HOW TO HIDE YOUR POST ON INSTAGRAM WITHOUT REMOVING IT JUST FOLLOW THIS SIMPLE STEPS TO KNOW ABOUT IT PRV GH
Instagram: మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను డిలీట్ చేయకుండా రిమూవ్ చేయాలా?.. అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
యూజర్ల ఇంటర్‌ఫేజ్‌ను మెరుగుపర్చేందుకు అనేక కొత్త ఫీచర్లను ప్రకటిస్తోంది ఇన్స్టాగ్రామ్. తాజాగా ప్రొఫైల్ నుంచి పోస్ట్‌లను డిలీట్ చేయకుండా రిమూవ్ చేసే ఫీచర్‌ను పరిచయం చేసింది.
పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) రోజుకో కొత్త ఫీచర్‌ను జోడిస్తూ యూజర్ల (Users)ను ఆకట్టుకుంటోంది. తన యూజర్ బేస్‌ను కాపాడుకుంటూనే కొత్త యూజర్లపై దృష్టి పెట్టింది. ప్రారంభంలో ఫోటో-షేరింగ్ (Photo sharing) సేవలకు మాత్రమే పరిమితమైన ఇన్స్టాగ్రామ్.. ఆ తర్వాత వీడియో ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా మారింది. మరోవైపు యూజర్ల ఇంటర్‌ఫేజ్‌ను మెరుగుపర్చేందుకు అనేక కొత్త ఫీచర్లను (New features) ప్రకటిస్తోంది. తాజాగా ప్రొఫైల్ నుంచి పోస్ట్‌లను డిలీట్ చేయకుండా (without delete) రిమూవ్ చేసే ఫీచర్ (Feature)ను పరిచయం చేసింది.
సాధారణంగా ఒక నిర్దిష్ట ఫోటో లేదా వీడియోను అప్లోడ్ (Upload) చేసిన తర్వాత ఫాలోవర్స్‌కు కనిపించకుండా దాన్ని డిలీట్ చేయాలనుకుంటారు చాలా మంది. అయితే, ఆ ఫోటోను శాశ్వతంగా డిలీట్ చేస్తే దాన్ని తిరిగి ఎప్పటికీ చూసుకోలేం. అందువల్ల ఫోటోను రిమూవ్ (remove) చేసినప్పటికీ.. బ్యాకప్ (backup)లో చూసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ మీ ఇన్స్టాగ్రామ్ (Instagram) పోస్ట్‌లను అర్కైవ్ (Archive)లో చెక్కుచెదరకుండా దాచి పెడుతుంది. ఈ అద్భుతమైన ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (Instagram Account)ను ఓపెన్ చేయండి.
మీ ప్రొఫైల్ (Profile)కి వెళ్లండి.
మీరు మీ ఫాలోవర్స్‌కు కనిపించకూడదని భావిస్తున్న పోస్ట్/ ఫోటో (Post/Photo)ను ఎంచుకోండి.
పోస్టును ఓపెన్ చేసిన తర్వాత, పోస్ట్ కుడి ఎగువ మూల (Top right-side)లో ఉన్న మూడు చుక్కల (Three dots)పై క్లిక్ చేయండి.
వెంటనే ఆప్షన్ ట్రే ఓపెన్ అవుతుంది.
వాటిలో 'అర్కైవ్' (Archive) ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇకపై ఆ పోస్ట్ మీ ప్రొఫైల్ (Profile)లో కనిపించదు. అయితే మీ అర్కైవ్‌ను యాక్సెస్ చేయడం ద్వారా తిరిగి మీ పోస్ట్‌ను వీక్షించవచ్చు.
* పోస్ట్‌ను అన్‌హైడ్ (Unhide) చేయడం ఎలా?
మీ ఆర్కైవ్‌లో సేవ్ అయిన పోస్ట్‌ను అన్‌హైడ్ (Unhide) చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి.
మీ ప్రొఫైల్ (Profile)కి వెళ్లండి.
స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
'అర్కైవ్'ను ఎంచుకోండి.
మీరు అర్కైవ్‌ను యాక్సెస్ చేసిన తర్వాత, మీరు మీ ఫాలోవర్స్ నుంచి దాచిన పోస్ట్‌లను చూడవచ్చు.
ఆ తర్వాత మీరు అన్‌హైడ్ (Unhide) చేయాల్సిన పోస్ట్‌ను ఎంచుకోండి.
మళ్లీ మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
మీకు ‘షో ఆన్ ప్రొఫైల్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
అంతే, మీ ప్రొఫైల్‌లో సదరు పోస్ట్ మళ్లీ కనిపిస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.