• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • HOW TO BACKUP AND RESTORE WHATSAPP CHATS ON YOUR ANDROID SMARTPHONE MK GH

WhatsApp Chats Backup: కొత్త ఫోన్​ వాడుతున్నారా?.. అయితే మీ పాత ఫోన్​లోని వాట్సాప్ చాట్ బ్యాకప్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

WhatsApp Chats Backup: కొత్త ఫోన్​ వాడుతున్నారా?.. అయితే మీ పాత ఫోన్​లోని వాట్సాప్ చాట్ బ్యాకప్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Chats Backup: మెసేజ్​ చేయడానికి, ఫోటోలు, వీడియోలను పంపుకోవడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి వాట్సాప్​ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఫోన్​ మార్చినప్పుడు లేదా ఫోన్​ పోగొట్టుకున్నప్పుడు అందులోని విలువైన డేటా పోతుంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు వాట్సాప్​ బ్యాకప్​ అనే ఆప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది.

  • Share this:
ప్రముఖ చాటింగ్​ యాప్ వాట్సాప్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాట్సాప్​ ఇటీవల తెచ్చిన నూతన ప్రైవసీ విధానం వివాదాస్పదం అయినా సరే.. ఇప్పటికీ నెంబర్​ 1 చాటింగ్​ యాప్​గా కొనసాగుతోందంటే దీని హవా ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు, దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్​ను ఉపయోగిస్తున్నారు. మెసేజ్​ చేయడానికి, ఫోటోలు, వీడియోలను పంపుకోవడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి వాట్సాప్​ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఫోన్​ మార్చినప్పుడు లేదా ఫోన్​ పోగొట్టుకున్నప్పుడు అందులోని విలువైన డేటా పోతుంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు వాట్సాప్​ బ్యాకప్​ అనే ఆప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు ఫోన్​ డేటా బ్యాకప్​ను సృష్టించుకోవచ్చు. తద్వారా మీరు మీరు కొత్త ఫోన్​కు మారినప్పటికీ మీ డేటాను పునరుద్ధరించవచ్చు.

మీ వాట్సాప్ చాట్‌ను బ్యాకప్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
స్టెప్​ -1: మీ ఫోన్​లోని వాట్సాప్‌ యాప్​ ఓపెన్​ చేయండి. స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్​ ఆప్షన్​ను ఎంచుకోండి.
స్టెప్​ -2: సెట్టింగ్స్​లోని ‘చాట్స్​’ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. ఆపై ‘చాట్ బ్యాకప్’లోకి వెళ్లండి. గూగుల్​ చాట్‌లో మీ చాటింగ్​ మొత్తాన్ని బ్యాకప్ చేయడానికి ‘చాట్ బ్యాకప్’ ఆప్షన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. రోజువారీ, వార, నెలవారీ బ్యాకప్​ను మీరు ఎంచుకోవచ్చు.
స్టెప్​ -3: మీరు వారానికొకసారి చాట్​ బ్యాకప్ చేయాలనుకుంటే ‘వీక్లీ’ ఆప్షన్​ను ఎంచుకోండి.
స్టెప్​ -4: మీ చాట్‌ను బ్యాకప్ చేయాలనుకుంటున్న గూగుల్​ అకౌంట్​ను ఎంచుకోండి.
స్టెప్​ -5: బ్యాకప్ కోసం మీకు ఇష్టమైన మోడ్‌ను ఎంచుకోండి. వీటిలో మీకు వై-ఫై లేదా సెల్యులార్​ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
స్టెప్​ -6: మీరు వాట్సాప్‌లో పంచుకున్న వీడియోలను బ్యాకప్ చేయాలనుకుంటే ‘ఇంక్లూడ్​ వీడియోస్​’ ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోండి. ఇది ఆప్షనల్ ఎంపిక మాత్రమే.
స్టెప్​ -7: మీరు మీ గూగుల్​ డిస్క్ సెట్టింగులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత గ్రీన్​ కలర్​లో ఉన్న ‘బ్యాకప్’ ఐకాన్​పై క్లిక్​ చేయండి. ఇది మీరు ఎంచుకున్న గూగుల్​ డిస్క్ అకౌంట్​లోకి మీ మెసేజెన్​ అన్నింటినీ అప్‌లోడ్ లేదా బ్యాకప్ చేస్తుంది.

కొత్త ఫోన్​లో మీ వాట్సప్​ చాట్​ బ్యాకప్​ పొందడం ఎలా?
స్టెప్​ -1: వాట్సాప్ యాప్ కొత్త వెర్షన్​ను ఇన్​స్టాల్​ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, మీ డివైజ్​లో కాంటాక్ట్స్​, ఫోటోలు, మీడియాలు, ఫైల్స్​ను యాక్సెస్ చేయడానికి వాట్సాప్‌కు అనుమతివ్వండి. అయితే, చాట్​ బ్యాకప్​ కోసం లేటెస్ట్​ వెర్షన్​ ఇన్​స్టాల్​ చేసుకోవడం మర్చిపోవద్దు.
స్టెప్​ -2: ఆ తర్వాత మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్​ చేసి వెరిఫికేషన్​ పూర్తి చేయండి. ఆ తర్వాత మీరు మీ ఫోన్‌లో 6- అంకెల వెరిఫికేషన్​ కోడ్‌ను SMS ద్వారా పొందుతారు. తద్వారా అది ఆటోమేటిక్​గా వెరిఫికేషన్​ పూర్తవుతుంది.
స్టెప్​-3: మీ సంఖ్య వాట్సాప్​ నెంబర్​ వెరిఫికేషన్​ పూర్తయిన తర్వాత, ‘రీస్టోర్​ బ్యాకప్‌’ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. ఫలితంగా గూగుల్​ క్లౌడ్​లోని మీ వాట్సాప్​ మెసేజెస్ పునరుద్ధరించబడతాయి. మీ పాత ఫోన్​లో ఏదైతే గూగుల్​ అకౌంట్​ వాడారో.. అదే అకౌంట్​తో కొత్త ఫోన్​లో కూడా సైన్​ ఇన్​ అవ్వండి.
స్టెప్​ -4: ‘నెక్ట్స్​’పై క్లిక్​ చేయండి.
స్టెప్​ -5: ఆ తర్వాత ‘ప్రొఫైల్​ ఇన్ఫో’ విండో ఓపెన్​ అవుతుంది. దానిలో మీ పేరును టైప్ చేయండి.
స్టెప్​ -6: మీ పాత వాట్సాప్​ డేటా బ్యాకప్​ పూర్తి కావడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. మీ అన్ని పాత మెసేజెస్​ పునరుద్ధరించబడతాయి.
First published: