WhatsApp: సోషల్ మీడియా ప్రియులకు కొత్తదనం లేకపోతే కిక్ ఉండదు. అందుకే వివిధ ప్లాట్‌ఫామ్స్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంటాయి. ఈ విషయంలో మెసేజింగ్ పోర్టల్ వాట్సాప్(WhatsApp) ముందుంటుంది. వాట్సాప్‌లో మెసేజ్‌లకు రిప్లై ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఎమోజీలు, స్టిక్కర్స్, క్విక్ రియాక్షన్స్ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా డిజిటల్ అవతార్‌లు వచ్చాయి. ఇందులో మీ అభిరుచికి తగ్గట్లు మీరే ఒక అవతార్‌ను తయారు చేసి, వాట్సాప్ డీపీగా పెట్టుకోవచ్చు. మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయవచ్చు. డిజిటల్ అవతార్‌లను ఎలా క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ పిక్‌గా ఎలా పెట్టుకోవాలి, ఎలా డిలీట్ చేయాలో వివరంగా తెలుసుకుందాం.
వాట్సప్‌లో అవతార్ క్రియేట్ చేసి ప్రొఫైల్ పిక్చర్స్‌గా సెట్ చేసుకోవచ్చు. లేదా 36 కస్టమ్ స్టిక్కర్‌లుగానూ ఉపయోగించవచ్చు. భిన్నమైన భావోద్వేగాలతో వీటిని క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని యూజర్ల డిజిటల్ వెర్షన్‌గా చెప్పుకోవచ్చు. మీకు ఇష్టమైన హెయిర్ స్టైల్, కలర్, అవుట్ ఫిట్లు, ఫేషియల్ ఫీచర్లు, స్కిన్ కలర్ వంటివి సెలక్ట్ చేసుకొని మీ అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి బిట్‌మోజీ, యాపిల్ మొమోజీ స్టిక్కర్లను పోలి ఉంటాయి. కొంతమంది ఇంట్రావర్ట్‌లు తమ ఫొటోస్‌ను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టేందుకు ఆసక్తి చూపరు. అటువంటి వారికి ఈ ఫీచర్ ఎంతో బాగుంటుంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, మెసెంజర్స్‌లో ఈ ఫీచర్ లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత వాట్సాప్ కూడా తీసుకొచ్చింది.
* అవతార్ ఎలా క్రియేట్ చేయాలి?
- ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడుచుక్కలపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ప్రొఫైల్ పిక్చర్ మార్చే ఐకాన్ సెలక్ట్ చేయండి.
- ఇప్పుడు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. కుడివైపు చివర్లో కనిపించే ‘అవతార్’ను ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు నచ్చిన స్కిన్ కలర్, కళ్లు, ముక్కు, నోరు షేప్, హెయిర్ స్టైల్, డ్రెస్ వంటి ఆప్షన్లు ఇస్తూ అవతార్ పోస్టర్‌ను రెడీ చేసుకోవచ్చు. ఐవోఎస్ (IOS), ఆండ్రాయిడ్ (Android)లో ఇది అందుబాటులో ఉంది.
- ఒకసారి అవతార్ ఇమేజ్ రెడీ అయిన తర్వాత సేవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్ కింద ‘యూజ్ యాస్ ప్రొఫైల్ పిక్చర్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసి.. మీ అవతార్‌ను వాట్సాప్ డీపీగా పెట్టుకోవచ్చు.
- ఈ అవతార్ పిక్స్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు. ఎమోజీలుగా రిప్లై కూడా ఇవ్వొచ్చు.
Vande Bharat: జమ్మూ- శ్రీనగర్ మధ్య వందే భారత్ మెట్రో సర్వీస్.. త్వరలో ప్రారంభం
* డిలీట్ చేద్దామనుకుంటే..?
మీ వాట్సాప్ డీపీ నుంచి అవతార్ ఫొటో డిలీట్ చేద్దామనుకుంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో అవతార్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేసి డిలీట్ సెలక్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన మరో అవతార్‌ను డీపీగా పెట్టుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp