HOME »NEWS »TECHNOLOGY »how to avoid smartphone exploding

మీ స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలంటే...

మీ స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలంటే...
మీ స్మార్ట్‌ఫోన్ పేలకుండా ఏం చేయాలంటే... (ప్రతీకాత్మక చిత్రం)

స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ ఛార్జింగ్‌లో పెట్టి ఉంచకూడదు. ఛార్జింగ్‌లో పెట్టి స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేయకూడదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి హెడ్‌ఫోన్స్‌లో పాటలు వినడం చాలామందికి అలవాటు. ఇది చాలా ప్రమాదకరం. ఫోన్ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఛార్జర్ డిస్‌కనెక్ట్ చేయాలి. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి.

  • Share this:
    ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లు పేలుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల రాజస్తాన్‌లో ఫోన్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. అర్థరాత్రి నిద్రపోతుండగా జేబులో స్మార్ట్‌ఫోన్ పేలడంతో ఈ ఘటన జరిగింది. అజాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఘటన ఎవరికైనా జరగొచ్చు. అతిగా ఛార్జింగ్ చేయడం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల స్మార్ట్‌ఫోన్స్ పేలుతుంటాయి. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

    నిద్రపోయేప్పుడు దిండు కింద స్మార్ట్‌ఫోన్ పెట్టకూడదు. మీరు దిండుపై తల పెట్టినప్పుడు స్మార్ట్‌ఫోన్ ఒత్తిడికి గురై ఏదైనా జరగొచ్చు. స్మార్ట్‌ఫోన్ పేలిపోయే అవకాశాలుంటాయి. స్మార్ట్‌ఫోన్‌ని మీ బ్యాక్ పాకెట్‌లో పెట్టకూడదు. స్మార్ట్‌ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ మీకు చేటు చేస్తుంది. ఫోన్ జేబులోనే విరిగిపోయే అవకాశముంది. అందుకే బ్యాక్ పాకెట్‌లో స్మార్ట్‌ఫోన్ పెట్టకూడదు.



    స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ ఛార్జింగ్‌లో పెట్టి ఉంచకూడదు. ఛార్జింగ్‌లో పెట్టి స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేయకూడదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి హెడ్‌ఫోన్స్‌లో పాటలు వినడం చాలామందికి అలవాటు. ఇది చాలా ప్రమాదకరం. ఫోన్ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఛార్జర్ డిస్‌కనెక్ట్ చేయాలి. ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే ఉపయోగించాలి.

    నిప్పు, మంటకు దగ్గరగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించకూడదు. మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పాడైతే ఒరిజినల్ బ్యాటరీతోనే రీప్లేస్ చేయాలి. డూప్లికేట్ బ్యాటరీలు ఉపయోగించకూడదు. ఎండలో మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ చేయకూడదు. ఎండలో మీ ఫోన్ వేడిగా ఉంటుంది. ఛార్జింగ్ పెడితే ఫోన్ ఇంకా వేడెక్కుతుంది.

    ఇవి కూడా చదవండి:

    వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

    2019లో 5 బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు ఇవే...

    అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్... రూ.200 లోపు జియో నుంచి చవకైన ప్లాన్స్

    2019లో లాంగ్ వీకెండ్స్ జాబితా ఇదే... టూర్ ప్లాన్ చేసుకోండిలా...
    Published by:Santhosh Kumar S
    First published:January 04, 2019, 09:40 am

    टॉप स्टोरीज