Technology : అస‌లు పాస్‌వ‌ర్డ్ ఎలా పెట్టాలి.. ఎలాంటి పాస్‌వ‌ర్డ్ పెడితే న‌ష్టం

(ప్రతీకాత్మక చిత్రం)

పాస్‌వ‌ర్డ్ఇ (Password) ప్పుడు ప్ర‌తీ దానికి అవ‌స‌ర‌మే.. ఈ మెయిల్‌కు, బ్యాంక్ లాగిన్‌ (Bank Login), ఫోన్‌ల‌కు, ఇలా ఒక్క‌టేమిటి అన్నింటికీ పాస్‌వ‌ర్డ్ కావాల్సిందే. అయితే రోజు వారీ జీవితంలో పాస్‌వ‌ర్డ్‌ల సంఖ్య ఎక్కువ‌ అవ్వ‌డంతో చాలా మంది సుల‌భ‌మైన పాస్‌వ‌ర్డ్‌లు పెడుతుంటారు. అలా కాకుండా పాస్‌వ‌ర్డ్ హ్యాక్ అవ్వ‌కుండా ఎలా పెట్టాలో తెలుసుకోంది.

  • Share this:
    పాస్‌వ‌ర్డ్ఇ (Password) ప్పుడు ప్ర‌తీ దానికి అవ‌స‌ర‌మే.. ఈ మెయిల్‌కు, బ్యాంక్ లాగిన్‌ (Bank Login), ఫోన్‌ల‌కు, ఇలా ఒక్క‌టేమిటి అన్నింటికీ పాస్‌వ‌ర్డ్ కావాల్సిందే. అయితే రోజు వారీ జీవితంలో పాస్‌వ‌ర్డ్‌ల సంఖ్య ఎక్కువ‌ అవ్వ‌డంతో చాలా మంది సుల‌భ‌మైన పాస్‌వ‌ర్డ్‌లు పెడుతుంటారు. అక్క‌డే అంద‌రూ పొర‌పాటు చేస్తుంటారు. ఇలా సుల‌భంగా పెట్టిన పాస్‌వ‌ర్డుల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు (Cyber criminals) ప‌ట్టేస్తుంటారు. సుల‌భ‌మైన పాస్‌వ‌ర్డ్‌లు పెడితే మ‌న డేటాను చోరీ చేయ‌డానికి వారిని మ‌రింత సుల‌భం. అస‌లు ఎలాంటిపాస్ వ‌ర్డ్‌లు పెట్టాలి. ఎలాంటి పాస్‌వ‌ర్డ్‌లు పెట్ట‌కూడ‌దు అనే విష‌యంపై అవ‌గాహ‌న అవ‌స‌రం. మోజిల్లా ఫౌండేషన్‌ (Mozilla Foundation)​ సంస్థ పాస్‌వర్డ్‌లపై రీసెర్చ్‌ (Research) నిర్వహించింది. ఆ రీసెర్చ్‌లో భాగంగా Haveibeenpwned.comలో దొరికిన వివరాల ఆధారంగా పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎవ‌రు ఎటువంటి పాస్‌వ‌ర్డ్‌లు పెడుతున్నారు. వాటి వ‌ల్ల న‌ష్ట‌పోతున్నారో తెలిపింది.

    "హీరోల‌తో ప్ర‌మాదం"..
    మనలో చాలా మంది ఇంట్లో వాళ్ల పేర్లు, డేటా ఆఫ్‌ బర్త్‌లు నచ్చిన నెంబర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తుంటాం. మరికొందరు సైబర్‌ నేరస్తుల నుంచి సేఫ్‌గా ఉండేందుకు 123లు, abcdలను పాస్‌వర్డ్‌లుగా మార్చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రం వాళ్లకు నచ్చిన హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు.

    Smart Phone Tips : మీ ఫోన్ హ్యాక్ అయ్యింద‌ని అనుమానంగా ఉందా.. ఓసారి ఇలా చెక్ చేసుకోండి


    అలా పెట్టుకోవడం చాలా ప్రమాదమని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా హీరోల పాస్‌వ‌ర్డ్‌లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెబుతున్నాయి. ముఖ్యంగా సూపర్‌ మ్యాన్‌ (Super Man), బ్యాట్‌ మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌ (Spider Man), వోల్వరైన్, ఐరన్‌ మ్యాన్‌, వండర్‌ ఉమెన్‌ (Wonder Women), డేర్‌ డెవిల్‌, థోర్‌, బ్లాక్‌ విడో (Black Widow), బ్లాక్‌ పంతార్‌ పేర్లను పెట్టుకున్న వారి అకౌంట్లు ఈజీగా హ్యక్‌ అయినట్ల మోజిల్లా ఫౌండేష‌న్ చేసిన స‌ర్వేలో వెల్ల‌డైంది.

    ఈ పాస్‌వ‌ర్డులు పెట్ట‌కూడ‌దు..
    ముఖ్యంగా వినియోగ‌దారులు '12345', '54321' పాస్‌వర్డ్‌లు పెట్ట‌కూడ‌దు ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకో తెలుసా ఈ పాస్‌వ‌ర్డ్ ఉప‌యోగించి 23 మిలియన్ల సార్లు హ్యాక్ చేసినట్లు మోజిల్లా ఫౌండేష‌న్ వెల్ల‌డించింది. '123456789' లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే సెకన్ల వ్యవధిలో హ్యాక్‌ చేస్తారని నార్డ్‌ పాస్‌ తన నివేదికలో పేర్కొంది. కాబ‌ట్టి ఈ పాస్‌వ‌ర్డులు పెట్ట‌కూడ‌దు. మీ డేట్ ఆఫ్ బ‌ర్త్ కూడా పెట్ట‌కండి. మీతోనే ఉంటూ మీ గురించి తెలిసిన‌వాళ్లు మీ పాస్‌వ‌ర్డ్‌ను క‌నిపెట్టి ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి అది కూడా మంచింది కాదు.

    ఎటువంటి పాస్‌వ‌ర్డ్‌లు పెట్టాలి.
    - హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి.
    - పాస్‌వ‌ర్డ్‌లో క‌చ్చితంగా క్యాపిటల్‌, స్మాల్ లెట‌ర్లు ఉండాలి.
    - అంతే కాకుండా స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌లు అంటే !@#$* లు ఉండాలి.
    - అప్ప‌డు హ్యాక్ చేయ‌డం క‌ష్టంగా ఉంటుంది.
    Published by:Sharath Chandra
    First published: