గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

మీ ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉన్నా ఆఫ్‌లో ఉన్నా అనుక్షణం గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తోందన్నది వాస్తవం. మరి గూగుల్ గుప్పిట్లో చేరిన మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 15, 2018, 5:09 PM IST
గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?
(Image: REUTERS/Charles Platiau)
  • Share this:
గూగుల్ సేవలపై అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ అనుమతి లేకుండానే లొకేషన్ డేటాను గూగుల్ సేవ్ చేసుకుంటుందన్న విషయం బయటపడింది. మీరు లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా సరే... గూగుల్ యాప్స్ కొన్ని మీ లొకేషన్ డేటాను సేకరిస్తుంటాయి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నారో ట్రాక్‌ చేయగలుగుతుంది గూగుల్. ఆ వివరాలను మీ గూగుల్ అకౌంట్‌లో సేవ్ చేస్తుంది. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వేర్వేరు మార్గాల్లో లొకేషన్ హిస్టరీ, వెబ్, యాప్ యాక్టివిటీని ఉపయోగించుకుంటున్నామని గూగుల్ సమర్థించుకున్నా... అది వ్యక్తిగత ప్రైవసీని భంగపరిచేదే. గూగుల్ ఇన్నాళ్లూ సేకరించిన మీ డేటాను మీరు డిలిట్ చేయొచ్చు.

గూగుల్ ట్రాకింగ్‌ను ఎలా తప్పించుకోవాలి?
ఏ డివైజ్ అయినా సరే ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. myactivity.google.com వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మీ గూగుల్ అకౌంట్‌తో సైన్-ఇన్ చేయండి. టాప్ లెఫ్ట్‌లో డ్రాప్‌డౌన్ మెనూలో "యాక్టివిటీ కంట్రోల్స్‌" క్లిక్ చేయండి. "వెబ్ & యాప్ యాక్టివిటీ", "లొకేషన్ హిస్టరీ" టర్న్ ఆఫ్ చేయండి. వీటి ద్వారా మీ లొకేషన్లను గూగుల్ పసిగట్టలేదు. ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేస్తే కొన్ని సర్వీసులు సరిగ్గా పనిచేయవు అని గూగుల్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

ఐఓఎస్:
మీరు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్నట్టయితే మీ లొకేషన్ సెట్టింగ్‌ని "వైల్ యూజింగ్" మోడ్‌లోకి మార్చుకోవాలి. మీరు యాక్టీవ్‌గా లేనప్పుడు గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయలేదు. సెట్టింగ్స్-ప్రైవసీ-లొకేషన్ సర్వీసెస్‌లోకి వెళ్లి అక్కడ గూగుల్ మ్యాప్స్ సెలెక్ట్ చేసి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.ఆండ్రాయిడ్:
మెయిన్ సెట్టింగ్స్‌లో "సెక్యూరిటీ & లొకేషన్" క్లిక్ చేసి స్క్రోల్ డౌన్‌లో "ప్రైవసీ" క్లిక్ చేయాలి. "లొకేషన్"పై ట్యాప్‌ చేసి ఆఫ్ చేయొచ్చు. దాంతోపాటు మిగతా యాప్స్‌లో "యాప్-లెవెల్ పర్మిషన్స్" టర్న్స్ ఆఫ్ చేసుకోవాలి. ఐఫోన్ లాగా "వైల్ యూజింగ్" సెట్టింగ్ ఆండ్రాయిడ్‌లో లేదు. మీరు గూగుల్ ప్లే సర్వీసెస్‌ని టర్న్‌ ఆఫ్ చేయలేరు.పాత లొకేషన్ ట్రాకింగ్ ఎలా డిలిట్ చేయాలి?
ఏ డివైజ్ అయినా సరే ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. myactivity.google.com వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మీ గూగుల్ అకౌంట్‌తో సైన్-ఇన్ చేయండి. "డీటైల్స్" పక్కన లొకేషన్ పిన్ ఐకాన్‌ లేదా "ఫ్రమ్ యువర్ కరెంట్ లొకేషన్"పై క్లిక్ చేయాలి. గూగుల్ మ్యాప్స్‌లో మీరు ఎక్కడున్నారో చూపిస్తుంది. త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి "డిలిట్" చేయొచ్చు. ప్లేసెస్, గూగుల్ వెబ్‌సైట్, సెర్చ్, మ్యాప్స్ ఇలా ప్రతీదాంట్లో మీ డేటాను డిలిట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

గూగుల్ మిమ్మల్ని వెంటాడుతోంది!

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్లు పోతాయ్!
First published: August 15, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు