ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ (Gmail Account) ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్ వాడనివారు కూడా మెయిల్స్ పంపడం కోసం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా జీమెయిల్ యూజర్లు (Gmail Users) ఉన్నారని అంచనా. ఇండియాలో 37 కోట్లకు పైగా జీమెయిల్ యూజర్లు ఉంటారు. విద్యార్థుల దగ్గర్నుంచి ఉద్యోగుల వరకు అందరికీ జీమెయిల్ సుపరిచితమే. జీమెయిల్‌లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ గురించి యూజర్లకు పూర్తిగా అవగాహన ఉండదు. ముఖ్యమైన ఫీచర్స్ మాత్రమే ఉపయోగిస్తుంటారు. జీమెయిల్‌లో పేరు మార్చుకోవచ్చన్న విషయం అందరికీ తెలియదు. అంటే డిస్‌ప్లే నేమ్ మార్చుకోవచ్చు. జీమెయిల్‌లో పేరు మార్చుకోవడం ఎలా? (How to change name in Gmail) అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1- ముందుగా మీ జీమెయిల్‌లో లాగిన్ కావాలి.
Step 2- టాప్ రైట్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత All Settings ఓపెన్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Accounts and Import ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
Step 5- మీ పేరు కనిపించే దగ్గర edit info లింక్ పైన క్లిక్ చేయండి.
Step 6- ఆ తర్వాత మీ పేరు ఎలా కనిపించాలనుకుంటే అలా టైప్ చేసి సేవ్ చేయండి.
Warning: ఈ 19 యాప్స్ చాలా డేంజర్... డిలిట్ చేయకపోతే మీకే రిస్క్
మీరు మార్చినట్టుగానే మీ పేరు కనిపిస్తుంది. అయితే మీ జీమెయిల్ ఐడీనే యూజర్ నేమ్‌గా పెట్టుకోకూడదు. మీరు పేరు మాత్రమే మార్చగలరు కానీ మీ యూజర్ నేమ్, జీమెయిల్ ఐడీ మార్చలేరు. మీరు ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ అవసరాల కోసం జీమెయిల్ మెయింటైన్ చేస్తుంటే మీ డిస్‍ప్లే నేమ్‌లో మీ పేరు ఉండాలి. నిక్ నేమ్స్, షార్ట్ ఫామ్స్ ఉండకూడదు.
iPhone Offer: రెడ్‌మీ, రియల్‌మీ సాంసంగ్ ధరకే ఐఫోన్... ఆఫర్ ధర రూ.25,000 లోపే
దీని వల్ల మీరు ఎవరికైనా మెయిల్ పంపినప్పుడు మిమ్మల్ని గుర్తించకపోయే అవకాశం ఉంటుంది. మీరు మెయిల్ పంపినప్పుడు మొదట డిస్‍ప్లే నేమ్ కనిపిస్తుంది. ఆ తర్వాతే మీ మెయిల్ ఐడీ కనిపిస్తుంది. అందుకే ఉద్యోగాలకు అప్లై చేసేవారు నిక్ నేమ్స్ పెట్టకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.