Home /News /technology /

HOW TO ADD LINK TO YOUR INSTAGRAM STORY FOLLOW THESE SIMPLE STEPS TO ADD LINK TO INSTA STORY SS

How to add link to your Instagram Story: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి లింక్ యాడ్ చేయండి ఇలా

How to add link to your Instagram Story: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి లింక్ యాడ్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to add link to your Instagram Story: ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి లింక్ యాడ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to add link to your Instagram Story | ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో 10,000 పైనే ఫాలోయర్స్ ఉన్నవారికే స్టోరీలో (Insta Story) లింక్ యాడ్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇటీవల ఈ ఫీచర్ యూజర్లు అందరికీ రిలీజ్ చేసింది ఇన్‌స్టాగ్రామ్.

ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ ఫీచర్స్ వాడుకోవడం తెలియక యూజర్లు ఇబ్బందిపడుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫీచర్స్ (Instagram features) వాడుకొని ఫాలోయర్స్‌ని పెంచుకునేవారు కోట్లల్లో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ అందించే ఫీచర్స్ వల్లే ఈ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ పాపులర్ అయింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో (Instagram Stories) లింక్స్ యాడ్ చేసే సదుపాయాన్ని యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి లింక్ ఎలా యాడ్ చేయాలన్న (How to add link to your Instagram Story) డౌట్ యూజర్లలో ఉంది. మీరు బిజినెస్ ప్రొఫైల్ లేదా క్రియేటర్ ప్రొఫైల్ ఉపయోగిస్తున్నట్టైతే, మీకు ఫాలోయర్స్ ఎక్కువగా ఉంటే మీ ఇన్‌స్టా స్టోరీస్‌లో లింక్స్ యాడ్ చేయొచ్చు.

Smart Speaker Free: ఈ ఆఫర్ మళ్లీ రాదు... స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ స్పీకర్ ఉచితం

గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 వేలకన్నా ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే ఈ ఫీచర్ ఉపయోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు యూజర్లు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. స్టోరీస్‌కు లింక్స్ యాడ్ చేయడం ద్వారా అనేక బ్రాండ్స్ తమ ఫాలోయర్స్‌ని పెంచుకుంటున్నాయి. యూజర్లు స్వైప్ అప్ చేసిన తర్వాత స్టోరీ చివర్లో ఉండే లింక్ క్లిక్ చేస్తూ ఉంటారు. ఇన్‌స్టా స్టోరీలో లింక్ యాడ్ చేయడం చాలా ఈజీ. ఎలాగో తెలుసుకోండి.

Smartphone Offer: ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు రోజుల బ్యాటరీ లైఫ్... ఆఫర్ ధర రూ.10,000 లోపే


ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి లింక్ యాడ్ చేయండి ఇలా


Step 1- ముందుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ యాప్ చేయండి.

Step 2- ఆ తర్వాత ఎడమవైపు + ఐకాన్ క్లిక్ చేయండి.

Step 3- ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి.

Step 4- ఫోటో లేదా యాడ్ కంటెంట్ పైన క్లిక్ చేయండి.

Step 5- మళ్లీ స్క్రీన్ పైన వేర్వేరు ఆప్షన్స్ కనిపిస్తాయి.

Step 6- స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

Step 7- లొకేషన్ సహా పలు ఆప్షన్స్ కనిపిస్తాయి.

Step 8- లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

Step 9- ఓ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు యాడ్ చేయాలనుకునే లింక్ ఎంటర్ చేయండి.

Step 10- ఇందులో మీరు టెక్స్‌ట్ మార్చొచ్చు. కలర్ కూడా మార్చొచ్చు.

Step 11- ఆ తర్వాత Done పైన క్లిక్ చేయండి.

Step 12- స్టోరీకి లింక్ యాడ్ అవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Instagram, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు