యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చాలా సింపుల్ అయిపోయింది. యూపీఐ పేమెంట్స్ (UPI Payments) కోసం గూగుల్ పే ఉపయోగించేవారి సంఖ్య ఎక్కువే. షాప్‌లో పేమెంట్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం (Money Transfer) వరకు ప్రతీ చోటా గూగుల్ పే ఉపయోగిస్తుంటారు. మరి గూగుల్ పేలో యూపీఐ ఐడీ ఎలా మార్చాలి? (How to Change UPI Id in Google Pay) అన్న సందేహాలు యూజర్లలో ఉంటాయి. యూపీఐ ఐడీ క్రియేట్ చేయడం, మార్చుకోవడం చాలా సులువు. సాధరణంగా గూగుల్ పే యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసినప్పుడే యూపీఐ ఐడీ జనరేట్ అవుతుంది. మరి యూపీఐ ఐడీ ఎలా మార్చాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి.
Step 2- హోమ్ స్క్రీన్‌లో టాప్ రైట్లో ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయండి.
Step 3- ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి.
Step 4- మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది.
Step 5- మీరు ఏ అకౌంట్‌కు యూపీఐ ఐడీ మార్చాలనుకుంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేయండి.
Step 6- అకౌంట్ వివరాలు ఓపెన్ అవుతాయి.
Step 7- మేనేజ్ యూపీఐ ఐడీస్ పైన క్లిక్ చేయాలి.
Step 8- ఇప్పటివరకు మీ అకౌంట్‌కు క్రియేట్ అయిన యూపీఐ ఐడీలు కనిపిస్తాయి.
Step 9- వాటిని డిలిట్ చేయొచ్చు. లేదా + పైన క్లిక్ చేసి యూపీఐ ఐడీ క్రియేట్ చేయొచ్చు.
SBI Account: ఎస్బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకులో ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి
భారతదేశంలో పాపులర్ యూపీఐ యాప్స్‌లో గూగుల్ పే కూడా ఒకటి. ఇండియాలో గూగుల్ పే యూజర్లు 15 కోట్లకు పైనే ఉన్నారని అంచనా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం జూన్‌లో 2.73 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఫోన్ పే ద్వారా జరిగితే ఆ తర్వాతి స్థానంలో 2.02 బిలియన్ ట్రాన్సాక్షన్స్తో గూగుల్ పే ఉంది. 877.5 మిలియన్ ట్రాన్సాక్షన్స్తో పేటీఎం మూడో స్థానంలో ఉంది.
Aadhaar Card: లబ్ధిదారులకు అలర్ట్... అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డ్ తప్పనిసరి
గూగుల్ పే ఇండియాలో మొదట తేజ్ పేరుతో పరిచయం అయింది. ఆ తర్వాత గూగుల్ పేగా పేరు మారింది. గూగుల్ పే ద్వారా యూజర్లు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూపీఐ ద్వారా పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 24 గంటల పాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google pay, Personal Finance, UPI