Home /News /technology /

HOW TO INSTALL WINDOWS 11 ON YOUR LAPTOP RIGHT NOW CHECKTHE DETAILS HERE JNK GH

Windows 11: అందుబాటులోకి వచ్చిన విండోస్ 11 ఓఎస్‌.. సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే..

విండోస్ 11ను ఇన్‌స్టాల్ చేసుకోండి ఇలా.. (PC: Microsoft)

విండోస్ 11ను ఇన్‌స్టాల్ చేసుకోండి ఇలా.. (PC: Microsoft)

అక్టోబర్ 5 నుంచి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అన్ని కంపాటబుల్ డివైజ్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే అన్ని డివైజ్‌లకు 2022 ద్వితీయార్థం నాటికి అప్‌డేట్ అందించాలని కంపెనీ భావిస్తోంది. ల్యాప్‌టాప్‌లో విండోస్ 11ను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft)  సంస్థ కొద్ది నెలల క్రితం విండోస్‌ 11 (Windows 11) ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఈ అప్‌డేట్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని యూజర్లు కొద్ది వారాలుగా వేచి చూస్తున్నారు. అయితే వారి నిరీక్షణకు తెరపడింది. అక్టోబర్ 5 నుంచి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అన్ని కంపాటబుల్ డివైజ్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే అన్ని డివైజ్‌లకు 2022 ద్వితీయార్థం నాటికి అప్‌డేట్ అందించాలని కంపెనీ భావిస్తోంది. ల్యాప్‌టాప్‌లో (Laptop) విండోస్ 11ను ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం.

మీ డివైజ్‌కు లేదా ల్యాప్‌టాప్‌కు విండోస్ 11 అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి విండోస్ అప్‌డేట్‌ (Windows Update) పై క్లిక్ చేయండి. మీ డివైజ్‌కు అప్‌డేట్ వస్తే.. ఆ పేజీ నుంచి ఓఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఒకవేళ మీ డివైజ్‌కు ఇంకా అప్‌డేట్‌ రాకపోతే.. విండోస్ 11ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడానికి మూడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

* విండోస్ 11 సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ పేజీకి వెళ్లండి. తరువాత 'డౌన్‌లోడ్ నౌ(Download Now)’ పై క్లిక్ చేయండి. అనంతరం స్క్రీన్ పై కనిపిస్తున్న సూచనలు ఫాలో అవ్వండి.

* అదే పేజీలో 'క్రియేట్ విండోస్ 11 ఇన్‌స్టలేషన్ మీడియా' పై కూడా క్లిక్ చేయవచ్చు. మీ డివైజ్‌ను బూట్ చేయగల యూఎస్‌బీ(USB) లేదా డీవీడీ(DVD)లోకి విండోస్ 11 ఓఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దాని ద్వారా డివైజ్‌ను కొత్త ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Amazon Prime : ప్రైమ్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. అమెజాన్ అదిరిపోయే ఆఫ‌ర్‌




* వర్చువల్ మెషిన్ ఇన్‌స్టాల్ లేదా ఏదైనా బూటబుల్(bootable) మీడియా కోసం మీరు డిస్క్ ఇమేజ్ (ISO) ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

విండోస్ 10కి సపోర్ట్ చేసే ప్రతి డివైజ్‌కి ఈ అప్‌డేట్ వస్తుంది. అయితే మీ డివైజ్ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌కు సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ పీసీ హెల్త్ చెక్ (Microsoft PC Health Check) యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. మీ సిస్టమ్ లో కొన్ని కనీస హార్డ్‌వేర్ ఫీచర్లు ఉంటేనే ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోవడానికి వీలుపడుతుంది.

పీసీ హెల్త్ చెకప్ మీ సిస్టమ్ లో కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్లి కనీస హార్డ్‌వేర్ రిక్వైర్‌మెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. అనంతరం మీ సిస్టమ్ విండోస్ 11తో అప్‌డేట్ అవుతుందా లేదా అనేది తెలియజేస్తుంది. లేదంటే కంపెనీ సూచించిన మినిమం హార్డ్‌వేర్ అవసరాలను చెక్ చేస్తే సరిపోతుంది. 1Ghz ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ అవైలబుల్ స్టోరేజ్, DirectX 12 కి సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్, ట్రస్టెడ్ ప్లాట్‌ఫాం మాడ్యూల్ (TPM) వెర్షన్ 2.0, 720p రిజల్యూషన్ డిస్‌ప్లే.. వంటివి ఉంటే ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ అవుతుంది. అత్యుత్తమ విండోస్ 11 అప్‌గ్రేడ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎలిజిబుల్ డివైజులు విండోస్ 10, వెర్షన్ 20 హెచ్1 లేదా ఆ తర్వాత వెర్షన్‌లపై పని చేస్తూ ఉండాలని కంపెనీ తెలిపింది.

ఈ అప్‌డేట్‌తో మరిన్ని కొత్త యాప్‌లు వస్తాయి. విండోస్ 11లో టాస్క్ బార్ (Task Bar) సరికొత్తగా కనిపించనుంది. ఈ టాస్క్‌బార్ మ్యాక్‌ ఓఎస్ లోని టాస్క్‌బార్ ను పోలి ఉంటుంది. కాంటెక్స్ట్ మెనూలు, పాప్‌అప్‌లు, విండోస్ ఐకాన్స్ రౌండ్ కార్నర్లతో మరింత ఆకర్షణీయంగా కనిపించనున్నాయి.
Published by:John Naveen Kora
First published:

Tags: Microsoft, Windows 11

తదుపరి వార్తలు