Facebook లో కొత్త ఫీచర్.. ఒకేసారి 50 మందితో గ్రూప్ చాట్..

కరోనా తీసుకొచ్చిన సంక్షోభం కారణంగా అందరూ ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో చాలా మంది ఒకేసారి మాట్లాడుకోవడం కష్టంగా మారింది. సోషల్ మీడియా వేదికలున్నా.. అది కొద్దిమందితోనే. ఈ సమస్యను తీర్చడానికి ఫేస్బుక్ కొత్త ఫీచర్లతో వస్తున్నది.

news18
Updated: October 20, 2020, 2:30 PM IST
Facebook లో కొత్త ఫీచర్.. ఒకేసారి 50 మందితో గ్రూప్ చాట్..
  • News18
  • Last Updated: October 20, 2020, 2:30 PM IST
  • Share this:
కరోనావైరస్ మహమ్మారి విజృంభనతో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి ఆన్లైన్ వీడియో కాలింగ్ ప్లాట్ ఫాం లకు డిమాండ్ బాగా పెరిగింది. గ్రూప్ చాటింగ్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్స్ కోసం కొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఫేస్బుక్ కు చెందిన మెసెంజర్ యాప్ లో చాట్ రూమ్ ను ప్రవేశపెట్టింది. ఈ మెసెంజర్ రూమ్ ద్వారా ఒకేసారి 50 మంది వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ ఖాతా లేనప్పటికీ దీన్ని ఉపయోగించే అవకాశం ఉండటం విశేషం. యూజర్స్ తమ ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఖాతాల ద్వారా కూడా ఈ వీడియో కాల్ లో చేరవచ్చు. వాట్సాప్ యూజర్లు మొబైల్, డెస్క్టాప్ మరియు వెబ్ యాప్ ద్వారా మెసెంజర్ రూమ్లను క్రియేట్ చేయవచ్చు.

వాట్సాప్ యూజర్లు మెసెంజర్ రూమ్ ను ఇలా క్రియేట్ చేయండి

స్టెప్ 1: వాట్సాప్ యాప్ యూజర్లు ఇండివిజువల్ చాట్ ను ఓపెన్ చేసి, కీబోర్డ్లోని అటాచ్మెంట్ ఐకాన్ ను నొక్కండి.
స్టెప్ 2: "రూమ్స్" అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి, ఆపై "మెసెంజర్లో కొనసాగండి" అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.






స్టెప్ 3: అప్పుడు మీకు కావాల్సిన వారికి ఆ లింక్ ను పంపించండి. వారు ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా చాట్ రూమ్ లో చేరవచ్చు.
స్టెప్ 4: గ్రూప్ కాల్ చేయడానికి, టాప్ రైట్ లో ఉన్న ఆడియో కాల్ ఆప్షన్ ను నొక్కండి. ఆపై "క్రియేట్ రూమ్"పై క్లిక్ చేయండి. అయితే, మీ గ్రూప్ చాట్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటేనే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading