ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్ట్ చేసిన తర్వాత యూజర్లు పావుగంటకోసారి యాప్ ఓపెన్ చేసి ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఎన్ని లైక్స్ వచ్చాయోనని చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లైక్స్, వ్యూస్ తక్కువగా వస్తే చికాకుగా ఫీలవుతుంటారు. సోషల్ మీడియా యూజర్లలో ఈ అలవాటు మామూలే. ఇక కొందరు ఆ లైకులు, కామెంట్లు, వ్యూస్ గురించి అస్సలు పట్టించుకోరు. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) తాము పోస్ట్ చేయాలనుకున్నది పోస్ట్ చేసి వదిలిపెడతారు. ఇక ఇంకొందరికైతే తమ పోస్టులకు వచ్చిన లైక్స్ గురించి ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కౌంట్ ఎలా కనిపించకుండా చేయాలి? (How to Hide Like Count From Instagram Post) అని ఆలోచిస్తుంటారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్ కౌంట్ హైడ్ చేయొచ్చు. అంటే ఎన్ని లైకులు వచ్చాయని ఇతరులు చూడకుండా చేయొచ్చు. ఈ ఫీచర్‍ను ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు చాలా సింపుల్‌గా లైక్స్ కౌంట్ హైడ్ చేయొచ్చు. ఎలాగో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
WhatsApp: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త... మీ కోసమే ఈ ఫీచర్
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
Step 2- కుడివైపున ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
Step 3- కిందకు స్క్రోల్ చేయండి.
Step 4- మీరు ఏ పోస్టుకు లైక్స్ కౌంట్ హైడ్ చేయాలనుకుంటే ఆ పోస్ట్ సెలెక్ట్ చేయండి.
Step 5- కుడివైపున త్రీడాట్ ఐకాన్ క్లిక్ చేయండి.
Step 6- ఆ తర్వాత చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
Step 7- అందులో Hide Like Count పైన క్లిక్ చేయండి.
ఒకవేళ తర్వాత మీరు లైక్ కౌంట్ ఇతరులకు కనిపించేలా చేయాలంటే సేమ్ స్టెప్స్ ఫాలో అయి Unhide Like Count ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు పోస్ట్ చేసేముందు కూడా ఈ సెట్టింగ్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
Mobile Offer: తొలిసారి రూ.10,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ సేల్... 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ
Step 1- ముందుగా మీరు పోస్ట్ చేయాలనుకునే ఫోటో సెలెక్ట్ చేయాలి.
Step 2- క్యాప్షన్ యాడ్ చేయాలి.
Step 3- అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Hide Like and View Counts బటన్ సెలెక్ట్ చేయాలి.
మీరు పోస్ట్ చేసిన తర్వాత ఆ పోస్టుకు సంబంధించిన లైక్స్ కనిపించవు. ఒకవేళ మీరు అన్ని పోస్టులకు లైక్స్ కౌంట్ కనిపించకుండా చేయాలంటే ప్రైవసీ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
Step 2- కుడివైపున ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
Step 3- టాప్ రైట్‌లో త్రీడాట్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 5- మెనూలో పోస్ట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 6- Hide Like and View Counts బటన్ ఆన్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram, Smartphone, Social Media