మీరు కారు లేదా ఇతర వాహనం నడపడం నేర్చుకుంటున్నారా... అయితే, మీరు తప్పనిసరిగా లెర్నర్స్ లైసెన్స్ (Learner’s License) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే భారతీయ రోడ్లపై డ్రైవింగ్ (Driving) నేర్చుకోవాలంటే లెర్నర్స్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి. ఈ లైసెన్స్‌తో మీరు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తితో కలిసి డ్రైవింగ్ చట్టబద్ధంగా నేర్చుకోవచ్చు. ఇండియన్ రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లెర్నర్స్ లైసెన్స్‌ని తీసుకెళ్లపోతే, మీరు చేసిన నేరాన్ని బట్టి రూ.450 జరిమానా (Fine) లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. మీరు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్నా లెర్నర్ లైసెన్స్ మొదట తీసుకోవడం మంచిది.
కొన్నేళ్ల క్రితం లైసెన్స్ వంటివి తీసుకోవాలంటే చాలా సమయం పట్టేది. అలాగే వీటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని లెర్నర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు హాజరుకావచ్చు. సెకన్లలో మీ లైసెన్స్ పొందవచ్చు. ఇవన్నీ మీ ఇంటి నుంచే చేయవచ్చు. మీ లెర్నర్ లైసెన్స్‌ని సేకరించేందుకు మీరు ఆర్టీఓ (RTO) కార్యాలయాన్ని విజిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మీకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత ఉంటే, మీరు భౌతికంగా రవాణా కార్యాలయం (Transport Office)లో హాజరు కావాల్సి ఉంటుంది. అలానే డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాలి. మీరు పరీక్షలో ఉత్తీర్ణులైతే, అప్పుడు మాత్రమే మీరు డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత పొందుతారు.
* లెర్నర్స్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- sarathi.parivahan.gov.in వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
- వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశాక... మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
- మీరు రాష్ట్రాన్ని సెలెక్ట్ చేశాక మల్టిపుల్ ఆప్షన్లతో కొత్త విండో ఓపెన్ అవుతుంది
- “అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్” పై క్లిక్ చేయాలి.
- అప్లై ఫర్ ఎ లెర్నర్ లైసెన్స్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్‌తో దరఖాస్తు చేయాలనుకుంటున్నారా లేదా ఆధార్ కార్డ్‌తో కాకుండా దరఖాస్తు చేయాలనుకుంటున్నారా అనే ఒక ఆప్షన్ అడుగుతుంది.
- మీరు అప్లికంట్ విత్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, మీరు మీ ఇంటి నుంచి లేదా ఏదైనా సమీప ప్రదేశం నుంచి పరీక్ష రాసుకోవచ్చు.
- ఆపై ఇండియాలో జారీ చేసిన డ్రైవింగ్ లేదా లెర్నర్ లైసెన్స్ ఉందా అని ఒక ఆప్షన్ అడుగుతుంది.
- మీరు ఆ వివరాలను కన్ఫామ్ చేశాక మీ ఆధార్ కార్డ్ వివరాలను సబ్మిట్ చేయాలి.
- ఆధార్ కార్డ్ నంబర్‌తో పాటు ఆ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి
- మీ పేరు, ఫొటోను మీ ఆధార్ కార్డ్ నుంచి సిస్టం ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.
- అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత లైసెన్స్ కోసం ఫీజు పే చేయాలి.
- పేమెంట్ చేసిన తర్వాత మీరు 10 నిమిషాల డ్రైవింగ్ ట్యుటోరియల్‌ని చూడాలి. అప్పుడు మాత్రమే పరీక్షకు అర్హులవుతారు.
- వీడియోను చూడగానే, పరీక్ష కోసం మీ ఫోన్‌కి ఓటీపీ, పాస్‌వర్డ్‌ను పంపిస్తారు.
- వివరాలను ఫిల్ చేసి మీ పరీక్ష ప్రారంభం కావడానికి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలి.
- ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మీకు 60 సెకన్ల సమయం ఉంటుంది. మీ ప్రశ్నలన్నింటికీ త్వరగా, సరైన సమాధానాలు ఇవ్వాలి. మీరు లైసెన్స్ పొందడానికి 10 ప్రశ్నలలో కనీసం 6 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి.
- మీరు పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీ లైసెన్స్ లింక్ మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. మీరు పరీక్షలో విఫలమైతే, మీరు రీటెస్ట్ ఫీజు రూ. 50 చెల్లించి మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Driving licence, Technology