హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart Phones: మీ ఫోన్ సేఫ్ఏనా.. ఓసారి చెక్ చేసుకోండి

Smart Phones: మీ ఫోన్ సేఫ్ఏనా.. ఓసారి చెక్ చేసుకోండి

అచ్చం ఒరిజినల్ యాప్స్‌గా ఉండే యాప్స్‌ను తయారు చేసి వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. అందుకే ఒరిజినల్ యాప్స్‌ను గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

అచ్చం ఒరిజినల్ యాప్స్‌గా ఉండే యాప్స్‌ను తయారు చేసి వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. అందుకే ఒరిజినల్ యాప్స్‌ను గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మనం నిత్యం ఎన్నో ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌ (Smart Phones) ల‌తో నిర్వ‌ర్తిస్తాం. ఆన్‌లైన్ లావాదేవీలు.. ఆఫీసుప‌నులు ఇలా ఎన్నోవాటిని మ‌నం ఫోన్‌పైనే ఆధార‌ప‌డుతుంటాం. కావున మన ఫోన్ సురక్షితంగా వాడుతున్నామా లేదా తెలుసుకోండి.

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడ‌ని వారంటు ఉండ‌డం అరుదు. ప్ర‌తీ ఒక్క‌రు స్మార్ట్ ఫోన్‌లు వాడుతుంటారు. మ‌నం నిత్యం ఎన్నో ప‌నుల‌ను స్మార్ట్ ఫోన్‌ (Smart Phones) ల‌తో నిర్వ‌ర్తిస్తాం. ఆన్‌లైన్ లావాదేవీలు.. ఆఫీసుప‌నులు ఇలా ఎన్నోవాటిని మ‌నం ఫోన్‌పైనే ఆధార‌ప‌డ‌తుంటాం. ఇదే అద‌నుగా సైబ‌ర్ (Cyber) నేర‌గాళ్లు ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌ల‌తో ఫోన్‌లోకి వైర‌స్ పంపి డ‌బ్బులు కాజేస్తుంటారు. దీని వ‌ల్ల చాలా మంది న‌ష్ట‌పోతున్నారు. వినియోగ‌దారులు చేసే చిన్న త‌ప్ప‌దాలు సైబ‌ర్ నేర‌గాళ్ల పాలిట వ‌రంగా మారుతున్నాయి. మ‌న‌కు తెలియ‌కుండానే ఫోన్‌లో మాల్వేర్‌ను పంపి స‌మాచారాన్ని అంతా కాజేస్తుంన్నారు. అస‌లు ఫోన్‌లోకి మాల్వేర్‌ (Malware)e ఎలా వ‌స్తుంది. దాన్ని ఎలా గుర్తింవ‌చ్చో తెలుసుకొందాం. ప్ర‌స్తుతం చెబుతున్న ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మీ ఫోన్‌లో వైర‌స్ ఉందా లేదా తెలుసుకోవ‌చ్చు.

మాల్వేర్ అంటే..

మాల్వేర్ అనేది కంప్యూటర్‌లు మరియు కంప్యూటర్ సిస్టమ్‌ (System) లను దెబ్బతీయడానికి మరియు నాశనం చేయడానికి రూపొందించబడిన అనుచిత సాఫ్ట్‌వేర్.

ఫోన్‌లో మాల్వేర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..

- మీరు మీ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించకపోయినప్పటికీ వేడిగా అవుతుంది అంటే అనుమానించాల్సిందే. బ్యాక్‌గ్రౌండ్‌ (Background) లో ఏదో అప్లికేష‌న్ ర‌న్ అవుతున్నట్టు. వెంట‌నే అప్ర‌మ‌త్తం అవ్వాలి.

- మీరు ఎక్కువ‌గా డేటా వాడ కున్నా.. మీ డేటా చాలా వేగంగా అయిపోతుందా.. ఇలా జ‌రిగితే వెంట‌నే ఫోన్‌ను ఓ సారి అప్లికేష‌న్‌ (Applications) ల‌ను ప‌రిశీలించండి. క‌చ్చితంగా మీకు తెలియ‌ని యాప్‌ను గుర్తించ‌గ‌లుగుతారు.

- అన‌వ‌సమైన ప్ర‌క‌ట‌న‌లు మీ స్క్రీన్ మీద ద‌ర్శ‌నం ఇస్తున్నాయా.. అయితే యాడ్‌వేర్ ఉన్నట్లు సూచన కావచ్చు. అవి అవాంఛిత ప్రకటనలను అందించడమే కాకుండా హానికరమైన మాల్వేర్‌తో ఫోన్‌కి కూడా సోకుతాయి.

Facebook Smart Glasses: ఫేస్‌బుక్‌ స్మార్ట్ కళ్లద్దాలపై ఈయూ అభ్యంత‌రాలు


యాప్‌ల‌ను తొల‌గించే ప‌ద్ధ‌తి..

- ముందుగా మీ ఫోన్‌లో ఏ యాప్‌లు (Apps) ఇతర యాప్‌ల కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నాయో తనిఖీ చేయండి. మీరు వాటిని గుర్తించలేకపోతే వాటిని తొలగించండి.

- మీ ఫోన్‌లోని అన్ని యాప్‌లకు వెళ్లండి. మీకు తెలియ‌ని యాప్‌లు ఉన్నా తొల‌గించండి.

వైర‌స్ రాకుండా ఇలా చేయండి..

- తెలియ‌ని యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేయ‌కూడ‌దు.

- గూగుల్‌ ప్లేస్టోర్ లేదా యాపిల్ ప్లేస్టోర్ (Play Store) వంటి అధికారిక స్టోర్స్ ద్వారానే యాప్‌ల‌ను వాడాలి.

- యాప్ ఇన్‌స్టాల్ చేసుకొన్న త‌రువాత ప‌ర్మిష‌న్ల‌ను చెక్ చేసుకోండి.

- మీకు అవ‌స‌రం లేని అనుమ‌తుల‌ను తొల‌గించ‌డంది.

- అవ‌స‌రం అయితే ఓ యాంటీ వైర‌స్ (Anti Virus) సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో వాడితే మంచింద‌ది.

First published:

Tags: FAKE APPS, Google Play store, Smartphone

ఉత్తమ కథలు