హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

How to get Blue tick on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ పొందండి ఇలా

How to get Blue tick on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ పొందండి ఇలా

How to get Blue tick on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to get Blue tick on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to get Blue tick on Instagram | సోషల్ మీడియా యాప్స్‌లో లభించే వెరిఫికేషన్ బ్యాడ్జికి (Verification Badge) క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. తమ అకౌంట్‌కి కూడా బ్లూటిక్ కావాలని కోరుకుంటూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam | Tirupati | Vijayawada

వెరిఫై చేసిన అకౌంట్లకు ఇన్‌స్టాగ్రామ్ బ్లూటిక్ ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ (Instagram Blue Tick) ఉన్న అకౌంట్స్ అంటే వెరిఫై చేసిన అకౌంట్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే బ్లూటిక్ పొందేందుకు యూజర్లు ప్రయత్నిస్తుంటారు. ఈ సోషల్ మీడియా యాప్‌లో సులువుగానే బ్లూటిక్ పొందవచ్చు. ఇందుకోసం యూజర్లు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం యూజర్లు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. దీంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయాలి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ బ్లూటిక్ ఇస్తుంది. దీన్నే వెరిఫికేషన్ బ్యాడ్జి అంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఎలా పొందాలి? (How to get Blue tick on Instagram) అని యూజర్లు సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే బ్లూటిక్ ఇవ్వాలా, ఇవ్వకూడదా అన్నది ఇన్‌స్టాగ్రామ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ప్రతీ అకౌంట్‌కు బ్లూటిక్ లభించదు. ఇందుకు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అన్నీ పరిశీలించిన తర్వాతే బ్లూటిక్ ఇస్తుంది. యూజర్ నేమ్ పక్కన బ్లూటిక్ కనిపిస్తుంది. మరి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‍కి కూడా బ్లూటిక్ కావాలనుకుంటున్నారా? వెరిఫికేషన్ బ్యాడ్జి కోసం ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

IRCTC QR Code: ప్రయాణికులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ క్యూఆర్ కోడ్ పేమెంట్ సేవలు

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ కోసం రిక్వెస్ట్ చేయండిలా


Step 1- ముందుగా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.

Step 2- మీరు ఏ అకౌంట్‌కి బ్లూటిక్ కోరుకుంటున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్‌తో లాగిన్ కావాలి.

Step 3- ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత త్రీడాట్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

Step 5- సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయాలి.

Step 6- అకౌంట్ పైన క్లిక్ చేసి రిక్వెస్ట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

Step 7- మీ పూర్తి పేరు, ఫోటో ఐడీ ఇవ్వాలి.

Step 8- స్క్రీన్ పైన ఉన్న డైరెక్షన్స్ ప్రకారం నెక్స్‌ట్ స్టెప్స్ పూర్తి చేయాలి.

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... 6000mAh బ్యాటరీ, 48MP కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే

ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు రిక్వెస్ట్ చేసినంతమాత్రానా బ్లూ టిక్ వస్తుందని చెప్పడం కష్టం. వెరిఫికేషన్ మొత్తం పూర్తైనా మీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలుంటాయి. ఒకటి కన్నా ఎక్కువసార్లు రిక్వెస్ట్ చేస్తే బ్లూటిక్ వస్తుందనుకుంటే పొరపాటే. ఒకసారి అకౌంట్ వెరిఫై అయితే మీరు మీ యూజర్ నేమ్ మార్చకూడదు. ఒకవేళ వెరిఫికేషన్ బ్యాడ్జి వస్తే ఇతర అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు. తప్పుడు సమాచారంతో వెరిఫికేషన్ బ్యాడ్జి పొందినట్టైతే ఆ విషయం తెలియగానే బ్లూటిక్ తొలగిస్తుంది ఇన్‌స్టాగ్రామ్. మీ అకౌంట్‍ని కూడా డిసేబుల్ చేస్తుంది.

First published:

Tags: Instagram, Social Media

ఉత్తమ కథలు