Home /News /technology /

HOW TO BLUR YOUR BACKGROUND TO AVOID DISTRACTIONS IN GOOGLE MEET UMG GH

Google Meet Blur: గూగుల్ మీట్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయాలా..? ఇదిగో ఇటు ఓసారి లుక్కేయండీ.. ఈజీగా ఛేంజ్ అవుతుంది..!

గూగుల్ మీట్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయాలా..?

గూగుల్ మీట్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయాలా..?

బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అనేది గూగుల్ మీట్‌లో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో ఒకటి. ఇది యూజర్లు తమ ఇంటిలో ఉన్న వస్తువులు, కనిపించకుండా దాచిపెట్టడానికి వారి బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసే వీలు కల్పిస్తుంది. బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మీ వెనుక వైపు ఉన్నవాటిని వ్యక్తులు చూడకుండా, మీపై దృష్టి పెట్టేలా చేస్తుంది.

ఇంకా చదవండి ...
కరోనా విజృంభన తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home)కి అలవాటు పడ్డారు. అలానే ఆఫీస్‌ మీటింగ్స్‌ కోసం వీడియో కాన్ఫరెన్స్ యాప్స్‌ను వాడటం ప్రారంభించారు. వీటిలో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి వాటితో పాటు గూగుల్ మీట్ (Google Meet) కూడా బాగా పాపులరైంది. ఈ యాప్ లేదా సాఫ్ట్‌వేర్ ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్‌లో పాల్గొనవచ్చు. అలానే మీటింగ్ స్టార్ట్ కాకముందే మీ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ (Background Blur) చేయవచ్చు లేదా బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా మార్చుకోవచ్చు. దీనివల్ల వెనక ఏం జరుగుతున్నా లేదా అపరిశుభ్రంగా ఉన్నా ఏం ఆందోళన పడకుండా ఆఫీస్‌ మీటింగ్స్‌లో పాటిస్పేట్ చేయవచ్చు. మరి గూగుల్ మీట్‌లో అందించిన ఈ అత్యంత ఉపయోగకరమైన ఫీచర్‌ని ఎలా టర్న్-ఆన్ చేయాలి? అనేది సింపుల్ స్టెప్స్‌లో తెలుసుకుందాం.

బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అనేది గూగుల్ మీట్‌లో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో ఒకటి. ఇది యూజర్లు తమ ఇంటిలో ఉన్న వస్తువులు, కనిపించకుండా దాచిపెట్టడానికి వారి బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసే వీలు కల్పిస్తుంది. బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మీ వెనుక వైపు ఉన్నవాటిని వ్యక్తులు చూడకుండా, మీపై దృష్టి పెట్టేలా చేస్తుంది.

ఇదీ చదవండి: హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!


గూగుల్ మీట్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎలా చేయాలి

1. మొదటగా Google Meet యాప్‌ని ఓపెన్ చేయాలి.

2. మీటింగ్ కోడ్ లేదా లింక్‌ని ఎంటర్ చేయాలి. మీరు సమావేశాన్ని హోస్ట్ చేస్తుంటే... మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఆపై మీటింగ్ లోకి ఎంటర్ అవ్వాలి.

3. సెల్ఫ్-వ్యూ ప్రివ్యూలో అప్లై విజువల్ ఎఫెక్ట్స్ (Apply Visual Effects) బటన్‌ను క్లిక్ చేయాలి. ఈ బటన్‌ అనేది మీటింగ్ రూమ్ పేజీ కింద రైట్ సైడ్‌లో 3-డాట్స్‌గా కనిపిస్తుంది.

4. ఇక్కడ బ్లర్ (Blur), బ్యాక్‌గ్రౌండ్ (Background) వంటి కేటగిరీలతోపాటు రకరకాల ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి.

5. బ్లర్ చేయడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పూర్తిగా బ్లర్ చేస్తే.. మరొకటి తేలికైన బ్లర్ ఎఫెక్ట్ చూపిస్తుంది.

6. బ్లర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, విండోను క్లోజ్ చేయాలి. అప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ మీకు, మీటింగ్‌లోని ఇతర సభ్యులకు బ్లర్‌గా కనిపిస్తుంది.



మొబైల్‌లో కూడా సెల్ఫీ ఫ్యూ ప్రివ్యూ లో ఎఫెక్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు బ్లర్ ఎఫెక్ట్ పొందవచ్చు. మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయడమే కాకుండా దాన్ని మార్చవచ్చు. గూగుల్ మీట్ ఆఫర్ చేసే రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఒకదాన్ని ఎంచుకోవచ్చు లేదా మీరు మీ పీసీ నుంచి మీ బ్యాక్‌గ్రౌండ్ ఉపయోగించాలనుకుంటున్న ఫొటో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. విండోస్, ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ ఈ విధానం ఒకేలా ఉంటుంది. Mac OSలో మీ Google Meet బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడానికి, మీటింగ్ కంట్రోల్స్‌లో త్రీ-డాట్ మెనూని సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చాలి. లేదంటే మీ అవసరానికి అనుగుణంగా బ్లర్ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Google, Google Meet, Meeting, Work From Home

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు