హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

How to Auto delete your YouTube History: మీ యూట్యూబ్ హిస్టరీని ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండి ఇలా

How to Auto delete your YouTube History: మీ యూట్యూబ్ హిస్టరీని ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండి ఇలా

How to Auto delete your YouTube History: మీ యూట్యూబ్ హిస్టరీని ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to Auto delete your YouTube History: మీ యూట్యూబ్ హిస్టరీని ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to Auto delete your YouTube History | మీరు యూట్యూబ్‌లో చూసిన వీడియోల హిస్టరీని, సెర్చ్ హిస్టరీని డిలిట్ చేయాలనుకుంటున్నారా? ఆటోమెటిక్‌గా ఈ వివరాలు డిలిట్ చేయొచ్చు.

యూట్యూబ్... పరిచయం అక్కర్లేని పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్. మీరు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారా? మీరు చూసిన వీడియోల హిస్టరీ ఎప్పటికప్పుడు డిలిట్ చేస్తుంటారా? మీరు ప్రత్యేకంగా యూట్యూబ్ హిస్టరీ డిలిట్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ హిస్టరీని ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ మారిస్తే చాలు. యూట్యూబ్ యూజర్లు హిస్టరీని ప్రత్యేకంగా డిలిట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ హిస్టరీ ఆటోమెటిక్‌గా డిలిట్ చేసే ఆప్షన్ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కేవలం సెట్టింగ్స్ మార్చడం ద్వారా ఈ పని సులువవుతుంది. యూట్యూబ్ హిస్టరీ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయడం ఎలా? (How to Auto delete your YouTube History) అన్న విషయం తెలుసుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ ద్వారా ఎవరైనా మీ యూట్యూబ్ వీడియో హిస్టరీని సులువుగా చెక్ చేయొచ్చు. ఇతరుల చేతికి మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ వెళ్లిందంటే మీరు చూసిన వీడియోల లిస్ట్ ఈజీగా తెలుసుకోగలరు. అయితే మీరు యూట్యూబ్‌లో మీరు చూసిన మొదటి వీడియో నుంచి మొత్తం హిస్టరీని డిలిట్ చేయొచ్చు. యూజర్లకు ప్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఈ ఆప్షన్ ఇస్తోంది గూగుల్. మీ యూట్యూబ్ హిస్టరీని ఆటోమెటిక్‌గా డిలిట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

యూట్యూబ్ హిస్టరీ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండిలా


Step 1- ముందుగా మీ గూగుల్ అకౌంట్ లాగిన్ అవండి.

Step 2- మీ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

Step 3- ఆ తర్వాత Manage Your Google Account ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

Step 4- గూగుల్ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.

Step 5- Privacy and Personalization సెక్షన్‌లో Manage your data and privacy ఆప్షన్ క్లిక్ చేయండి.

Step 6- ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే హిస్టరీ సెట్టింగ్స్ ఉంటాయి.

Step 7- ఆ తర్వాత YouTube History పైన క్లిక్ చేయండి.

Step 8- Auto Delete ఆన్ చేయండి.

Step 9- ఓ పాప్ అప్ కనిపిస్తుంది. అందులో టైమ్ సెలెక్ట్ చేయాలి.

Step 10- 3 నెలలు, 18 నెలలు, 26 నెలల ఆప్షన్స్ ఉంటాయి.

Step 11- వీటిలో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

Step 12- కన్ఫామ్ చేస్తే ఆటో డిలిట్ ఆప్షన్ ఆన్ అవుతుంది.

మీరు 3 నెలల ఆప్షన్ ఎంచుకుంటే మూడు నెలల కన్నా ముందు చూసిన వీడియోల హిస్టరీ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతుంది. సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ కూడా క్లియర్ అవుతుంది. అయితే మీరు గత మూడు నెలల్లో చూసిన వీడియోల హిస్టరీ డిలిట్ చేయాలనుకుంటే మ్యాన్యువల్‌గా చేయాల్సి ఉంటుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Smartphone, Youtube

ఉత్తమ కథలు