై క్లిక్ చేసి, ఒక ఈమెయిల్ అడ్రస్ సెలక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 5: ఫార్వర్డింగ్ అడ్రస్‌ను కాపీ చేయడానికి హైడ్ మై ఈమెయిల్ సెక్షన్లో నచ్చిన ఐడీ కాపీ చేసుకొని.. వేరే చోట టెక్స్ట్ ఫిల్ ఫీల్డ్‌లో పేస్ట్ చేస్తే సరిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.