వాట్సప్ తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోండిలా....

ఇకపై వాట్సాప్‌ నుంచి కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) అందుబాటులోకి తీసుకొచ్చింది.

news18-telugu
Updated: May 31, 2020, 7:08 AM IST
వాట్సప్ తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోండిలా....
(File)
  • Share this:
ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? వెంటనే మీరు వంట గ్యాస్ సిలిండర్‌ను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లిగానీ, లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకుంటుంటారు. డెలివరీకి కాస్త టైం పడుతుంది. కానీ ఇకపై వాట్సాప్‌ నుంచి కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సందర్బంగా గ్యాస్ బుకింగ్ చేసే ప్రక్రియను కూడా సంస్థ వివరించింది. మీరు బీపీసీఎల్ అంటే భారత్ గ్యాస్ కస్టమర్ అయితే బీపీసీఎల్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 1800224344 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. మొబైల్ కు వచ్చే లింక్ ను ఓపెన్ చేసి డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపుల ద్వారా పేమెంట్ చేయవచ్చునని బీపీసీఎల్ సంస్థ తెలిపింది.

దేశవ్యాప్తంగా బీపీసీఎల్ సంస్థకు ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. ముందుగా మీరు మీ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తర్వాతే ఈ సదుపాయం పొందవచ్చు. దీని ద్వారా త్వరగా గ్యాస్ బుకింగ్ జరుగుతుందని కంపెనీ చెబుతోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్‌కు అతిపెద్ద చమురు మార్కెట్ ఉండగా, భారత్ పెట్రోలియం రెండో స్థానంలో ఉంది.గత కొద్దికాలంగా వాట్సాప్ అందరూ ఉపయోగిస్తున్నారని, ఈ ప్లాట్ ఫామ్ అందరికి ఉపయుక్తంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, యాప్స్, వెబ్ సైట్ తదితర డిజిటల్ ఛానల్స్ ద్వారా ఎల్పీజీ బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
Published by: Krishna Adithya
First published: May 31, 2020, 7:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading