HOW TO COPY TEXT FROM PHOTOS ON ANDROID AND IPHONE A STEP BY STEP FOLLOW THESE GH VB
Smart Tips: ఫొటోలపై ఉండే Text కాపీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి..
ప్రతీకాత్మక చిత్రం
చాలా రకాల ఫోటోలపై భారీ స్థాయిలో టెక్స్ట్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకు కొన్నిసార్లు అవసరం కావచ్చు. ఒకవేళ మనం ఇతర ప్లాట్‌ఫారమ్స్, యాప్‌లలో ఈ కంటెంట్‌ను టెక్స్ట్‌గా ఉపయోగించాలనుకుంటే.. ఆ డేటాను కాపీ చేసుకోవాలి.
సోషల్ మీడియా(Social Media), ఇతర ప్లాట్‌ఫామ్స్(Flatforms) నుంచి డౌన్‌లోన్(Download) చేసుకొనే కొన్ని ఇమేజెస్(Images), ఫోటోలపై Text ఉండటం కామన్. చాలా రకాల ఫోటోలపై భారీ స్థాయిలో టెక్స్ట్(Text) ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్(Information) మనకు కొన్నిసార్లు అవసరం కావచ్చు. ఒకవేళ మనం ఇతర ప్లాట్‌ఫారమ్స్, యాప్‌లలో(Apps) ఈ కంటెంట్‌ను టెక్స్ట్‌గా(Text) ఉపయోగించాలనుకుంటే.. ఆ డేటాను కాపీ(Copy) చేసుకోవాలి. అయితే గూగుల్ లెన్స్(Google Lens) వంటి అనేక టూల్స్(Tools), యాప్‌ల సాయంతో ఈ ప్రాసెస్(Process) పూర్తి చేయవచ్చు. వీటి సాయంతో ఫోటో నుంచి టెక్స్ట్ కాపీ(Photo Text Copy) చేసి.. ఆండ్రాయిడ్, iOS, PCలో కావలసిన చోట ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ కాపీ పేస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం.
** ఆండ్రాయిడ్, ఐఫోన్, PCలోని ఫోటోల నుంచి టెక్స్ట్ ఎలా కాపీ చేయాలి?
* Google లెన్స్
- Google Lens యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేయండి.
- పైకి స్వైప్ చేసి టెక్స్ట్ కాపీ చేయాలనుకుంటున్న ఫోటోను సెలక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు మీరు కాపీ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌పై ఎక్కువసేపు నొక్కి పట్టుకొని, తర్వాత టెక్ట్స్ లెన్త్ సెలక్ట్ చేయండి.
- ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, స్క్రీన్ కింది భాగంలో ఉన్న “Copy Text” ఆప్షన్‌పై ప్రెస్ చేయండి.
- ఇప్పుడు ఈ కంటెంట్‌ను మీకు కావాల్సిన చోట టెక్స్ట్ రూపంలో పేస్ట్ చేసుకోవచ్చు.
అవసరమైన టెక్స్ట్ క్లిప్‌బోర్డ్‌కు కాపీ అవుతుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో ఈ టెక్స్ట్ పేస్ట్ చేసుకోవచ్చు.
* Google ఫోటోస్ వెబ్
గూగుల్ లెన్స్ యాప్ అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ ఫోటోస్ వెబ్ సర్వీస్ ద్వారా కూడా ఫోటోలపై ఉండే టెక్స్ట్ కాపీ చేసుకోవచ్చు. యూజర్లు తమ అవసరాల కోసం ఈ కంటెంట్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం.
- మీ ఫోన్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి, Google Photos వెబ్‌కి వెళ్లండి. ఇక్కడ మీ అకౌంట్‌కు సైన్ ఇన్ చేయండి.
- ఇప్పుడు టెక్స్ట్ ఉన్న ఫోటోను సెలక్ట్ చేసి, ఓపెన్ చేయండి.
- టాప్ రైట్ కార్నర్‌లో “Copy Text from Image” అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. ఫోటోలో టెక్స్ట్ ఉంటేనే ఈ ఆప్షన్ యూజర్లకు కనిపిస్తుంది.
- ఇప్పుడు సంబంధిత ఫోటోను సెలక్ట్ చేసి, ‘Copy text’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- దీంతో ఇమేజ్‌పై ఉన్న టెక్స్ట్ క్లిప్‌బోర్డ్‌కి కాపీ అవుతుంది. దీన్ని కావాల్సిన చోట పేస్ట్ చేసుకోవచ్చు.
Google ఫోటోస్ యూజ్ చేయని iOS యూజర్లు Apple గ్యాలరీ యాప్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో కావచ్చు. లేదంటే onlineocr.net, brandfolder.com, imagetotext.info వంటి ఎన్నో ఆన్‌లైన్ OCR సేవలను కూడా యూజర్లు ఉపయోగించుకోవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.