Home /News /technology /

HOW TO CONVERT YOUR PHOTO INTO A WHATSAPP STICKER A STEP BY STEP GUIDE KNOW DETAILS HERE GH VB

WhatsApp Stickers: మీ ఫొటోలను వాట్సాప్ స్టిక్కర్స్‌గా మార్చాలా..? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. 

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఓన్‌ స్టిక్కర్ల (Own Stickers)ను క్రియేట్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఓన్ లేదా నచ్చిన ఫొటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు(WhatsApp) పోటీగా టెలిగ్రామ్(Telegram), సిగ్నల్(Signal) వంటి యాప్స్‌ సరికొత్త ఫీచర్లను రిలీజ్(Release) చేస్తూ యూజర్ బేస్‌ను(User Base) పెంచుకుంటున్నాయి. దీంతో ఇప్పుడున్న యూజర్లను పోగొట్టుకోకుండా, కొత్తవారిని ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు తన ఫ్లాట్‌ఫామ్‌ను మెరుగుపరుస్తూనే ఉంది. కొత్త ఫీచర్లతో కమ్యూనికేట్(Communicate) చేసే విధానాన్ని ఉత్తమంగా, కొత్తగా మారుస్తోంది. అలాగే ఇప్పటి ట్రెండ్‌కు తగినట్టుగా ఎమోజీలు(Emojis), స్టిక్కర్లు, గిఫ్‌లు, డూడుల్‌లు, యానిమేటెడ్ స్టిక్కర్లను కూడా వాట్సాప్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఓన్‌ స్టిక్కర్ల (Own Stickers)ను క్రియేట్ చేసుకునే ఫీచర్‌ కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఓన్ లేదా నచ్చిన ఫొటోలను స్టిక్కర్లుగా మార్చవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Startup Layoffs: ఈ ఏడాది కూడా తగ్గని స్టార్టప్ కంపెనీల ఫండింగ్.. కానీ కంపెనీలు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి?


మీరు కొత్త స్టిక్కర్లు, యానిమేటెడ్ స్టిక్కర్లను వాట్సాప్ స్టోర్‌ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇటీవల, వాట్సాప్ స్ట్రేంజర్ థింగ్స్ స్టిక్కర్ ప్యాక్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీన్నెలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం.

* వాట్సాప్‌లో స్ట్రేంజర్ థింగ్స్ స్టిక్కర్ ప్యాక్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి

స్టెప్ 1: వాట్సాప్‌ను ఓపెన్ చేసి ఆపై ఏదైనా చాట్ విండోపై క్లిక్ చేయాలి.

స్టెప్ 2: చాట్ విండో ఓపెన్ అయ్యాక మెసేజ్ బార్‌లో లెఫ్ట్ రైట్ కార్నర్‌లో కనిపిస్తున్న ఎమోజీ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: ఆపై స్టిక్కర్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. స్టిక్కర్ బార్ పైన ఉన్న 'ప్లస్ +' ఆప్షన్ పైన నొక్కాలి.

స్టెప్ 4: ఆల్ స్టికర్స్‌లో "స్ట్రేంజర్ థింగ్స్" స్టిక్కర్ ప్యాక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ బటన్‌పై నొక్కితే చాలు. "స్ట్రేంజర్ థింగ్స్" తో పాటు మీరు మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూజర్లు వారి ఓన్ ఫొటోలు... అంటే వారి ఫోన్ కెమెరాలను ఉపయోగించి క్లిక్ చేసిన ఫొటోలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. కానీ ఈ ఫీచర్‌ వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత యాప్‌లలో అందుబాటులో లేదు. ఈ స్టిక్కర్ మేకర్ ఫీచర్ కేవలం వాట్సాప్ వెబ్, వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ యూజర్లు తమ ఫొటోలను యానిమేటెడ్ స్టిక్కర్లుగా మార్చడానికి స్టిక్కర్ మేకర్ ఫీచర్‌ యూజ్ అవ్వదు. దీనర్థం ఫొటోని క్రియేటివ్ స్టిక్కర్‌గా మార్చినప్పటికీ ఈ స్టిక్కర్‌లలో యానిమేషన్‌ను జోడించడం కుదరదు.

Exclusive: Modi@8: రైతులను బంగారు వ్యవసాయ రంగం వైపు నడిపిస్తున్న కేంద్రం.. న్యూస్‌18తో కేంద్ర మంత్రి తోమర్‌..


* ఫొటోను వాట్సాప్ స్టిక్కర్‌గా ఎలా మార్చాలి?

స్టెప్ 1: మీ పీసీలో వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: స్టిక్కర్‌ను షేర్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 3: చాట్ విండోలో దిగువన లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తున్న పేపర్‌క్లిప్ ఐకాన్‌పై ట్యాప్ క్లిక్ చేయాలి.

స్టెప్ 4: ఇందులో రైట్ సైడ్‌లో కనిపించే స్టిక్కర్ (Sticker) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 5: స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్న ఫొటోను సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 6: అనంతరం అన్ని ఎడిటింగ్ టూల్స్‌తో కూడిన కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫొటోకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. ఫొటోపై టెక్స్ట్ లేదా ఎమోజీలు యాడ్ చేయొచ్చు.

స్టెప్ 7: ఆ తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేస్తే మీరు పంపాలనుకున్న చాట్‌కు స్టిక్కర్ సెండ్ అయిపోతుంది. ఈ స్టిక్కర్‌పై క్లిక్ చేసి దానిని లోకల్ స్టోరేజ్‌లో సేవ్ కూడా చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు