WhatsApp Tricks : వాట్సాప్‌లోని మంచి ఆప్షన్లలో ఒకటైన స్టేటస్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అందులో వీడియోలు, ఫొటోలు ఎలా డౌన్లోడ్ చెయ్యాలో తెలుసుకుందాం.
కొన్నిసార్లు మనం వాట్సాప్ స్టేటస్‌లో వీడియోనో, ఫొటోలనో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం. అవి మన ఫ్రెండ్స్ మన కోసం పంపించినవి కావచ్చు. మనం వాళ్లతో దిగిన ఫొటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు. వాటిని డౌన్లోడ్ చేసుకుందామంటే వాట్సాప్‌లో ఆ ఫీచర్ లేదు. మరెలా... ఇందుకో సొల్యూషన్ ఉంది. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్‌ల నుంచీ వీడియోలు, ఫొటోలూ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, కొన్ని ఈజీ మెథడ్స్ ఫాలో అవ్వాల్సిందే. అవి చాలా సింపుల్ స్టెప్స్. వాటి ద్వారా మీరు అత్యంత తేలిగ్గా డౌన్లోడ్ చెయ్యగలరు. ఇందుకోసం మీకు టెక్నాలజీపై పట్టు ఉండాల్సిన పనిలేదు. టెక్నికల్ నాలెడ్జి కూడా అంతగా అవసరం లేదు.
ఇలా చెయ్యండి
ట్రిక్ 1 :
* మీ ఫోన్లో ఇంటర్నెట్ డేటాను ఆన్ చెయ్యండి.
* ఇప్పుడు వాట్సాప్ తెరచి, స్టేటస్‌లోకి వెళ్లండి.
* మీరు ఏం డౌన్లోడ్ చెయ్యాలనుకుంటున్నారో వాటిని ఓసారి పూర్తిగా చూడండి.
* ఇప్పుడు మీ మొబైల్లోని ఫైల్ మేనేజర్ (File Manager) ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి.
* సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. Show Hidden Files ఆప్షన్‌ను ఒత్తండి (tap)
* ఇప్పుడు స్టోరేజ్‌లోకి వెళ్లి... వాట్సాప్ ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీడియా ఆప్షన్లో స్టేటస్ (.statuses) ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో వాట్సాప్ స్టేటస్‌లో మీరు చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. వాటిని కాపీ చేసి... వేరే ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి.
ఈ విధంగా మీరు వాట్సాప్ స్టేటస్‌లోని ఫొటోలూ, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు రెండో విధానం కూడా ఉంది.
ట్రిక్ 2 :
* గూగుల్ ప్లే స్టోర్ నుంచీ థర్డ్ పార్టీకి చెందిన WhatsApp Status Download Manager Appని డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవాలి.
* ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి... స్టేటస్‌లోకి వెళ్లండి.
* మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్న ఫ్రెండ్స్ స్టేటస్ లను పూర్తిగా చూడండి.
* ఇప్పుడు మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసిన యాప్‌ను ఓపెన్ చెయ్యండి.
* అందులో మీరు చూసిన స్టేటస్ వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.