Home /News /technology /

HOW TO CHECK IF YOUR XIAOMI DEVICE BATTERY IS HEALTHY UMG GH

Xiaomi Phones: షియోమీ ఫోన్లు వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ బ్యాటరీ హెల్త్‌ను ఇలా టెస్ట్ చేసుకోండి

షియోమో ఫోన్లు వాడే వారికి చాలా ఉపయోగకరమైన వార్త (Pic: Xiaomi)

షియోమో ఫోన్లు వాడే వారికి చాలా ఉపయోగకరమైన వార్త (Pic: Xiaomi)

ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లు (Smartphones) ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా షియోమీ (Xiaomi) ఫోన్లు హైపర్‌ఛార్జ్ అంటూ మెరుపువేగంతో ఛార్జ్ అయ్యే ఫీచర్లతో లాంచ్ అవుతున్నాయి. అయితే బ్యాటరీ హెల్త్ (Battery Health) కచ్చితంగా తెలియజేసే ఫీచర్‌ను మాత్రం షియోమీ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్లు (Smartphones) ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా షియోమీ (Xiaomi) ఫోన్లు హైపర్‌ఛార్జ్ అంటూ మెరుపువేగంతో ఛార్జ్ అయ్యే ఫీచర్లతో లాంచ్ అవుతున్నాయి. అయితే బ్యాటరీ హెల్త్ (Battery Health) కచ్చితంగా తెలియజేసే ఫీచర్‌ను మాత్రం షియోమీ ఇప్పటివరకు ఏ ఫోన్‌లో అందించలేదు. నిజానికి బ్యాటరీ హెల్త్ గురించి యూజర్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాడ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ పనితీరును దెబ్బతీస్తుంది. ఒక్కోసారి అవి ఉబ్బి పేలే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ ఫీచర్ ఫోన్‌లో అందించకపోయినా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఒక ఓపెన్ సోర్స్ కాబట్టి మీరు బ్యాటరీ హెల్త్ గురించి రెండు మార్గాల్లో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్ డీబగ్ బ్రిడ్జ్ (ADB) ద్వారా బ్యాటరీ హెల్త్ చెక్

ఏడీబీ (ADB) పద్ధతిలో ఒక పీసీ అవసరమవుతుంది. ఈ పీసీకి మీ ఫోన్ కనెక్ట్ చేయడం ద్వారా బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు. లేదా మీరు సింపుల్‌గా ఎల్ఏడీబీ (LADB) యాప్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఏడీబీ (ADB) పద్ధతిలో తెలుసుకోవాలంటే మొదటగా పీసీలో ఏడీబీ డ్రైవర్లను ఇన్‌స్టాల్ చేసి.. మీ ఫోన్‌లో డెవలపర్ ఆప్షన్లను ఎనేబుల్ చేసి యూఎస్‌బీ డీబగ్గింగ్ ఫీచర్‌ను ఆన్ చేయాలి. అలానే ఫోన్ ఫుల్ ఛార్జ్‌లో ఉంచాలి. లేదంటే బ్యాటరీ హెల్త్ కచ్చితంగా తెలుసుకోవడం కుదరదు.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ దిమ్మతిరిగే ఆఫర్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్..!


బ్యాటరీ హెల్త్ చెక్‌కి స్టెప్స్

  • పీసీలో కమాండ్ ప్రాంప్ట్ (CMD) ఓపెన్ చేయాలి. ADB ఫోల్డర్‌లో సీఎండీ (CMD)ని ఓపెన్ చేసి.. “ADB షెల్” అని టైప్ చేసి, మీ ఫోన్‌ని మీ పీసీకి కనెక్ట్ చేయాలి.

  • డ్రైవర్లు సరిగ్గా ఇన్‌స్టాల్ అయినట్లయితే.. పీసీ మీ ఫోన్‌ను వెంటనే గుర్తిస్తుంది. అలానే కమాండ్ ప్రాంప్ట్‌లో డివైజ్ కోడ్‌నేమ్‌ కనిపిస్తుంది.

  • ఆపై "డంప్సిస్ బ్యాటరీ (dumpsys battery)" అని టైప్ చేసి ఎంటర్ చేయండి.


ఏడీబీ ద్వారా ఫోన్ బ్యాటరీ కరెంట్, వోల్టేజ్, కెపాసిటీ, ​​ టెంపరేచర్, ఇతర సమాచారాన్ని చెక్ చేయవచ్చు. ముఖ్యంగా పీసీ స్క్రీన్‌పై కనిపించే “ఛార్జ్ కౌంటర్”లో మీ ఫోన్ యాక్చువల్ బ్యాటరీ కెపాసిటీ తెలుసుకోవచ్చు. బ్యాటరీ హెల్త్ పర్సంటేజ్ చెక్ చేయడానికి, మీరు (యాక్చువల్ కెపాసిటీ/కరెంట్ కెపాసిటీ)*100 అనే మ్యాథ్స్ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చినట్లయితే.. ఏడీబీలో ఛార్జ్ కౌంటర్‌లో 4500000 (4500ఎంఏహెచ్) అని చూపించినట్లయితే.. (4500/5000) *100 అని క్యాలిక్యులేట్‌ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు. ఈ సందర్భంలో బ్యాటరీ హెల్త్ 90% అని చూపిస్తుంది. అయితే మీరు ఫోన్‌ని ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు మాత్రమే ఈ బ్యాటరీ హెల్త్ కచ్చితమైనదిగా ఉంటుంది.

  • షియోమీలో నిర్దిష్ట బగ్ రిపోర్ట్ మెథడ్ ఉపయోగించి షియోమీ బ్యాటరీ హెల్త్ చెక్ చేయవచ్చు

  • ఎంఐయూఐ (MIUI) యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతున్న షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల యూజర్లు బ్యాటరీ హెల్త్ చెక్ చేయడానికి సులభమైన మార్గం ఉంది. ఇందుకు వారు సాఫ్ట్‌వేర్‌లో బగ్ రిపోర్ట్ క్రియేట్ చేసి, పైన చెప్పిన మ్యాథ్స్ ఫార్ములా ఫాలో అయితే సరిపోతుంది.

  • ఫోన్‌లో 'సెట్టింగ్స్‌' ఓపెన్ చేసి "మై డివైజ్"పై క్లిక్ చేయాలి. ఆపై సీపీయూ (CPU) ఆప్షన్‌పై 5 సార్లు క్లిక్ చేయాలి.

  • ఇప్పుడు మీ డివైజ్ బగ్ రిపోర్ట్‌ను క్రియేట్ చేస్తుంది. ఫోన్‌లో ఈ బగ్ రిపోర్ట్ జిప్ ఫైల్‌ను గుర్తించి, ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. లోకల్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ని ఉపయోగించి మీరు బగ్ రిపోర్ట్ జిప్ ఫైల్‌ను గుర్తించవచ్చు.

  • ఎక్స్‌ట్రాక్ట్ చేసిన ఫైల్‌ను క్లిక్ చేసి అది ఓపెన్ అయ్యాక లోపల మరొక జిప్ కనిపిస్తుంది. ఈ జిప్ ఫైల్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఓపెన్ చేయాలి.

  • మీరు టెక్స్ట్ ఎడిటర్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేసిన చివరి కంప్రెస్డ్ ఫైల్‌లోని టెక్స్ట్ ఫైల్‌ను తెరిచి, అందులో “హెల్త్ డీ (healthd)” కోసం సెర్చ్ చెయ్యాలి.




హెల్త్ లైన్‌లో fc విలువ ఉంటుంది. ఇది డివైజ్ యాక్చువల్ బ్యాటరీ కెపాసిటీ చూపుతుంది. ఫార్ములా (యాక్చువల్ కెపాసిటీ / కరెంట్‌ కెపాసిటీ)*100 మీరు బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్ ఉండి, యాక్చువల్ బ్యాటరీ కెపాసిటీ 4500ఎంఏహెచ్ గా ఉంటే.. 90% హెల్త్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మెథడ్‌లో డ్రైవర్లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మీరు ADB గురించి తెలుసుకోవలసిన పని లేదు.
Published by:Mahesh
First published:

Tags: Android, Battery, Smart phones, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు