Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

Amazon Prime: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘ప్రైమ్ మెంబర్షిప్’ పేరుతో అనేక ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ ను 30 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆపై మెంబర్షిప్ ను కంటిన్యూ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

news18-telugu
Updated: October 20, 2020, 1:31 PM IST
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టెప్స్ ఫాలో  అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘ప్రైమ్ మెంబర్షిప్’ పేరుతో అనేక ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. ఫెస్టివల్ సీజన్లో భాగంగా ప్రైమ్ మెంబర్లకు ముందస్తుగానే అనేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారు ప్రత్యేక డీల్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్‌ యాక్సెస్లను ఉచితంగా పొందుతారు. అమెజాన్ సైట్ నుండి కొనే ఏ వస్తువుకైనా ప్రైమ్ మెంబర్లకు ఉచిత డెలివరీ సదుపాయం ఉంటుంది. మీరు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ పై కొత్త సినిమాలను, వెబ్సిరీస్ లను ఉచితంగా చూడవచ్చు. అమెజాన్ మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వారు నెలసరి చందా రూ .129 మరియు సంవత్సర చందా రూ .999 చెల్లించాల్సి ఉంటుంది.  ప్రైమ్ మెంబర్షిప్ ను 30 రోజుల పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆపై మెంబర్షిప్ ను కంటిన్యూ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ గా మారండిలా..

స్టెప్ 1: అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. లేదా మీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లో అమెజాన్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 2: అమెజాన్ యాప్లో టాప్ లెఫ్ట్లో కనిపించే మెనూలోకి వెళ్లి "ట్రై ప్రైమ్" ఆప్షన్ పై క్లిక్ చేయండి. లేదా వెబ్‌సైట్ అయితే కుడివైపున కనిపించే "ట్రై ప్రైమ్" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: "నెలకు రూ .129తో ప్రైమ్ చేరండి" లేదా "సంవత్సరానికి రూ .999తో ప్రైమ్‌లో చేరండి" అనే ఆప్షన్లను ఎంచుకోండి.
స్టెప్ 4: మీరు ఎంచుకున్న కాలానికి అయ్యే మొత్తం చందాను ఆన్లైన్లో చెల్లింపు చేసి మెంబర్షిప్ ప్రక్రియను పూర్తి చేయండి.

మీ చెల్లింపు విజయవంతంగా పూర్తవ్వగానే మీరు అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్ అవుతారు. దీంతో అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ షోలు మరియు నూతన సినిమాలు, వెబ్సిరీస్ లను ఉచితంగా చూడవచ్చు. ప్రైమ్ మెంబర్స్ ప్రత్యేక డిస్కౌంట్లు మరియు ఉచిత డెలివరీ సదుపాయం వంటి ప్రోత్సాహకాలను పొందవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: October 20, 2020, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading