ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడుకోవాలంటే... ఇలా చేయండి

మనం ఒకే ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించొచ్చు. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. సాధ్యం కూడా అవుతోంది. దీంతో పర్సనల్‌గా ఒక అకౌంట్, ఆఫీస్‌కు సంబంధించి.. అంటే వర్క్ కోసం మరొక వాట్సాప్‌ను వాడొచ్చు.

news18-telugu
Updated: June 12, 2019, 8:37 AM IST
ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడుకోవాలంటే... ఇలా చేయండి
నమూనా చిత్రం
news18-telugu
Updated: June 12, 2019, 8:37 AM IST
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారంటూ లేరు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నాక... అందులో వాట్సాప్ ఉండకుండా ఉంటుంది. కచ్చితంగా వాట్సాప్ ఉండాల్సిందే. అందరితో చకచక చాట్ చేయాల్సిందే. వాట్సాప్ అనేది ప్రజంట్ జనరేషన్‌కు మోస్ట్ లవ్‌డ్ మెసేజింగ్ యాప్ ఇది. అందుకే వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. అయితే ఇప్పటివరకు మనకు ఫోన్లో రెండు సిమ్స్ ఉన్నా... వాట్సాప్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఒక సిమ్‌ నెంబర్‌తోనే మనం వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేస్తుంటాం. రెండు నెంబర్లున్నా రెండు వాట్సాప్ అకౌంట్లను మాత్రం ఒకేసారి వాడలేం. అయితే ఇక నుంచి ఆ బాధ పడనవసరం లేదు. మనం ఒకే ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించొచ్చు. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. సాధ్యం కూడా అవుతోంది. దీంతో పర్సనల్‌గా ఒక అకౌంట్, ఆఫీస్‌కు సంబంధించి.. అంటే వర్క్ కోసం మరొక వాట్సాప్‌ను వాడొచ్చు. అదెలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా వాట్సాప్ యాప్‌రు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీ ఫోన్‌లో వాట్సాప్ ఆల్ రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంటే మాత్రం అవసరం లేదు. వాట్సాప్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.ఆ తర్వాత ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోని యాప్స్‌‌లోకి వెళ్లాలి. అక్కడ డ్యూయెల్ యాప్/క్లోన్ యాప్/యాప్ ట్విన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి. అందులో వాట్సాప్ ఎంచుకోండి.

ఫోన్ యాప్స్‌లో రెండు వాట్సాప్‌లు కనిపిస్తాయి. ఇంకొక నెంబర్‌పై రెండో అకౌంట్‌ కూడా క్రియేట్ చేసుకోండి. అయితే ఒకవేళ మీ ఫోన్‌లో డ్యూయెల్ ఉంటే ఓకే లేకపోతే మాత్రం పారలెల్ స్పేస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. వాట్సాప్ ఒక్కటే కాదు.. ఫేస్‌బుక్, మెసేంజర్ వంటి యాప్స్‌ కూడా క్లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ ద్వారా ఒకే ఫోన్‌లో రెండు అకౌంట్లు ఈజీగా వినియోగించుకోవచ్చు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మనం చాలా సులభంగా మన అకౌంట్లను ఈజీగా వాడుకోవచ్చు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...