హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ లేదా డిలీట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..

Twitter: ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ లేదా డిలీట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ట్విట్టర్ నుంచి పర్మినెంట్‌గా అకౌంట్‌ డిలీట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్ అందుబాటులో లేదు. దీనికి ముందు ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకోవాలి. తరువాత 30 రోజులపాటు ఆ ఖాతాలో సైన్ ఇన్ కాకుండా ఉంటే, అప్పుడు అకౌంట్‌ శాశ్వతంగా డిలీట్ అవుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter: సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలనుకునే వారు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్‌ డీయాక్టివేట్ చేసుకుంటుంటారు. మరికొందరు కొన్ని కారణాల వల్ల పర్మినెంట్‌గా అకౌంట్‌ను డిలీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ట్విట్టర్ (Twitter) నుంచి పర్మినెంట్‌గా అకౌంట్‌(Permanent Account Deletion)ను డిలీట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్ అందుబాటులో లేదు. దీనికి ముందు ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకోవాలి. తరువాత 30 రోజులపాటు ఆ ఖాతాలో సైన్ ఇన్ కాకుండా ఉంటే, అప్పుడు అకౌంట్‌ శాశ్వతంగా డిలీట్ అవుతుంది.

* ట్విట్టర్ అకౌంట్‌ను ఎలా డీయాక్టివేట్ చేయాలి?

- ముందు మీ ట్విట్టర్ ఖాతాకు లాగిన్ చేసి, హోమ్ పేజీలో టాప్ కార్నర్‌లో ఉన్న మీ ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి.

- డ్రాప్‌డౌన్ మెనూలో "సెట్టింగ్స్ అండ్ సపోర్ట్" > "సెట్టింగ్స్‌ అండ్ ప్రైవసీ" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

- తరువాత "యువర్ అకౌంట్" ఆప్షన్‌పై నొక్కాలి. ఆపై చివరి ఆప్షన్‌గా కనిపించే "డీయాక్టివేట్ అకౌంట్" ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి.

- తరువాత పేజీలో ట్విట్టర్ డీయాక్టివేషన్‌కి సంబంధించిన కొన్ని సూచనలు చేస్తుంది. అంతేకాదు, మీ ట్విట్టర్ డేటా డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ సూచనలను చదువుకున్నాక, డీయాక్టివేషన్‌ను కన్ఫర్మ్ చేయడానికి మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి 'డీయాక్టివేట్' బటన్‌పై నొక్కాలి.

- అంతే, మీ ట్విట్టర్ ఖాతా డీయాక్టివేట్ అయిపోతుంది. మీ ఖాతా ఇకపై ట్విట్టర్‌లో కనిపించదు. మీ ట్వీట్లు, ఫాలోవర్స్, ఇంకా ఇతర ఖాతా సమాచారం ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ నుంచి తాత్కాలికంగా తొలగిపోతుంది.

ChatGPT: చాట్‌జీపీటీకి ఇంటర్నెట్ యాక్సెస్.. మన పనులన్నీ చేసేంత శక్తి దీని సొంతం

* పర్మినెంట్‌గా అకౌంట్‌ను డిలీట్ చేసేదెలా..?

అకౌంట్ డీయాక్టివేట్ చేసిన తర్వాత 30 రోజుల పాటు ట్విట్టర్ మీ డేటాను అలాగే ఉంచుతుంది. ఈ సమయంలో మీ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకు సింపుల్‌గా మీ ట్విట్టర్ అకౌంట్‌కు సైన్ ఇన్ చేస్తే సరిపోతుంది. వెంటనే అకౌంట్ రీస్టోర్ అవుతుంది. ఈ 30 రోజులలోపు సైన్ ఇన్ చేయకపోతే.. మీ ట్విట్టర్ అకౌంట్, డేటా శాశ్వతంగా డిలీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ అకౌంట్‌కు సైన్ ఇన్ చేయలేరు. అలాగే అకౌంట్ డేటాను తిరిగి పొందలేరు.

* గుర్తుంచుకోవాల్సిన విషయాలు

- ట్విట్టర్ అకౌంట్‌లో ఏవైనా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ లేదా బాకీ బ్యాలెన్స్‌ ఉంటే, మీ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడానికి లేదా తొలగించడానికి ముందు వాటిని రద్దు చేయాలి, లేదంటే చెల్లించాలి.

- ట్విట్టర్ అకౌంట్‌ను ఏదైనా థర్డ్-పార్టీ సర్వీసులకు కనెక్ట్ చేసి ఉంటే, మీ ఖాతాను డీయాక్టివేట్ లేదా డిలీట్ చేయడానికి ముందు వాటిని డిస్‌కనెక్ట్ చేయడం మంచిది.

- అకౌంట్ డిలీట్ చేసేముందు ఫాలోవర్స్‌కు మీ నిర్ణయాన్ని తెలియజేయడం కూడా ముఖ్యం.

First published:

Tags: Twitter

ఉత్తమ కథలు