హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google New Feature: 15 నిమిషాల గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేయడం ఎలా..? గూగుల్‌ న్యూ ఫీచర్‌ పనితీరు తెలుసుకోండి..!

Google New Feature: 15 నిమిషాల గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేయడం ఎలా..? గూగుల్‌ న్యూ ఫీచర్‌ పనితీరు తెలుసుకోండి..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్‌ యాప్‌కు (Google Application) సంబంధించి కొత్త ఫీచర్‌ను గూగుల్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క క్లిక్‌ ద్వారా 15 నిమిషాల గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేసే సదుపాయం కల్పిస్తోంది.

ఏ చిన్న సమాచారం (Information) కావాలన్నా మన కళ్లు, వేళ్లు గూగుల్‌ సెర్చ్‌ వైపే వెళ్తాయి. దాదాపు అందరూ గూగుల్‌పై అంతగా ఆధారపడుతున్నారు. వివిధ రకాల కీ వర్డ్స్‌ ఉపయోగించి సమాచారం కోసం వెతికేస్తారు. అన్ని విభాగాలకు చెందిన సమాచారం, సలహాలు, సూచనలు గూగుల్‌లో సులువుగా దొరుకుతాయి. కొన్ని సందర్భాల్లో గూగుల్‌లో వెతికిన విషయాలు ఇతరులకు తెలియకూడదనో, గోప్యత కోసమే సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేస్తుంటారు. కారణాలు ఏవైనా సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేసేందుకు సులువైన మార్గాన్ని గూగుల్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. తమ సెర్చ్‌ హిస్టరీ (Search History) ఇతరులకు తెలియకూడదని భావించే యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ (New Feature) ఎంతగానో ఉపయోగపడుతుందని గూగుల్‌ సంస్థ చెబుతోంది.

గూగుల్‌ యాప్‌కు (Google Application) సంబంధించి కొత్త ఫీచర్‌ను గూగుల్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క క్లిక్‌ ద్వారా 15 నిమిషాల గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేసే సదుపాయం కల్పిస్తోంది. ఈ ఫీచర్‌ను గూగుల్‌ దాదాపు సంవత్సరం క్రితమే విడుదల చేసినా.. కేవలం ఐవోఎస్‌ డివైజ్‌ యూజర్లకు (iOS Device Users) మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేయగల ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ డివైజ్‌ యూజర్లకు (Android Device Users) కూడా కల్పిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ తాజాగా ప్రకటించింది.

ప్రస్తుతం గూగుల్‌లో గంట, 24 గంటలు, ఏడు రోజులు, నాలుగు వారాలు లేదా పూర్తి హిస్టరీ డిలీట్‌ చేసే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా ఆటోమేటిక్‌ డిలీట్‌ ఫీచర్‌లో 3 నెలలు, 18 నెలలు, 36 నెలలు చాట్‌ హిస్టరీని డిలీట్‌ చేసుకొనే సదుపాయాన్ని గూగుల్‌ సంస్థ కల్పించింది. వినియోగదారుల గోప్యత ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా కొత్త ఫీచర్‌ను అందిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ స్పష్టం చేసింది.

Money Scheme: ఈ స్కీమ్‌లో చేరడానికి మార్చి 31 చివరి తేదీ

కొత్త ఫీచర్‌కు సంబంధించి గూగుల్‌ సంస్థ ఓ ప్రకటనలో.. ‘15 నిమిషాల గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీని డిలీట్‌ చేసే అవకాశం ఆండ్రాయిడ్‌ యూజర్లకు కల్పిస్తున్నాం. కొన్ని వారాల్లోనే ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.’ అని పేర్కొంది. గూగుల్‌ యాప్‌ ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లో సెర్చ్‌ చేసిన కంటెంట్‌ మాత్రమే కాకుండా, గూగుల్‌ అకౌంట్‌కు లింక్‌ అయి ఉన్న ప్రతి డివైజ్‌ సెర్చ్‌ హిస్తరీని డిలీట్‌ చేస్తుందని గూగుల్‌ చెబుతోంది. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి..

మొదట స్మార్ట్‌ఫోన్‌లోని(Smart Phone) గూగుల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత టాప్‌ రైట్‌ కార్నర్‌లో కనిపించే గూగుల్‌ డిస్‌ప్లే పిక్చర్‌పై (Google Display Picture) క్లిక్‌ చేయండి. అనంతరం కనిపించే మెనూలో ‘డిలీట్‌ లాస్ట్‌ 15 మినిట్స్‌’ ఆప్షన్‌పైన క్లిక్‌ చేయాలి. వెంటనే స్క్రీన్‌ బాటమ్‌లో ‘డిలీటింగ్‌ హిస్టరీ. ఛేంజస్‌ విల్‌ షో ఇన్‌ యువర్‌ అకౌంట్‌ సూన్‌’ అని కనిపిస్తుంది. ఒక వేళ సెర్చ్‌ హిస్టరీ డిలీట్‌ చేయాల్సిన అవసరం లేదని భావిస్తే అక్కడే క్యాన్సిల్‌ బటన్‌ సదుపాయం కూడా ఉంటుంది. కొత్త ఫీచర్‌తో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గోప్యతను కల్పిస్తున్నట్లు గూగుల్ చెబుతోంది.

Published by:Veera Babu
First published:

Tags: Google, Google new feature, Smart phones, Technology

ఉత్తమ కథలు