HOW TO BACKUP WHATSAPP PHOTOS CHATS AND ENABLE SECURITY FEATURE KNOW HERE GH VB
WhatsApp Backup: వాట్సాప్ బ్యాకప్ ఆప్షన్ గురించి మీకు తెలుసా..? ఫొటోలు, చాట్స్‌ను ఇలా బ్యాకప్ చేసుకోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సాప్ యూజర్లు చాట్స్‌ను డైలీ, వీక్లీ, మంత్లీ ఇలా రకరకాల టైమ్స్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకోవచ్చు. మరి వాట్సాప్‌లో మీ చాట్స్‌ను ఎలా బ్యాకప్ చేసుకోవాలి? వాటిని సెక్యూర్‌గా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్(Chat) చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు వాట్సాప్ (WhatsApp)ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యాప్‌లో జరిపిన పర్సనల్ చాట్స్ (Chats)ను మళ్లీ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలని యూజర్లు(Users) అనుకోవడం సహజం. ఈ చాట్స్ వారికి ఒక మంచి మెమరీ(Memory) లాగా మిగిలిపోతాయి. అయితే యూజర్లకు ఎంతో ఇంపార్టెంట్(Important) అయిన ఈ చాట్స్‌ను భద్రంగా సేవ్(Save) చేసుకునేందుకు వాట్సాప్ చాట్ బ్యాకప్ (Chat Backup) ఫీచర్‌ను(Feature) అందిస్తోంది. మీ పర్సనల్ చాట్ డేటాను కట్టుదిట్టమైన ప్రైవసీతో గూగుల్ డ్రైవ్ (Google Drive)లో బ్యాకప్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లు చాట్స్‌ను డైలీ, వీక్లీ, మంత్లీ ఇలా రకరకాల టైమ్స్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్(Automatic Backup) చేసుకోవచ్చు. మరి వాట్సాప్‌లో మీ చాట్స్‌ను ఎలా బ్యాకప్ చేసుకోవాలి? వాటిని సెక్యూర్‌గా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ చాట్స్‌ను గూగుల్ డ్రైవ్‌కి బ్యాకప్ చేయడం ఎలా?
స్టెప్ 1: వాట్సాప్ మెయిన్ స్క్రీన్‌లో టాప్ రైట్ కార్నర్లో ఉన్న త్రీ డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2: సెట్టింగ్స్‌పై నొక్కి చాట్స్> చాట్ బ్యాకప్ > బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
స్టెప్ 3: "నెవర్" కాకుండా బ్యాకప్ టైమ్ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి.
మీరు బ్యాకప్‌ని డైలీ, వీక్లీ లేదా మంత్లీకి సెట్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా కాకుండా మాన్యువల్‌గా బ్యాకప్ చేసుకోవాలంటే “ఓన్లీ వెన్ ఐ ట్యాప్ బ్యాకప్ (Only when I tap Back up)” ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే ప్రతిసారీ మాన్యువల్‌గా బ్యాకప్ చేసుకోవడం కాస్త శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఆటోమేటిక్‌గా ఒక టైమ్‌లో బ్యాకప్ అయ్యేలా సెట్ చేసుకుంటే మంచిది.
స్టెప్ 4: ఇప్పుడు చాట్ హిస్టరీని బ్యాకప్ చేయాలనుకుంటున్న గూగుల్ అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 5: గూగుల్ అకౌంట్ యాడ్ చేయకపోతే “యాడ్ అకౌంట్” పై నొక్కి, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి.
స్టెప్ 6: బ్యాకప్ల కోసం వైఫై లేదా మొబైల్ నెట్‌వర్క్‌లో ఒక దానిని ఎంచుకునేందుకు "బ్యాకప్ ఓవర్ (Backup Over)"పై క్లిక్ చేయాలి. సెల్యులార్ డేటా నెట్వర్క్ ద్వారా బ్యాకప్ చేయాలని ఎంచుకుంటే... మీరు చాలా డేటాను కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వైఫై సెలెక్ట్ చేసుకోవడం బెటర్.
వాట్సాప్ బ్యాకప్ కోసం సెక్యూరిటీ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేయాలి?
మీరు మీ చాట్స్‌ను థర్డ్-పార్టీ సర్వీస్‌కి బ్యాకప్ చేస్తున్నందున.. వాటికి ఎక్స్ట్రా సెక్యూరిటీ అందించడం తప్పనిసరి. అయితే గూగుల్ డ్రైవ్‌లోని బ్యాకప్ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతను వాట్సాప్ అందిస్తోంది.
స్టెప్ 1: వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్> చాట్స్> చాట్ బ్యాకప్ > ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇప్పుడు, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు లేదా 64-అంకెల ఎన్క్రిప్షన్ కీని యూజ్ చేయవచ్చు.
స్టెప్ 4: ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్‌ని క్రియేట్ చేయడానికి ఈ రెండు ఆప్షన్లలో "క్రియేట్ పాస్వర్డ్" ఆప్షన్ పై క్లిక్ చేయండి. అంతే, మీ చాట్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ యాడ్ అవుతుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.