హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

క్లిప్ కన్వర్టర్ (Image : Twitter)

క్లిప్ కన్వర్టర్ (Image : Twitter)

Youtube Trick : యూట్యూబ్ వీడియోని డౌన్‌లోడ్ చెయ్యడానికి ఎన్నో ఆప్షన్లు. ఈ ట్రిక్ ద్వారా వీడియోని ఏ పార్ట్ నుంచీ ఏ పార్ట్ వరకైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

యూట్యూబ్ ప్రపంచంలో 200 కోట్ల మందికి పైగా వాడుతున్న వీడియో పోర్టల్. ప్రతి సెకండ్‌కీ కొన్ని వందల వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. అలాగే డౌన్‌లోడ్ కూడా అవుతున్నాయి. ఐతే కొన్ని కొన్ని వీడియోలు గంటల తరబడి డ్యూరేషన్ ఉంటాయి. ఐతే... వాటిలో ఓ చిన్న పార్ట్ మాత్రమే మనకు డౌన్‌లోడ్ కావాల్సి వస్తే... మొత్తం వీడియో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనా... అన్న డౌట్ చాలా మందికి ఉంది. అవసరం లేదు. మనకు ఏ పార్ట్ కావాలో, ఆ పార్ట్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ట్రిక్ అంటే ఏం లేదు... Clip Converter అనే వీడియో కన్వెర్షన్ టూల్ ఒకటి ఉంది. అది ఆడియోనైనా, వీడియోనైనా URL నుంచీ కన్వర్ట్ చేస్తుంది. ఆ URL అనేది YouTube, Vimeo, Dailymotion, MySpace, Veoh ఏదైనా కావచ్చు. పాపులర్ మీడియా ఫార్మాట్లలోకి కన్వర్ట్ చేస్తుంది.

ఇలా చెయ్యండి :

* యూట్యూబ్‌లో డౌన్‌లోడ్ చెయ్యాలనుకుంటున్న వీడియో లింక్‌ని కాపీ చెయ్యండి.

* www.clipconverter.cc వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యండి.

* క్లిప్ కన్వర్టర్ వీడియో URL ఫీల్డ్‌లో వీడియో URLను పేస్ట్ చెయ్యండి. కంటిన్యూ బటన్‌ క్లిక్ చెయ్యండి.

* ఇప్పుడు వీడియో క్వాలిటీని సెలెక్ట్ చెయ్యండి. ఆడియో ఫార్మాట్‌లో కావాలో, వీడియో ఫార్మాట్‌లో కావాలో సెలెక్ట్ చేసుకోండి. అంటే Mp4, 3gp, AVI, MOV మొదలైనవి.

* వీడియో ఫార్మాట్ సెలెక్ట్ చేశాక మీకు కన్వెర్షన్ ఆప్షన్స్ (conversion options) కనిపిస్తాయి. వాటిలో Start of video ఆప్షన్‌ ఉన్న రైట్ చెక్‌ని తొలగించండి. అప్పుడు వీడియోని ఏ పార్ట్ నుంచీ డౌన్‌లోడ్ చెయ్యాలో టైమ్ లైన్ ఇవ్వండి. తర్వాత End of video కూడా అన్ చెక్ చెయ్యండి. ఆ తర్వాత వీడియోని ఏ పార్ట్ వరకూ డౌన్‌లోడ్ చెయ్యాలో టైమ్ లైన్ ఇవ్వండి.

* ఇప్పుడు Start బటన్ క్లిక్ చెయ్యండి. కన్వెర్షన్ ప్రాసెస్ మొదలవుతుంది. కొన్ని సెకండ్లు ఆగితే... కన్వెర్షన్ పూర్తవుతుంది.

* కన్వెర్షన్ పూర్తవగానే, డౌన్‌లోడ్ క్లిక్ చెయ్యండి. మీరు కోరుకున్న పార్ట్ వీడియో... కంప్యూటర్‌లో ఎక్కడ సేవ్ చెయ్యాలో ఆప్షన్ ఇవ్వండి. అంతే... వీడియో డౌన్‌లోడ్ అయిపోతుంది.


ఇవి కూడా చదవండి :


వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి

వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి

First published:

Tags: Information Technology, Technology, Youtube

ఉత్తమ కథలు