ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది చాలామందికి ఒక నిత్యావసరంగా మారింది. వివిధ రకాల పనులను సులభతరం చేసే ఈ గాడ్జెట్స్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఫోన్ తయారీ కంపెనీలు వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకు అసౌకర్యం కలిగించే ఏ వ్యక్తి ఫోన్ నంబర్‌ను అయినా సులభంగా బ్లాక్ చేయవచ్చు. ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇందుకు స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మీ డివైజ్‌లో ఎవరి కాంటాక్ట్ నంబర్‌ను అయినా ఎలా బ్లాక్ చేయాలి, అన్‌బ్లాక్ చేయాలి అనేది తెలుసుకుందాం.
* ఐఫోన్‌లో కాంటాక్ట్‌ను ఎలా బ్లాక్ చేయాలి?
- ఐఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి, "Phone" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు డిస్‌ప్లే అయ్యే ట్యాబ్స్ నుంచి ‘Blocked Contacts’ను ఎంచుకోండి.
- మీకు కనిపించే "Add New" అనే ఆప్షన్‌పై నొక్కండి.
- ఏదైనా ఫోన్ నంబర్‌ను లేదా కాంటాక్స్ నుంచి వారి పేరును ఎంచుకొని ఇక్కడ యాడ్ చేస్తే, వారి నంబర్ బ్లాక్ అవుతుంది.
* ఐఫోన్‌లో కాంటాక్ట్‌ను ఎలా అన్- బ్లాక్ చేయాలి
- ఐఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి, "Phone" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- రిజల్ట్ లిస్ట్‌లో నుంచి "Blocked Contacts"పై నొక్కండి.
- ఇప్పుడు టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే "Edit"ను సెలక్ట్ చేసుకోండి.
- ఈ లిస్ట్‌లో మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వీటినుంచి అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పక్కన ఉన్న “Remove” అనే ఎరుపు రంగు మైనస్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
- కాంటాక్ట్‌ను అన్-బ్లాక్ చేయడాన్ని కన్ఫర్మ్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో "Done"పై నొక్కండి.
* ఆండ్రాయిడ్ ఫోన్‌లో కాంటాక్ట్‌ను ఎలా బ్లాక్, అన్-బ్లాక్ చేయాలి?
- స్మార్ట్‌ఫోన్ ఓపెన్ చేసి Phone యాప్ ఓపెన్ చేయండి.
- టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు నిలువు చుక్కలపై నొక్కండి.
- రిజల్ట్స్ నుంచి "Settings" ఎంచుకోండి.
- ఇందులో "Call blocking settings"కి వెళ్లండి.
- సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే "Blocked numbers" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- కొత్తగా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలనుకుంటే.. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న + ఐకాన్‌ను ప్రెస్ చేసి కాంటాక్ట్ నంబర్‌ను యాడ్ చేస్తే చాలు.
- కాంటాక్ట్ నంబర్‌ను అన్‌బ్లాక్ చేయాలనుకుంటే.. ఆ నంబర్ పక్కన కనిపించే “X” ఐకాన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ సెట్టింగ్స్ యూజర్ల డివైజ్‌ను బట్టి మారవచ్చు.
యూజర్లు కాల్ హిస్టరీ లేదా కాంటాక్ట్స్ నుంచి కూడా నంబర్‌ను బ్లాక్ చేయవచ్చు. ఏదైనా నంబర్‌పై క్లిక్ చేసి, ‘More’ అనే ఆప్షన్ నుంచి నేరుగా కాంటాక్ట్‌ను బ్లాక్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Apple iphone, Block, Smart phones